- మున్సిపల్ పరిధిలో అక్రమార్కుల హవా
- జవహర్ నగర్ మున్సిపల్ కమిషనర్ సాక్షిగా కబ్జా
- ప్రజా అవసరాల కోసం కేటాయించినా 5ఎకరాల భూమి మాయం
- టౌన్ ప్లానింగ్ అధికారి నిర్లక్ష్యంతో ప్రభుత్వ స్థలాలు కబ్జా
- ప్రభుత్వ స్థలాలపై మున్సిపల్ కమిషనర్ కు బాధ్యత లేదా
- మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కలెక్టర్ ఆదేశాలు బుట్టదాఖలేనా
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కబ్జాల పర్వం సాగుతుంది. ప్రభుత్వ భూములను అక్రమార్కులు చెరబడుతున్నారు. మున్సిపల్ అధికారుల అండతో యధేచ్చగా కబ్జాలు చేస్తున్నారు. రాజకీయ పలుకుబడితో అధికారులపై ఒత్తిడిలు తెస్తూ, మరికొందరికీ మాముళ్లు ముట్టచెప్పుతూ ఆక్రమణలు చేస్తున్నారు. ఇందులో మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో అయితే అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ భూములు, అసైన్డ్ ల్యాండ్స్, లేదా ఖాళీగా ఉన్న భూమి కండ్లకు కనబడితే చాలు పాపమే. అన్నంకు బదులు భూములు తింటున్నరా అనే అనుమానాలు రాకమానదు. హైదరాబాద్ లో భూములు చాలా కాస్లీ కావడంతో డబ్బుల కోసం కబ్జాకోరులు ఎంత వరకైనా తెగబడుతున్నారు.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ పరిధిలో టౌన్ ప్లానింగ్ అధికారి నిర్లక్ష్యంతో ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురవుతున్నాయి. ప్రజల అవసరాల కోసం సర్వే నెంబర్ 420, 432, 495, 510, 648, 647, 704, 759, 706, 173, 673 గల సుమారు 5ఎకరాల స్థలాన్ని మేడ్చల్ జిల్లా కలెక్టర్ కేటాయించారు. అలాట్మెంట్ ప్రొసీడింగ్ కింద ఉత్తర్వులు జారీ చేశారు. అట్టి స్థలంలో మోడ్రన్ టాయిలెట్, నర్సరీ, వైకుంఠ దామం, పార్క్ లు నిర్మించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. జిల్లా కలెక్టర్ ఆదేశాలు బుట్టదాఖలు అయ్యాయి. ఇలాంటి ప్రొసీడింగ్ చాలా చూశాం మాకు ఏ భూములు అయినా పర్లేదు అంటూ రెచ్చిపోయారు. మేము ఎవరి మాట వినం.. మా దారి రహదారి అన్నట్టుగా జవహర్ నగర్ రియాల్టర్లు వ్యవహరిస్తున్నారు. భూములు కబ్జా చెయ్యాలి గరీబ్ వాళ్లకు అమ్మాలి ఇదే మా రూల్ అంటున్నారు. ఇచ్చుడు మీ వంతే తప్పుకోవాల్సింది కూడా మీరే.. ఈ రోజు ఉంటాం రేపు పోతాం మాకు సంబంధం లేదు. అంత రెవెన్యూ వాళ్లదే బాధ్యతంటూ జవహర్ నగర్ టౌన్ ప్లానింగ్ అధికారి స్రవంతి అంటున్నారు.
జవహర్ నగర్ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ విభాగంలో పనిచేసే సాయి, బిల్డింగ్ వద్ద డబ్బులు వసూల్ చేసి టౌన్ ప్లానర్ స్రవంతి ఇవ్వాల్సిందే అంటున్నారు. జవహర్ నగర్ భూములలో టీఎస్ బిపాస్ లో 0.1 మాత్రమే అనుమతులు, 99% ఇల్లీగల్ ఉన్నాయి. కాప్రా తహసీల్దార్ సుచరిత విధుల్లో చాలా సీరియస్ గా ఉంటున్నారు. బల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి సర్వే నెంబర్ 432లో పెట్రోల్ పంప్ కోసం స్థలం కబ్జా చేసి పర్మిషన్ కోసం దరఖాస్తు పెట్టుకుంటే అది గవర్నమెంట్ ల్యాండ్ అని కాప్రా తహసీల్దార్ సుచరిత కొట్టి పడేశారు. కాగా, అనంతరం ఆదాబ్ హైదరాబాద్ దినపత్రిక ఇంటర్వ్యూ కు ఇలా సమాధానం ఇచ్చారు. ప్రభుత్వ భూములలో అక్రమ నిర్మాణాలు చేస్తుంటే మున్సిపల్ యంత్రాంగం ఏం చేస్తున్నట్టు, వారికి బాధ్యత లేదా టౌన్ ప్లానింగ్ అనుమతులు లేకుండా నిర్మాణాలు చేస్తూ ఉంటే ఎందుకు అడ్డుకోలేకపోతున్నారు. అదీకాక ప్రభుత్వ భూములలో షి టాయిలెట్ పార్క్, శ్మశాన వాటిక ఇలా ప్రజా అవసరాల కోసం వినియోగించాలని భూమి ఇస్తే గాలికి వదిలేశారు. అట్టి స్థలాలు కబ్జాకు గురవుతున్న ఏ మాత్రం పట్టించుకోకపొతే ఎందుకు ఉన్నట్టు అని ఘాటుగా వ్యాఖ్యానించారు.
భూ కబ్జాదాలకు అండగా నిలుస్తుంది మున్సిపల్ సిబ్బందే అన్నది. గ్రామ కంఠం కింద ఉన్నా 318ఎకరాల ప్రభుత్వ స్థలాల్లో ఉన్న నిర్మాణాలకు కలెక్టర్ నుంచి ఎన్ఓసి తీసుకొని టాక్స్ అసెస్మెంట్ చెయ్యాలి. అలాకాకుండా ఇష్టానుసారంగా అసెస్మెంట్ చేస్తూ విచ్చలవిడిగా డబ్బులు వసూల్ చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా కలెక్టర్ నుంచి ఎన్ని ఎన్ఓసిలు ఉన్నాయో చూపించండి అంటే సవాల్ విసిరారు. పార్టీలతో సంబంధం లేకుండా విధి నిర్వహణలో తనదైన స్టైల్ లో ప్రజలకు అందుబాటులో ఉంటూ భూకబ్జా దారులకు చెక్ పెట్టిన మొట్టమొదటి జవహర్ నగర్ తహసీల్దార్ సుచరిత. భూ కబ్జాదారుల గుండెలు గుబేల్ అనేలా రాత్రి, పగలు అని తేడా లేకుండా ఎక్కడికి అక్కడ అక్రమ నిర్మాణాలు కూల్చివేత. అవినీతి అక్రమాల వ్యవహారంలో కార్పొరేటర్ అయినా ఎమ్మెల్యే అయినా లెక్క చెయ్యకుండ భూ కబ్జాదారులకు చెక్ పెడుతూ నిజమైన అధికారిగా విధులు నిర్వహిస్తున్న కాప్రా తహసీల్దార్ సుచరితను కాప్రా తహసీల్దార్ గా కొనసాగిస్తారా లేదంటే ఆమెను అక్కడ్నుంచి వేరే చోటకి ట్రాన్సఫర్ చేస్తారా చూడాలి.
మేడ్చల్ జిల్లా కలెక్టర్ ప్రజల అవసరాల కోసం షి టాయిలెట్స్, చిల్డ్రన్స్ పార్క్, మినీ డంపింగ్ యార్డ్, శ్మశాన వాటికకు కేటాయించినా స్థలం మున్సిపల్ కి ల్యాండ్ అలాట్మెంట్ ప్రొసీడింగ్ ద్వారా ఇచ్చాము. ప్రస్తుతం ఆ స్థలంలో కొంత మంది భూ కబ్జాదారులు నిర్మాణాలు చేస్తున్నారు.
కాప్రా తహసీల్దార్