Friday, January 31, 2025
spot_img

కులాల జాబితాను వెంటనే వర్గీకరించి, అమలులోకి తెండి

Must Read
  • కేంద్రంలో బిసిలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేయండి
  • త్వరలో చేపట్టే కులగణనలో బిసిల గణనను చేపట్టండి
  • నాన్‌క్రిమిలేయర్‌ ఆదాయ పరిమితిని 8 లక్షల నుండి 15 లక్షలకు పెంచాలి.
  • బిసిల రౌండ్‌టేబుల్‌ సమావేశంలో డా. వకుళాభరణం కృష్ణమోహన్‌ రావు డిమాండ్‌
  • డిమాండ్ల సాధనకు జాతీయ ఉద్యమ నిర్మాణానికి త్వరలో కార్యాచరణ – దుండ్ర కుమారస్వామి

జస్టిస్‌ రోహిణీ కమిషన్‌ నివేదిక మేరకు కేంద్ర ఓబిసి కులాల జాబితాను కులాలవారీగా వర్గీకరించాలని, కులగణనలో బిసి జనాభా గణనను చేపట్టాలని, బిసిలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని జాతీయ బిసి దళ్‌ ఆధ్వర్యంలో జరిగిన మేధావుల సామాజిక వేత్తల, కులసంఘాల, విద్యార్థి, యువజన, మహిళా సంఘాల ప్రతినిధుల రౌండ్‌టేబుల్‌ సమావేశం కేంద్ర ప్రభుత్వంను ఏకగ్రీవంగా డిమాండ్‌ చేసింది. చిరకాలంగా ఈ డిమాండ్ల సాధనకు బిసిలు వివిధ రూపాలలో ఉద్యమాలు చేస్తున్నప్పటికీ కేంద్రప్రభుత్వం పెడచెవిన పెట్టడం పట్ల సమావేశంలో వక్తలు నిరసన వ్యక్తం చేశారు.

శనివారం నాడు జాతీయ బిసి దళ్‌ అధ్యకక్షుడు దుండ్ర కుమారస్వామి అధ్యక్షతన రౌండ్‌టేబుల్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర బిసి కమిషన్‌ మాజీ ఛైర్మన్‌, సామాజిక న్యాయవేదిక జాతీయ సమన్వయకర్త డా|| వకుళాభరణం కృష్ణమోహన్‌రావు కీలక ఉపన్యాసం చేశారు. ఈ సందర్భంగా డా|| వకుళాభరణం ప్రసంగిస్తూ… కేంద్ర ఓబిసి కులాల జాబితాను గ్రూపులుగా వర్గీకరించి రిజర్వేషన్‌లను అమలు చేయాలని జస్టిస్‌ రోహిణీ కమిషన్‌ జూలై 31, 2023 లో నివేదిక సమర్పించినప్పటికీ కేంద్రప్రభుత్వం ఇప్పటి వరకు అమలులోకి తీసుకురాకపోవడం పట్ల ఆయన తీవ్ర విచారంను వ్యక్తంచేశారు. దేశంలోని 3500 బిసి కులాలలో, ఇప్పటికీ 1000 కులాలు విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాలలో కనీస ప్రాతినిధ్యం లేదని నివేదించినప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఓబిసి జాబితాను వర్గీకరించి రిజర్వేషన్‌లు కల్పించని కారణంగా ఎదిగిన కులాలే, ఎదుగుతున్నాయని, అవకాశాలు ఏమాత్రం రాని కులాలు మరింతగా నిర్వీర్యం అవుతున్నాయని జస్టిస్‌ రోహిణి కమిషన్‌ నివేదికలో స్పష్టం చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం నిర్దిష్టంగా చర్యలు చేపట్టకపోవడం పట్ల ఆయన నిరసన వ్యక్తం చేశారు. జనాభా గణనలో బిసి కులగణనను చేపడతామని గతంలో అప్పటి హోమ్‌ మంత్రి రాజనాథ్‌ సింగ్‌ స్పష్టంగా హామీ ఇచ్చినప్పటికీ, ఆ నిర్ణయాన్ని కేంద్రప్రభుత్వం ఎందుచేత వెనక్కి తీసుకున్నదో స్పష్టం చేయాలని ఆయన కోరారు. వచ్చే జనాభా గణనలో ఓబిసి కులగణన చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఓబిసిలకు అమలులో ఉన్న నాన్‌క్రిమిలేయర్‌ ఆదాయ పరిమితిని కేంద్ర డి.వో.పి.టి. గైడ్‌లైన్స్‌ ప్రకారం ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి పెంపుదల చేయాల్సి ఉన్నా, కేంద్రప్రభుత్వం ఉద్దేశ్య పూర్వకంగా పెంచడం లేదని ఆయన విమర్శించారు. ప్రస్తుతం అమలులో ఉన్న 8 లక్షల నాన్‌-క్రిమిలేయర్‌ ఆదాయ పరిమితిని 15 లక్షలకు వెంటనే పెంచాలని ఆయన డిమాండ్‌ చేశారు.

సమావేశానికి సారథ్యం వహించిన జాతీయ బిసి దళ్‌ అధ్యకక్షుడు దుండ్ర కుమారస్వామి ప్రసంగిస్తూ  … కేంద్రంలో బిసిలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటుకు ఈ వర్గాలు ఎన్నో ఏళ్లుగా డిమాండ్‌ చేస్తున్నప్పటికీ కేంద్రప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం పట్ల ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి కేంద్రప్రభుత్వ వైఖరి ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. దేశంలో 75 కోట్ల జనాభా కలిగిన బిసిలకు, భిక్షం వేసినట్లు 2000 కోట్లు ఏటా కేటాయించడం దుర్మార్గమని అన్నారు. తమ న్యాయపరమైన డిమాండ్‌ల సాధనకు దేశవ్యాప్తంగా బిసి వర్గాల ప్రతినిధులను కూడగట్టి థల వారీగా అనేక ఉద్యమాలను నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు. త్వరలోనే కర్ణాటక, తమిళనాడు, బీహార్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల పర్యటనకు తమ ప్రతినిధి బృందం వెళ్లనున్నట్లు ఆయన వివరించారు.

ఈ కార్యక్రమంలో బిసి పొలిటికల్‌ ఫ్రంట్‌ అధ్యకక్షుడు ఆచార్య కె.మురళీమనోహర్‌ ప్రసంగిస్తూ…. నిధుల కేటాయింపుతో సంబంధం లేని అంశాలను కూడా కేంద్రప్రభుత్వం పరిష్కరించడానికి ముందుకు రాకపోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఓబిసి ఉద్యోగులు చాలాకాలంగా ప్రమోషన్‌లలో రిజర్వేషన్‌లు కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నప్పటికీ కేంద్రం పట్టించుకోవడం లేదని అన్నారు. ఉద్యోగ నియామకాల్లో బ్యాక్‌లాగ్‌ విధానాన్ని అమలులోకి తేవాలన్న డిమాండ్‌ను కూడా పెడచెవిన పెట్టడమేంటని ఆయన ప్రశ్నించారు. బిసి ఉద్యోగుల ఫెడరేషన్‌ అధ్యకక్షుడు దేవళ్ల సమ్మయ్య ప్రసంగిస్తూ… కేంద్రం ప్రభుత్వ సంస్థలను క్రమంగా ప్రైవేట్‌పరం చేస్తూ, రిజర్వేషన్ల ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్నదని విమర్శించారు.

ఈ సమావేశంలో జాతీయ సంచారకులాల సంఘం అధ్యకక్షుడు నరహరి, ఆచార్య భాస్కర్‌, ఆచార్య వెంకటరమణ, ఆచార్య కవిలత, ఆచార్య బాగయ్య, ఆచార్య రవిచంద్ర, ఆచార్య నవీన్‌యాదవ్‌, డా|| గణపతి, హైకోర్ట్‌ న్యాయవాదులు ఓంప్రకాష్‌ యాదవ్‌, సారిక, వివిధ కుల, ప్రజా, విద్యార్థి, యువజన, మహిళా సంఘాల ప్రతినిధులు సాయిపటేల్‌, డా|| దత్తాత్రేయ, డా|| కిరణ్‌, డా|| వెంకటరమణ, డా|| కావ్య, హేమలత, డి.లక్ష్మి, సంగీత, డా|| వర్కాల వసుమతి, కె.రఘుపతి, ఎన్‌.శ్రీనివాస్‌, రమణయాదవ్‌, వి.బి.రమణ, సాయియాదవ్‌, మహేష్‌గౌడ్‌, బోయిని రాజేష్‌, బొద్దం చరణ్‌, దుండ్ర శ్రీయాన్‌, ముచ్చర్ల దీపిక, తదితరులు ప్రసంగించారు. సమావేశంలో 30 కులసంఘాల ప్రతినిధులు, 35 వివిధ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమ సమన్వయ కర్తగా జాతీయ బిసి దళ్‌ గ్రేటర్‌ హైదరాబాద్‌ కార్యదర్శి సందీప్‌ వ్యవహరించారు.

Latest News

ఎస్ఎల్ఎన్ ఫ్రీ లాంచింగ్ మోసాలు

అనుమతులు నిల్.. పబ్లిసిటీ ఫుల్ మేడ్చల్ దగ్గరలో కొత్తరకం భూదందా ఫ్రీ లాంచింగ్ పేరుతో భారీ మోసాలు గుంట భూమి.. గుండెకు ధైర్యం తల్లి జన్మనిస్తుంది భూమి పునర్జన్మణిస్తుంది సరికొత్త కొటేషన్లతో బురిడీ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS