Sunday, April 20, 2025
spot_img

క్రికెట్‌ చరిత్రలోనే వింత రనౌట్‌

Must Read

క్రికెట్‌ చరిత్రలోనే ఓ బ్యాటర్‌ విచిత్రమైన విధంగా రనౌట్‌ అయ్యాడు. ఇందులో ఏ మాత్రం తన పొరపాటు లేనప్పటికీ బ్యాటర్‌ పెవిలియన్‌ చేరాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ‘ఇలా కూడా ఔట్‌ అవుతారా?’, ‘బ్యాడ్‌లక్‌’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతునున్నారు. ఇంగ్లాండ్‌- సౌతాఫ్రికా అండర్‌- 19 జట్లు అనధికార టెస్టు మ్యాచ్‌లో తలపడ్డాయి. మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌ 30.4 ఓవర్‌ వద్ద ఇంగ్లాండ్‌ బ్యాటర్‌ ఆర్యన్‌ సావంత్‌ క్రీజ్‌లో ఉన్నాడు. అతడు సౌతాఫ్రికా బౌలర్‌ జాన్‌ రోల్స్‌ వేసిన బంతిని స్వీప్‌ షాట్‌ ఆడాడు. అయితే షార్ట్‌ లెగ్‌లో ఉన్న ఫీల్డర్‌ జోరిచ్‌ వాన్‌ హెల్మెట్‌ను తాకిన బంతి మళ్లీ స్టంప్స్‌ వైపునకు రిటర్న్‌ వచ్చి, బెయిల్స్‌ను పడగొట్టింది. అప్పటికే షాట్‌ ఆడిన సావంత్‌ క్రీజ్‌ బయట ఉన్నాడు. బంతి బెయిల్స్‌ను పడగొట్టడం వల్ల సౌతాఫ్రికా జట్టు రనౌట్‌కు అప్పీల్‌ చేసింది. బంతి తొలుత హెల్మెట్‌ను తాకిందని అంతా భావించినా, రిప్లేలో మాత్రం ఫీల్డర్‌ మోకాలిని బలంగా తాకినట్లు కనిపించింది. దీంతో సావంత్‌ను రనౌట్‌గా ప్రకటించారు. మరోవైపు, బ్యాటర్‌ సావంత్‌ మాత్రం షాక్‌కు గురైనట్లు అలాగే కాసేపు క్రీజ్‌లో ఉండిపోయాడు. ఇక బంతి బలంగా తాకడం వల్ల వాన్‌ బాధతో అక్కడే కింద పడిపోయాడు. వెంటనే జట్టు సహచరులు వచ్చి అతడికి ఫిజియో చేశారు. అయితే, ఈ రనౌట్‌పై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ‘అది డెడ్‌ బాల్‌గా ప్రకటించాలి’, ‘పాపం క్రికెట్‌లో దురదృష్టమైన బ్యాటర్‌ ఇతడేనేమో’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Latest News

ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్.. చాలా ఆనందాన్ని ఇచ్చింది

అర్జున్ S/O వైజయంతి సక్సెస్ ప్రెస్ మీట్ లో హీరో నందమూరి కళ్యాణ్ రామ్ నందమూరి కళ్యాణ్ రామ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ అర్జున్ S/O వైజయంతి....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS