- 158 పైగా స్థానాల్లో కూటమిదే హావ
- 16 స్థానాల్లో వై.ఎస్.ఆర్.సి.పి లీడ్
- సంబరాలు చేసుకుంటున్న కూటమి శ్రేణులు
- జూన్ 09న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా చంద్రబాబు
నాయుడు ప్రమాణస్వీకారం చేసే అవకాశం..? - కాసేపట్లో గవర్నర్ ను కలవనున్న జగన్
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వై.ఎస్.ఆర్.సి.పి పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.175 స్థానాలకు ఎన్నికలు జరగగా 158 స్థానాల్లో కూటమి అభ్యర్థులు లిడ్ లో కొనసాగుతున్నారు.దింతో ఆంధ్రప్రదేశ్ లో కూటమి అధికారం చేపట్టడం దాదాపు ఖారైనట్టే.కూటమి విజయం ఖాయం అవ్వడంతో నారా చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడానికి ముహూర్తం ఖరారు అయినట్టు తెలుస్తుంది.ప్రధాని మోడీ కూడా చంద్రబాబు నాయుడుకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు నాలుగోసారి అమరావతిలో ప్రమాణస్వీకారం చేయబోతున్నట్టు తెలుస్తుంది.
కాసేపట్లో రాజ్ భవన్ కు జగన్
అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపి ఓటమి దాదాపు ఖరారు అవ్వడంతో జగన్ గవర్నర్ అపాయింట్మెంట్ కోరారు.మరికొద్దిసేపట్లో రాజభవన్ లో గవర్నర్ ను కలిసి సీఎం పదవికు రాజీనామా చేయనున్నారు.175 స్థానాలకు ఎన్నికలు జరగగా 158 పైగా స్థానాల్లో కూటమి హావ కొనసాగుతుంది.అధిక సంఖ్యలో కూటమి అభ్యర్థులు లిడ్ లో కొనసాగుతున్నారు.