- ఫ్రీ లాంచింగ్ మోసాలకు అడ్డుకట్టపడేనా.?
- నిలువు దోపిడీ చేస్తున్న ఎస్ఎల్ఎన్ఎస్
- ప్రీమియం విల్లా, ఓపెన్ ప్లాట్స్ కేవలం 7,999, 10,999 అంటూ టోకరా
- పలు ప్రాంతాల్లో ఎస్ఎల్ఎన్ఎస్ ప్రాపర్టీస్ కొని మోసపోయిన బాధితులు
- ప్రస్తుతం పోలీసులు చుట్టూ తిరుగుతున్న వైనం
- మేడ్చల్ పీఎస్ లో ఎస్ఎల్ఎన్ఎస్ ప్రాపర్టీస్ ఎండి, డైరెక్టర్ లపై కేసులు
- తాజాగా మేడ్చల్ అత్వేలిలో మరో మోసం
- హుడా పర్మిషన్ లేకున్నా.. ఉన్నాయని మాయమాటలు చెప్పి రూ.లక్షల్లో వసూల్
రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవారు జనాన్ని ఎట్లా మోసం చేయాలనే ఆలోచన చేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే వెంచర్లు ఏర్పాటు చేస్తున్నాయి రియల్ సంస్థలు. అమాయక ప్రజలకు మాయమాటలు చెప్పి వారి వద్ద నుంచి డబ్బులు గుంజుతున్నారు. రంగురంగుల బ్రోచర్ లు, పెద్ద పెద్ద కటౌట్ లు, ప్రజలను ఆకర్షించేందుకు అందమైన ఆఫీసులు.. అందులో వచ్చిన వారిని ఆకట్టుకునేందుకు మైమరిపించే అమ్మాయిలతో అమాయక ప్రజలకు గాలం వేసి ఫ్రీ లాంచింగ్ పేరుతో ఎస్ఎల్ఎన్ ప్రాపర్టీస్ లక్షల కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది. మేడ్చల్ మండల పరిధిలోని అత్వేలి గ్రామంలో సర్వేనెంబర్ 162లో సుమారు 5ఎకరాల స్థలంకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు రాలేదు, రంగురంగుల బ్రోఓచర్లపై హెచ్ఎండిఎ అనుమతులు ఉన్నాయంటూ ఇప్పటికే 100 ప్లాట్లు అమ్మేశారు. కేవలం కమిషన్ కోసం తాపత్రాయపడుతూ సామాన్య ప్రజలు ఎస్ఎల్ఎన్ఎస్ ప్రాపర్టీస్ మాటలు నమ్మి బ్రోచర్ లు పట్టుకొని రోడ్లపై, షాపుల చుట్టూ తిరుగుతూ హెచ్ఎండిఎ అనుమతులు ఉన్నాయంటూ పొట్టకూటి కోసం తప్పని తిప్పలు పడుతున్నారు. తక్కువ ధరకే ఫ్లాట్ వస్తుంది ఇదంతా నిజమేనంటూ నమ్మి ఎంతో మంది ప్రజలు మోసపోతున్నారు.

గతంలో ఎస్ఎల్ఎన్ఎస్(SLNS) ప్రాపర్టీస్ వారు ఇలాగే తక్కువ ధరకు ప్లాట్లు ఉన్నాయని చెప్పి విక్రయించారు. అనంతరం భూమి ఒకరిది డెవలప్మెంట్ మరొకరి అమ్మకం ఇంకొకరిది. ల్యాండ్ ఓనర్ రిజిస్ట్రేషన్ చెయ్యను అంటాడు.. మరీ డెవలపర్ ఏమో నాకు సంబంధం లేదు అంటూ వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కేవలం కమిషన్ బేసిక్ తో కస్టమర్ లను తీసుకొచ్చామంటూ ఎస్ఎల్ఎన్ ప్రాపర్టీస్ వారు తప్పించుకు తిరుగుతున్నారు. ఇక డబ్బులు పెట్టిన వారంతా ఎవర్ని కలువాలో.. ఎవర్ని అడగాల్నో తెలియక ఆగమాగం అవుతున్నారు. వీరి దగ్గరకు వెళ్తే వాళ్ల దగ్గరికి వెళ్లమని, వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇంకోకరి దగ్గరికి వేళ్ళాలంటూ ముప్పు తిప్పలు పెడుతున్నారు. మోసం చేసేవారికి మోసపోయే వాళ్ళు అందుబాటులో ఉంటారు అనడానికి మేడ్చల్ మండల్ అత్వల్లి గ్రామంలో ఐదు ఎకరాల స్థలంలో ఉన్నా వెంచర్ యే ఇందుకు సాక్ష్యం.
ఫ్రీ లాంచింగ్ మోసాలకు పాల్పడుతున్న ఎస్ఎల్ఎన్ఎస్ అడ్డుకట్టవేయాలి. నిలువు దోపిడీ చేస్తున్న ఎస్ఎల్ఎన్ఎస్ సంస్థపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. ప్రీమియం విల్లా, ఓపెన్ ప్లాట్స్ కేవలం 7,999, 10,999 అంటూ మోసం చేసి వసూలు చేయడంపై దర్యాప్తు చేయాలి. పలు ప్రాంతాల్లో ఎస్ఎల్ఎన్ఎస్ ప్రాపర్టీస్ కొని మోసపోయిన బాధితులకు అండగా నిలవాలి. ఇలాంటి దొంగ వ్యాపారాలు చేస్తున్న రియల్ ఎస్టేట్ సంస్థలు, రియల్ బ్రోకర్లపై అధికారులు చర్యలు తీసుకొని వారికి తిరిగి డబ్బు ఇప్పించి నిరుపేద, అమాయక ప్రజలకు న్యాయం చేయాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.