Friday, January 31, 2025
spot_img

మల్కాజ్ గిరిలో కబ్జాల పర్వం

Must Read
  • సర్వే నెంబర్ 278లో ప్రభుత స్థలం కబ్జా
  • స‌ర్కార్ జాగలో మూడంతస్తుల బిల్డింగ్ నిర్మాణం
  • మున్సిపల్ అధికారుల ఫుల్ సపోర్ట్
  • అక్రమ నిర్మాణం కూల్చేయాలని మల్కాజ్ గిరి ఎమ్మార్వో ఆదేశం
  • స్థానిక బీఆర్ఎస్ నేత అండతో కోట్లు విలువ చేసే భూమి హాంఫట్
  • ప్రభుత్వ స్థలంలో కట్టిన నిర్మాణాన్ని టచ్ చెయ్యని మున్సిపల్ అధికారులు

రాజధాని నగరం హైదరాబాద్ లో భూముల ధరలు అందనంతగా పెరిగిపోయాయి. భాగ్యనగరంలోని ఏ మారుమూల ప్రాంతంలోనూ పేద, మధ్య తరగతి వారు కొనలేని దుస్థితి దాపురించింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఎక్కడ గజం భూమి కొనాలన్న లక్షల్లో పలుకుతుంది. ఈ నేపథ్యంలోనే అక్రమార్కులు కబ్జాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ, అసైన్డ్ ల్యాండ్స్ ఎక్కడ కనిపించినా వాటిని మింగేస్తున్నారు. సర్కారు భూముల్లో దర్జాగా అక్రమ నిర్మాణాలు కడుతున్నారు. రాజకీయ, డబ్బు పలుకుబడితో యధేచ్చగా నిర్మాణాలు చేపడుతున్నారు. కబ్జాదారులకు జీహెచ్ఎంసీ, రెవెన్యూ యంత్రాంగం పూర్తిగా సహకరిస్తుంది. రేవంత్ సర్కార్ హైడ్రాను తీసుకొచ్చి మంచి పని చేసిందని అందరూ అనుకున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో అక్రమ నిర్మాణాలు, ప్రభుత్వ, అసైన్డ్ ల్యాండ్స్ ను కబ్జాచేసినా, నిర్మాణాలు చేపట్టినా వాటిని ఆక్యూఫై చేసుకుంటుంది. కానీ మల్కాజ్ గిరిలో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. సర్కారు భూములు కబ్జాచేసి
యధేచ్చగా అక్రమ నిర్మాణాలు కడుతున్నారు. అయినా జీహెచ్ఎంసీ, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదు.

మేడ్చల్ జిల్లా మల్కాజ్ గిరి మండల పరిధిలోని నేరెడ్ మెట్ లో కబ్జాల పర్వం అవుతుంది. మధుర నగర్ రోడ్ నెంబర్ 6 రాచకొండ కమిషనరేట్ వెనకాల 500గజాల ప్రభుత్వ స్థలం కబ్జా అయింది. ప్రభుత్వ స్థలం కబ్జాచేసి అక్రమంగా నిర్మాణం చేస్తున్నారంటూ కాలనీ వాసులు మల్కాజ్ గిరి తహసిల్దార్ కు ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. ఖాళీ స్థలానికి కంచె వేయడమే మా వంతు నిర్మాణాలు చేపడితే అడ్డుకోవాల్సిన బాధ్యత మున్సిపల్ టౌన్ ప్లానింగ్ విభాగానిదే అంటూ మల్కాజ్ గిరి మున్సిపల్ అధికారులకు తహసిల్దార్ అక్రమ నిర్మాణాన్ని నేలమట్టం చేయాలంటూ లేఖ రాశారు. అయినా అధికారులు ఆ వంక కూడా చూడకపోవడం గమనార్హం. అక్రమ నిర్మాణం నేలమట్టం కాదు కదా కనీసం ఒక ఇటుక కూడా పీకలేని స్థితిలో టౌన్ ప్లానింగ్ యంత్రాంగం ఉన్నది అంటే నిద్రమత్తులో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.

మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా మల్కాజ్ గిరి పరిధిలో భూ కబ్జాలు, అక్రమ నిర్మాణాలకు హద్దు, అదుపు లేకుండా పోతుంది. అక్రమార్కులకు ప్రభుత్వ అధికారులే సపోర్ట్ గా నిలుస్తున్నట్లు ఆరోపణలున్నాయి. మల్కాజ్ గిరి టౌన్ ప్లానింగ్ డిప్యూటీ సిటీ ప్లానర్ శ్రీనివాస్ రావు అరాచకాలు మాములుగా లేవు. ఆయన హిస్టరీనే ఓ గ్రేటెస్ట్. సారు ఎక్కడ డ్యూటీ చేసినా ట్రెండ్ క్రియేట్ చేస్తారు. రోజు ఒక్క సెటిల్మెంట్ లేనిదే ఇంటికి వెళ్ళరు. అదీ ఆయన నైజాం. తన కింద పనిచేసే వారిని గట్టిగానే వాడుకుంటారు. అవినీతి డబ్బులు, అక్రమ పనులు డీల్ చేసి అదీ పూర్తిచేసేందుకు కిందిస్థాయి ఉద్యోగులను పావుగా వాడుకుంటారని పేరు. అందులో భాగంగానే టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఆఫీసర్ సంగీతను కూడా మధ్యవర్తిగా పెట్టుకున్నారు. శ్రీనివాస్ రావు ఆమెతో అక్రమ నిర్మాణాల వద్దకు పంపి యజమానుల వద్ద డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. టౌన్ ప్లానింగ్ సిబ్బంది వద్ద పలు ఆధారాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

మల్కాజ్ గిరి టౌన్ ప్లానింగ్ డిప్యూటీ సిటీ ప్లానర్ శ్రీనివాస్ రావు డబ్బు ఆకలి మాములుగా లేదు. తన అవినీతి అంతా ఇంతా కాదు. మున్సిపల్ టౌన్ ప్లానింగ్ విభాగంలో పనిచేస్తున్న సెక్షన్ ఆఫీసర్ సంగీతను సెటిల్మెంట్ బ్యాచ్ గా మార్చేశారు. ప్రతిరోజు చైన్ మాన్ లను… భవన నిర్మాణాల వద్దకు పంపి ఆఫీసుకు పిలిపించుకుంటారు. నేరెడ్ మెట్ ప్రధాన రహదారి పక్కనే కోట్లు విలువ చేసే ప్రభుత్వ స్థలం కబ్జాచేసి నిర్మిస్తున్నారు. సర్కారు జాగలో అంత పెద్ద బిల్డింగ్ కడుతున్న సైలెండ్ ఉండడం విశేషం. మీ బిల్డింగ్ కు ఎలాంటి అనుమతి లేదు సార్ కూల్చేయమంటున్నారు అంటూ బెదిరించడం ఫైనల్ గా ఓ సెటిల్మెంట్ కు బేరం కుదిరించుకుంటున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. సంగీత పెద్ద సార్ కు మూటగట్టి పంపుతున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

ఇకనైన జీహెచ్ఎంసీ, రెవెన్యూ, మున్సిపల్, ప్రభుత్వ పెద్దలు దృష్టిసారించి మల్కాజ్ గిరి పరిధిలో నిర్మాణం అవుతున్న అక్రమ నిర్మాణాలు కూల్చివేయాలని, యజమానులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Latest News

ఎస్ఎల్ఎన్ ఫ్రీ లాంచింగ్ మోసాలు

అనుమతులు నిల్.. పబ్లిసిటీ ఫుల్ మేడ్చల్ దగ్గరలో కొత్తరకం భూదందా ఫ్రీ లాంచింగ్ పేరుతో భారీ మోసాలు గుంట భూమి.. గుండెకు ధైర్యం తల్లి జన్మనిస్తుంది భూమి పునర్జన్మణిస్తుంది సరికొత్త కొటేషన్లతో బురిడీ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS