Friday, January 31, 2025
spot_img

కార్మిక‌శాఖ‌లో లుక‌లుక‌లు

Must Read
  • కార్మికుల సొమ్ము లక్షలాది రూపాయలు దళారుల పాలు..
  • కార్డుదారులకు ఇచ్చేది గోరంత.. దళారుల పాలయ్యేది కొండంత..

వరంగల్‌ జిల్లా నర్సంపేట పట్టణంలో ఉన్న కార్మిక శాఖలో భారీగా అవినీతి జరుగుతుందని పలువురు కార్మిక సంఘం నాయ కులు బహిరంగంగా విమర్శిస్తున్నారు. ఇప్పటికే గతంలో కార్యాలయానికి గేటు వేసిన కార్మిక సంఘం నాయకులు జిల్లా కలెక్టర్‌కు సైతం పలుమార్లు వినతి పత్రాలు సమర్పించారు. లక్ష మంది లేబర్‌ కార్డు హోల్డర్లు ఉన్న నర్సంపేట లేబర్‌ కార్యాలయంలో అధికారుల నిర్లక్ష్యం మూలంగా లేబర్‌ కార్డు కలిగి ఉన్న బాధితులకు స్కీం లో భాగంగా వారి సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే సంక్షేమ నిది అరచేతిలో ఐసు ముక్కలాగా కరిగిపోతుందని సంఘంగా ఏర్పడ్డ దళారులు సొమ్మునంత లాగేసుకుంటు న్నారని సమాచారం. ఈ క్రమంలో నర్సంపేట లేబర్‌ కార్యా లయం పరిధిలో నర్సంపేట డివిజన్లోని నర్సంపేట, కానాపు రం, చెన్నారావుపేట, నెక్కొండ, దుగ్గొండి, నల్లబెల్లి, మండ లాలతో పాటు వరంగల్‌ జిల్లాలోని సంఘం, గీసుకొండ మండలాలు సైతం నర్సంపేట లేబర్‌ అధికారి కిందికే వస్తాయి. దీంతో ఎనిమిది మండలాల్లో లక్ష మంది లేబర్‌ కార్డు కలిగి ఉన్నారని అధికారులు సైతం చెబుతున్నారు.

లేబర్‌ కార్డు కలిగి ఉంటే ప్రయోజనం ఏంటి..
భవన నిర్మాణ కార్మికులు ఇతరత్రా కూలి నాలి పని చేసే కూలీలంతా ఈ లేబర్‌ కార్డుకు అర్హులని ప్రభుత్వ ఉద్యోగులు తప్ప ప్రతినిత్యం పనిచేసుకునే వారంతా లేబర్‌ కార్డు కిందకి వస్తారని అందుకు వారికి భరోసా భద్రత కల్పించేందుకు కార్మిక శాఖను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి. దీనిలో భాగంగా లేబర్‌ కార్డు కలిగి ఉన్న వ్యక్తి తన కూతురు పెళ్లి చేస్తే 30 వేల రూపాయలు, ఆ కూతురు ప్రసవిస్తే 30 వేల రూపాయలు, ఒకవేళ లేబర్‌ కార్డు కలిగి ఉన్న వ్యక్తి ప్రమాదవశాత్తు మరణిస్తే ఆరు లక్షల 30 వేల రూపాయలు, అదేవిధంగా సహజంగా మరణిస్తే లక్ష 30 వేల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంబంధిత నామినికి బ్యాంకు ద్వారా సమగ్ర విచారణ చేసిన అనంతరం ఇచ్చే విధంగా స్కీమును రూపకల్పన చేశారు. ఇప్పటివరకు బాగానే ఉన్నా లేబర్‌ కార్డు కోసం కొంతమంది దళారులు ఏర్పడి మేము లేబర్‌ కార్డు చేస్తాం, చేయిస్తాం అంటూ ఊరూరా తిరుగుతూ కూలి నాలి చేసుకునేటోళ్లతో పాటు వివిధ వర్గాల్లో పనిచేస్తున్న కుటుంబాలకు లేబర్‌ కార్డును మీ సేవల ద్వారా దరఖాస్తు చేయించి కార్డు వారికి అప్పగిస్తారు. దీంతో తదుపరి జరిగే ప్రమాదాలు సహజాలు పెళ్లిళ్లు ప్రసవాలు ఆ కుటుంబానికి క్లేమ్‌ అవుతూ ఉంటాయి. ఇలా చక్కగా సాగితే లేబర్‌ కార్డు కలిగి ఉన్న వ్యక్తికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించు సంక్షేమ నిధి తో కుటుం బాలకు కొంత ఆసరా ఏర్పడుతుంది.

దళారులదే రాజ్యం..
కార్మిక సంక్షేమ శాఖ అందించు కార్మిక ఆసరా నిధి దళా రుల చేతుల్లోనే ఉంది. లేబర్‌ కార్డు కలిగి ఉన్న కుటుంబం లో ఆడకూతురు పెళ్లి జరిగిన 30,000 రావాల్సి ఉండగా దళారులు ముందస్తుగానే ఆ లేబర్‌ కార్డు యజమానితో మాట్లాడుకుని 15000 చేతిలో పెట్టి మిగతా 15000 నోక్కేస్తున్నారని తెలుస్తుంది. అదేవిధంగా ప్రమాదవశాత్తు మరణిస్తే 6,30,000 రావాల్సి ఉండగా అందులో కార్డు హోల్డర్‌కు కుటుంబానికి ఆ మొత్తం బ్యాంకు ద్వారా పోవాల్సింది పోయి దళారుల చేతికి ఫైలు ఇవ్వడంతో 80% దళారి నొక్కేసి 20 శాతం మాత్రం ఆ కుటుంబానికి ఇస్తు న్నారని ఇది ఉన్నతాధికారుల నోటీసు లో సైతం ఉందని పలువురు కార్మిక సంఘం నాయకులు బహాటంగా విమర్శిస్తున్నారు. జిల్లా కలెక్టర్‌ నర్సంపేట కార్మిక శాఖ కార్యాలయం పై దృష్టి సారించి అక్కడ దళారుల ఆగడాలను దళారులకు సహకరించే మీసేవ సెంటర్లను సైతం గుర్తించి తగు చర్యలు తీసుకోకపోతే కార్మిక సంక్షేమం కోసం ఏర్పడిన కార్మిక శాఖ కార్యాలయం అబాసు పాలు అవుతుం దని పలువురు పలు రకాలుగా విమర్శిస్తున్నారు.

Latest News

సీఎం బందోబస్తుకు వెళ్తున్న ఎస్‌ఐ ఆత్మహత్య

ముఖ్యమంత్రి చంద్రబాబు పెనుగొండ పర్యటనకు వెళ్తూ ఓ వీఆర్‌ ఎస్సై ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఏపీలో జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు గ్రామీణ పీఎస్‌లో...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS