Sunday, September 7, 2025
spot_img

చరిత్ర సృష్టించిన ఉస్మాన్‌ ఖవాజా!

Must Read

ఆస్ట్రేలియా స్టార్‌ ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖవాజా చరిత్ర సృష్టించాడు. శ్రీలంక గడ్డపై డబుల్‌ సెంచరీ సాధించిన తొలి ఆసీస్‌ ప్లేయర్‌గా చరిత్రకెక్కాడు. గాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఉస్మాన్‌ ఖవాజా 290 బంతుల్లో డబుల్‌ సెంచరీ సాధించాడు. తన కెరీర్‌లో ఉస్మాన్‌ ఖవాజాకు ఇదే తొలి డబుల్‌ సెంచరీ కావడం విశేషం. 147 ఏళ్ల టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో ఇప్పటి వరకు ఏ ఆసీస్‌ బ్యాటర్‌ శ్రీలంక గడ్డపై డబుల్‌ సెంచరీ చేయలేదు. కోలంబో వేదికగా జరిగిన మ్యాచ్‌లో జస్టిన్‌ లాంగర్‌ 166 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు ఇదే అత్యధిక స్కోర్‌ కాగా.. తాజాగా ఉస్మాన్‌ ఖవాజా అధిగమించాడు. శ్రీలంక గడ్డపై అత్యధిక పరుగులు చేసిన ఆసీస్‌ బ్యాటర్ల జాబితాలో ఉస్మాన్‌ ఖవాజా, జస్టిన్‌ లాంగ్‌(166), డామిన్‌ మార్టిన్‌(161), డారెన్‌ (153), స్టీవ్‌ స్మిత్‌(145)లు ఉన్నారు. తాజా మ్యాచ్‌లో ఉస్మాన్‌ ఖవాజా డబుల్‌ సెంచరీకి తోడుగా స్టీవ్‌ స్మిత్‌(141) సెంచరీతో చెలరేగాడు. జోష్‌ ఇంగ్లీస్‌ హాఫ్‌ సెంచరీతో రాణించడంతో ఆసీస్‌ ఇప్పటికే 527 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఇదే మ్యాచ్‌లో స్మిత్‌ 35వ శతకం నమోదు చేయడంతో పాటు 10 వేల పరుగుల మైలురాయి అందుకున్న విషయం తెలిసిందే.

Latest News

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల పట్ల హర్షం

పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు. బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్ దేశవ్యాప్తంగా...
- Advertisement -spot_img

More Articles Like This