Friday, January 31, 2025
spot_img

ప్లేట్ల బుర్జు దావఖానాలో కామ పిశాచి

Must Read
  • అసిస్టెంట్ డైరెక్టర్ షకీల్ హాసన్ లీలలు
  • 60 ఏళ్ల వయసులో పెచ్చుమీరుతున్నశారీర‌క‌ కోరికలు
  • రాష్ట్రంలోనే అతి పెద్ద మెటర్నరీ ఆస్పత్రిలో కొలువు యలగబెడుతున్న సారూ
  • మహిళా ఉద్యోగినీలపై వేధింపులు
  • ఇప్పటికే 23మందితో కలిశాను..
  • సిల్వర్ జూబ్లీ పూర్తి చేసుకోవాలనేది నా ఆశ
  • సదరు ఉద్యోగిని తీసుకొని హోటల్ కు రావాలంటూ హుకూం
  • మధ్యవర్తితో రాయబారాలు పంపుతున్న వైనం
  • లైంగికవాంఛ తీర్చాలంటూ వార్నింగ్
  • ఆదాబ్ చేతిలో ఆడియో, చాటింగ్ మేసెజ్‌లు
  • షకీల్ హాసన్ ఖాన్ పై చర్యలకు మహిళా ఉద్యోగినీల డిమాండ్

రాష్ట్రంలోని ప్రసూతి ఆస్పతులలో అదీ అతి పెద్దది.. పాత పట్నంలో ఉన్న ఈ దావఖానాలోనే అసిస్టెంట్ డైరెక్టర్ గా కొలువు యలగబెడుతున్నాడు ఓ ప్రబుద్దుడు. ఆ కామపిశాచి వయసు ముత్తాత. రేపో, మాపో రిటైర్డ్ అయి.. పెన్షన్ తీసుకొని ఇంట్లో కూర్చొని హాయిగా బతకాల్సిన వ్యక్తి. లేటు వయసులో ఏం పోయే కాలం వచ్చిందో ఏమో… బిడ్డా, మనువరాలు ఏజ్ ఉన్న స్త్రీలపై మనసు పారేసుకుంటున్నాడు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ లోని పాతబస్తీలో ఉన్న ప్లేట్లబుర్జు మెటర్నిటీ హాస్పిటల్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న షకీల్ హాసన్ ఖాన్. ఇతగాడు గత కొంత కాలంగా ఆస్పత్రిలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగినీలతో చెడుగా ప్రవర్తిస్తున్నట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎప్పటి నుంచి సాగుతున్నదో తెల్వదు గానీ ఆయన నోటి నుంచి వచ్చిన మాటలు వింటే ఆశ్చర్యం కలుగుక మానదు. బిడ్డలను కనేందుకు, ఆపద సమయంలో ఆస్పత్రికి వచ్చే స్త్రీలు, అమ్మలను కాపాడే ప్లేట్ల బుర్జు దావఖానాలో ఉన్నతమైన పదవీలో ఉన్నాడు. అందులో డ్యూటీ చేసే నర్సులు, డాక్టర్లు, అడ్మిన్ విభాగంలో పనిచేసే వారిపై కన్నుపడితే చాలు వారు తన వశం కావాల్సిందేనంట. మనసు పారేసుకుంటే ఏదో రకంగా తనతో బెడ్ షేర్ చేసుకుంటాడు. హోటల్, రూమ్ కు పిలిపించుకొని శారీరక కోరిక తీర్చుకోవడమే పని. రూ. లక్షల్లో జీతం తీసుకుంటూ తను చేస్తున్నది ఏం లేదు. హాస్పిటల్ లో ఏం పనిలేని పెద్దాయనకు ఎప్పుడూ నీచమైన ఆలోచనే. ఎవర్నీ ఎలా ట్రాప్ చేయాలి.. ఎక్కడికి పిలిపించుకోవాలి.. తద్వారా సంతృప్తి పొందాలనేది ఆశ. శారీరక కోరికలు తీర్చుకునేందుకు మహిళ ఉద్యోగినీలను టార్చర్ పెడుతున్నాడు.

తన లైంగిక వాంఛలు తీర్చాల్సిందేనంటూ ఆ డిపార్ట్ మెంట్ లో పనిచేసే వారికి అల్టిమేటం జారీ చేస్తున్నాడు. తోటి ఆడవారిలో ఓ తల్లినీ, చెల్లినీ, బిడ్డను చూసుకోవాల్సింది పోయి తనతో పడుకోవాలంటూ నీచ ఆలోచన చేస్తున్నాడు. లేదంటే విధుల్లో ఇబ్బందులకు గురిచేస్తూ.. అవసరమైతే మెమోలు జారీ చేస్తున్నాడు. కాదంటే ఊరుకునేది లేదంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. తాను సిల్వర్ జూబ్లీ పూర్తి చేసుకోవాలని ఆశగా ఉందంటూ మనసులో మాట చెప్పాడు. తన (ఉద్యోగ) జీవితంలో ఇప్పటి వరకు 23 మందితో శారీరకంగా కలిశాను. 25 మందితో సెక్సువల్ గా కలిస్తే ఆ కోరిక నేరవేరుతుంది అంటుండడం గమనార్హం. అంటే ఈ నీచుడు ఎంత కాలం నుంచి ఈ పాడు పనిచేస్తున్నాడో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఎప్పట్నుంచో ప్రభుత్వ ఆఫీసర్ గా తనతోపాటు పనిచేస్తున్న మ‌హిళా ఉద్యోగిని సెక్సువల్ గా హరాస్ చేస్తున్నాడు. విధుల్లో ఆడవారిని ఇబ్బందులకు గురిచేస్తున్నాడు.

తాజాగా ఓ ఉద్యోగిని ఆదాబ్ హైదరాబాద్ తో తన ఘోడు వెళ్లబోసుకున్నారు. ఎంతో కాలంగా జరుగుతున్న ఈ పాడు పనిని బయటపెట్టారు. తన వద్ద ఉన్న ఆడియోలు, చాటింగ్ మేసెజ్‌ల‌ను ఆదాబ్ ప్రతినిధికి ఇచ్చి ఎలాగైనా కామ పిశాచి చేస్తున్న పనిని వెలుగులోకి తీసుకురావాల్సిందిగా.. అతడికి కఠిన శిక్ష పడాలని కోరారు. తనలాంటి ఎందరో ఆడబిడ్డలు మోసపోయి లొంగిపోయారని, తాను మాత్రం దైర్యం చేసి మిమ్ముల్ని సంప్రదిస్తున్నట్లు తన వివరాలు ఏ విధంగా బయటకు రాకుండా చూడాలంటూ రిక్వెస్ట్ చేసుకున్నారు. వైద్యారోగ్య శాఖ మంత్రి, ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లేలా చూడాలని తెలిపారు. గర్భం ధరించి, పురిటీ నొప్పులతో.. సిటీ చుట్టూ, ముట్టూ ఉన్న ప్రాంతాలు, గ్రామాలు వారు వచ్చే వారికి వైద్యసేవ చేసుకొని పుణ్యం కట్టుకోవాలని ఇక్కడ పనిచేసే మహిళా ఉద్యోగులను నిత్యం లైంగిక వేధింపులకు గురిచేస్తున్న అసిస్టెంట్ డైరెక్టర షకీల్ హాసన్ ఖాన్ అంతు చూడాలని వేడుకుంటున్నారు.

Latest News

ఎస్ఎల్ఎన్ ఫ్రీ లాంచింగ్ మోసాలు

అనుమతులు నిల్.. పబ్లిసిటీ ఫుల్ మేడ్చల్ దగ్గరలో కొత్తరకం భూదందా ఫ్రీ లాంచింగ్ పేరుతో భారీ మోసాలు గుంట భూమి.. గుండెకు ధైర్యం తల్లి జన్మనిస్తుంది భూమి పునర్జన్మణిస్తుంది సరికొత్త కొటేషన్లతో బురిడీ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS