- రాష్ట్రంలో చర్చనీయంగా మారిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి వ్యవహారం..
- గత ప్రభుత్వంలో సివిల్ సప్లయి చైర్మన్. భార్య జడ్పీటీసీ..
- ఇందులో దాగివున్న మర్మం ఏంటని ఆరా తీస్తున్న రాజకీయ విశ్లేషకులు..
- పెద్ది స్వగ్రామంలో నేడే గ్రామసభ.. రేషన్ కార్డు ఇస్తారా..? లేదా తిరస్కరిస్తారా..?
- నల్లబెల్లి మండలంలో ఏమి జరుగనుంది వేచి చూడాలి మరి..
ఆయన మాజీ ఎమ్మెల్యే(Former MLA)..పైగా అప్పటి ప్రభుత్వంలో సివిల్ సప్లయి ఛైర్మెన్ గా వ్యవహరించారు.. నిరుపేదలకు ఇచ్చే రేషన్ కార్డు తనకు కూడా కావాలని నేటి కాంగ్రెస్ ప్రభుత్వంలో దరఖాస్తు చేసుకున్నారు.. ఇప్పుడు ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది.. కాగా నేడు ఆయన స్వగ్రామంలో గ్రామ సభ జరుగబోతోంది.. మరి పెద్ది సుదర్శన్ రెడ్డి (Peddi Sudarshan Reddy) దరఖాస్తు పై అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.. అసలెందుకు మాజీ ఎమ్మెల్యే రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారు..? దీని వెనుక ఏదైనా మతలబు వుందా..? గత ప్రభుత్వంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇచ్చిన దాఖలాలు లేవు.. మరి ఈయన రాష్ట్ర ప్రజలకు ఏమి చెప్పదలచుకున్నారు..? టిఆర్ఎస్ ప్రభుత్వంలో రేషన్ కార్డు(Ration Card)లు ఇవ్వలేదని సివిల్ సప్లై చైర్మన్ గా విధులు నిర్వర్తించిన పెద్ది సుదర్శన్ రెడ్డి వరంగల్ జిల్లా, నల్లబెల్లి మండలంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన రేషన్ కార్డుల ప్రక్రియలో దరఖాస్తు చేసుకోవడం ప్రస్తుతం సంచలనంగా మారింది.. ఈరోజు జరుగబోయే గ్రామ సభలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబుతున్నాయో చూద్దాం.