Tuesday, December 3, 2024
spot_img

కష్టాలు కొత్తకాదు..తిరిగి మళ్ళీ పోరాడుతాం : వైఎస్.జగన్

Must Read
   
  • ఎన్నికల ఫలితాల పై స్పందించిన జగన్
  • లక్షల మంది మహిళల ఓట్లు ఎటు పోయాయో తెలియదు
  • ఎవరు మోసం చేశారో,ఎవరు అన్యాయం చేశారో చెప్పవచ్చు,కానీ సరైన ఆధారాలు లేవు
  • అక్క,చెల్లెమ్మాల ప్రేమాభిమానాలు ఏమయ్యాయో తెలియదు

అసెంబ్లీ ఎన్నికల ఫలితాల పై జగన్మోహన్ రెడ్డి స్పందించారు.ఎన్నికల ఫలితాల పై జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సంధర్బంగా అయిన మాట్లాడుతూ లక్షల మందికి అమ్మఓడి డబ్బులిచ్చాం అని గుర్తుచేశారు.లక్షల మంది మహిళల ఓట్లు ఎటు పోయాయో అని అనుమానం వ్యక్తం చేశారు.ఎవరు మోసం చేశారో , ఎవరు అన్యాయం చేశారో చెప్పవచ్చు కానీ వాటికి సరైన ఆధారాలు లేవని తెలిపారు.ప్రతిపక్షంలో ఉంటూ పోరాడి తిరిగి మళ్ళీ అధికారంలోకి వచ్చే స్థాయికు ఎదుగుతామని ఆశాభావం వ్యక్తం చేశారు.అక్క, చెల్లెమ్మాలకు ఎంతో చేశానని , ఎన్నో పథకాలు అందించమని ఈ సంధర్బంగా గుర్తుచేశారు.అమ్మఓడి పథకం ద్వారా 53 లక్షల మంది తల్లులకు మంచి చేశామని పేర్కొన్నారు. అవ్వ-తాతలకు , వికలాంగులకు ఎంతో మేలు చేశామని తెలిపారు.వారి కష్టాన్ని అర్థం చేసుకొని వారి ఇంటికే వ్యవస్థను కూడా పంపమని వెల్లడించారు.తాము అధికారంలోకి రాకముందు తక్కువ పెన్షన్ తో ఇబ్బంది పడేవారని గుర్తుచేశారు.వై.ఎస్ .ఆర్.సి.పి వచ్చాక వారి ఇబ్బందులను తెలుసుకొని వారికి అధిక పెన్షన్లు అందించమని అన్నారు.అక్క చెల్లెమ్మ ల కష్టాలని అర్థం చేసుకుంటూ తమ కష్టాలుగా భావించి వారికి తోడుగా ఉన్నామని , చేయుతతో భరోసా కల్పించామని తెలిపారు. వారి ప్రేమాభిమానాలు ఏమాయ్యాయో అని అనుమానం వ్యక్తం చేశారు.తమకు ఉన్న నలబై శాతం ఓట్లను తగ్గించలేకపోయారని అన్నారు.తమకు కష్టాలు కొత్త కాదని , తిరిగి మళ్ళీ పోరాడతామని వెల్లడించారు.

Latest News

లక్ష కేసులు పెట్టిన, ప్రజల పక్షాన ప్రశ్నించడం అపను

మాజీమంత్రి హరీష్‎రావు లక్ష కేసులు పెట్టిన, ప్రజల పక్షాన ప్రశ్నించడం అపను అని మాజీమంత్రి హరీష్ రావు అన్నారు. ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS