Thursday, January 30, 2025
spot_img

అనర్హులకు చోటు దక్కొద్దు

Must Read
  • అర్హుల్లో ఒక్కరికి కూడా అన్యాయం జరగొద్దు..
  • రేప‌టి నుంచే ఆ నాలుగు పథకాలకు శ్రీకారం
  • దరఖాస్తుల ఆధారంగా లబ్దిదారుల ఎంపిక
  • పథకాల అమలుపై సిఎం రేవంత్‌ సవిూక్ష
  • గ్రామానికో అధికారి చొప్పున అమలుకు ఆదేశాలు
  • రేషన్‌ కార్డుల విషయంలో ఆందోళనలు వ‌ద్దు
  • మార్చి 31 లోపు వంద‌శాతం అమ‌లు జ‌ర‌గాలి

గతంలో హావిూ ఇచ్చిన విధంగా ఆదివారం నుంచి నాలుగు కొత్త పథకాలు ప్రారంభిస్తామని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి(Revanth Reddy) తెలిపారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌ కార్డుల పంపిణీ పథకాలను ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో మంత్రులు, అధికారులతో ఆయన పథకాల అమలుపై సవిూక్ష నిర్వహించారు. సంక్షేమ పథకాల అమలుపై చర్చించారు. గ్రామాల్లోని లబ్దిదారులకు ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిజమైన లబ్దిదారుల్లో ఏ ఒక్కరికీ అన్యాయం జరగవద్దని సూచించారు. అనర్హులకు లబ్ది చేకూరిస్తే ఆయా అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్‌ కార్డులు నాలుగు పథకాలను తెలంగాణ సర్కార్‌ లాంఛనంగా ప్రారంభించనుంది. హైదరాబాద్‌ మినహా రాష్ట్రంలోని అన్ని మండలాల్లో మండలానికో గ్రామాన్ని ఎంపిక చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. నాలుగు పథకాలకు ఒక్కో పథకానికి ఒక్కో అధికారి చొప్పున గ్రామానికి నలుగురు మండలస్థాయి అధికారులను నియమించాలని తెలిపింది. ఫిబ్రవరి మొదటివారం నుంచి మార్చి 31లోగా రాష్ట్రంలోని మిగతా గ్రామాల్లో లబ్దిదారులకు పథకాలు అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. మార్చి 31 లోపు నాలుగు పథకాలు వంద శాతం అమలు జరిగేలా చూడాలి.. నిజమైన లబ్దిదారులకు ఒక్కరికి కూడా అన్యాయం జరగొద్దు.. అనర్హులకు లబ్ది చేకూరిస్తే అధికారులపై చర్యలు తప్పవని సర్కార్‌ హెచ్చరించింది. సంక్షేమ పథకాల కోసం లక్షలాది దరఖాస్తులు వచ్చాయని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. లబ్దిదారుల వెరిఫికేషన్‌ కోసం గ్రామసభలు నిర్వహించామని, ఇచ్చిన హావిూ మేరకు రేపటి నుంచి పథకాల ప్రారంభిస్తామన్నారు.

మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌ రావు, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డితో కలిసి భట్టి విక్రమార్క విూడియాతో మాట్లాడారు. పవిత్రమైన గణతంత్ర దినోత్సవం రోజున ఇచ్చిన మాట ప్రకారం నాలుగు పథకాలు ప్రారంభిస్తున్నామన్నారు. మండలానికి ఒక గ్రామం యూనిట్‌గా తీసుకొని నాలుగు పథకాలు అమలు చేస్తున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. అర్హత కలిగిన ప్రతి వ్యక్తికి పథకాలు అందిస్తామని, మార్చి వరకు పక్రియ పూర్తి చేస్తామని భట్టి స్పష్టం చేశారు. పథకాల్లో ఎలాంటి సీలింగ్‌ లేదని, అర్హులందరికీ అందిస్తామన్నారు. ఇండ్లు, రేషన్‌ కార్డుల కోసం ఎక్కువ దరఖాస్తులు వచ్చాయన్నారు. వ్యవసాయం చేసే ప్రతీ ఒక్కరికి రైతు భరోసా ఇస్తామని భట్టి వివరించారు. నాలుగు కొత్త పథకాలు ప్రారంభించబోతున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. లబ్దిదారుల ఎంపిక కోసం గ్రామ సభలు నిర్వహించామని చెప్పారు. గ్రామాల్లో పథకాల కోసం లక్షల అప్లికేషన్లు వచ్చాయన్నారు. జ‌నవరి 26 నుంచి ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభిస్తామని చెప్పారు. వ్యవయసాయ యోగ్యమైన భూములకు రైతు భరోసా ఇస్తామన్నారు. రేషన్‌ కార్డుల విషయంలో ఎవరూ ఆందోళన చెందొద్దని చెప్పారు మంత్రి ఉత్తమ్‌. రేషన్‌ కార్డుల జారీ నిరంతర పక్రియ అని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్‌ కార్డులు ఇస్తామని తెలిపారు. ఒక్కో వ్యక్తికి 6 కిలోల సన్నబియ్యం పంపిణీ చేస్తామన్నారు.

ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో రేపు నాలుగు సంక్షేమ పథకాలు మండలంలోని ఒక గ్రామంలో మధ్యాహ్నం 1 గంటలకు లాంఛనంగా ప్రారంభిస్తామని తెలిపారు. రేషన్‌ కార్డులు, ఇండ్లు, ఆత్మీయ భరోసా, రైతు భరోసా ఇస్తామని అన్నారు. రేషన్‌ కార్డుల జారీ నిరంతర పక్రియ.. గతంలో దరఖాస్తు ఇచ్చినా, సర్వేలో వివరాలు ఇచ్చినా ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోక పోయినా ఇప్పుడు ప్రజాపాలన కేంద్రాల్లో ఇవ్వండని అన్నారు. బీపీఎల్‌ కుటుంబాలందరికి రేషన్‌ కార్డులు ఇవ్వాలని క్యాబినెట్‌ నిర్ణయించిందని పేర్కొన్నారు. గత పదేళ్ళుగా దొడ్డు బియ్యం ఇచ్చారు.. మనిషికి ఆరు కిలోల సన్న బియ్యం రేషన్‌ కార్డు ద్వారా అందిస్తామని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు. ఇకపై బయట ఆహార పదార్థాలు కొనుక్కోవాల్సి ఉండదని అనుకుంటున్నానన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. భారతదేశంలో రికార్డు స్థాయిలో పంటలు పండిరచింది తెలంగాణ రైతాంగం అని అన్నారు. దేశంలోనే రూ.7525 కోట్లు రైతుల ఖాతాల్లో వేశాం.. 21వేల కోట్ల రైతు రుణమాఫీ, 3వేల కోట్ల రైతు భీమా కట్టామని తెలిపారు. రేపట్నుంచి రాహుల్‌ గాంధీ ఇచ్చిన వాగ్దానాన్ని రైతు భరోసా అమలు చేయబోతున్నామని అన్నారు. వ్యవసాయం చేసే ప్రతీ ఒక్కరికీ రైతు భరోసా ఇస్తున్నాం.. 40 వేల కోట్లు ఒక్క సంవత్సరంలోనే రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసిందని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీఎస్‌ శాంతికుమారి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Latest News

ఎస్ఎల్ఎన్ ఫ్రీ లాంచింగ్ మోసాలు

అనుమతులు నిల్.. పబ్లిసిటీ ఫుల్ మేడ్చల్ దగ్గరలో కొత్తరకం భూదందా ఫ్రీ లాంచింగ్ పేరుతో భారీ మోసాలు గుంట భూమి.. గుండెకు ధైర్యం తల్లి జన్మనిస్తుంది భూమి పునర్జన్మణిస్తుంది సరికొత్త కొటేషన్లతో బురిడీ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS