Wednesday, February 5, 2025
spot_img

హైదరాబాద్‌లో హాస్టల్‌ నిర్వాహకుడి అరాచకం

Must Read
  • యువతిని వీడియోలు చూపి బ్లాక్‌మెయిల్‌

హైదరాబాద్‌లో హాస్టల్‌ నిర్వాహకుడి అరాచకం బయటపడింది. వీడియోలతో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినికి బెదిరింపులకు పాల్పడిన సంఘటన వెలుగు చూసింది. యువతి న్యూడ్‌ వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డాడు. అంతే కాదు యువతిని బెదిరించి ఏకంగా రూ.2.53 కోట్ల వరకు వసూలు చేశాడు. దీంతో బాధితురాలు నిడదవోలు పోలీసులను ఆశ్రయించింది. నిందితుడు దేవనాయక్‌ అలియాస్‌ మధు సాయికుమార్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన బాధిత యువతి హైదరాబాద్‌లోని విప్రో సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నది. యువతి ఉంటున్న ఉమెన్స్‌ హాస్టల్‌లో అనూష దేవి అనే చిన్ననాటి స్నేహితురాలితో పరిచయం ఏర్పడింది. దేవనాయక్‌ అలియాస్‌ మధు సాయికుమార్‌ను యువతికి తన భర్తగా పరిచయం చేసిది అనూష దేవి. దేవ నాయక్‌ వేరే ఫోన్‌ నెంబర్‌ తో న్యూడ్‌ వీడియోస్‌ నెట్లో పెడతానంటూ యువతిని బెదిరింపులకు గురి చేశాడు. న్యూడ్‌ వీడియోలు నెట్లో పెట్టకుండా ఉండాలంటే డబ్బులు ఇవ్వాలంటూ డిమాండ్‌ చేశాడు. వీడియో విషయంలో వేరే ఒకరితో గొడవ పడ్డానని యువతిని నమ్మించి కొంత నగదు కాజేశాడు. అలాగే యువతిని కెనడా పంపిస్తానని మరికొంత డబ్బులు కాజేశాడు దేవ నాయక్‌. యువతి తల్లిదండ్రులను కూడా డబ్బుల కోసం బ్లాక్‌ మెయిల్‌ చేశాడు. పలు దఫాలుగా ఫోన్‌ పే, గూగుల్‌ పే ద్వారా రూ. 2.53 కోట్లు కాజేశాడు. చివరికి మోసపోయానని గ్రహించి, నిడదవోలు పోలీసులకు ఫిర్యాదు చేసింది యువతి. యువతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, నిందితుడు దేవనాయక్‌ని పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్దనుండి రూ. 1.81 కోట్లు స్వాధీనం చేసుకున్నారు.

Latest News

పోలీస్‌స్టేష‌న్‌కు నటి లావణ్య

మస్తాన్‌ సాయి, శేఖర్‌ బాషా తనను డ్రగ్స్‌ కేసులో ఇరికించేందుకు కుట్ర చేశారంటూ కంప్లైంట్‌ నార్సింగి పోలీస్‌ స్టేషన్‌ను సినీ నటి లావణ్య మరోసారి ఆశ్రయించారు. బిగ్‌...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS