- కేంద్రానికి కులగణన దారి చూపిస్తుంది
- మీడియా ప్రతినిధుల చిట్ చాట్‌లో సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణలో కులగణన కేంద్రానికి దారి చూపిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM REVANTH REDDY) అన్నారు. ప్రత్యేక అసెంబ్లీ సమావేశం సందర్భంగా మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ నిర్వహించారు. 56 శాతం బీసీలు, 17.5 శాతం ఎస్సీలు మొత్తం 73.5 శాతం ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. ప్రధానిపై కూడా ఒత్తిడి పెరుగుతుందని.. కులగణన, ఎస్సీ వర్గీకరణకు రోడ్ మ్యాప్ తెలంగాణ నుంచి ఇస్తున్నామని తెలిపారు. సభలో ప్రవేశపెట్టే డాక్యుమెంట్ భవిష్యత్‌లో ఎపుడైనా రిఫరెన్స్ డాక్యుమెంట్ అవుతుందని రేవంత్ రెడ్డి తెలిపారు. దేశంలోనే మొదటిసారి కులగణన చేసి చరిత్ర సృష్టించామని.. పకడ్బందీగా సర్వే చేసి సమాచారం సేకరించామని ముఖ్యమంత్రి తెలిపారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు, మంత్రివర్గ ఉపసంఘం, ఏక సభ్య కమిషన్ సిఫార్సుల ప్రకారం వెళ్తామని తెలిపారు. ప్రధాన ప్రతిపక్షానికి బాధ్యత, చిత్తశుద్ది లేదన్నారు. వారిని పరిగణనలోకి తీసుకోవడం లేదని.. ప్రతిపక్ష నాయకుడు సభకు రావాలి కదా అని ప్రశ్నించారు. కులగణన రాజకీయం కోసం చేయడం లేదు ఈ డాక్యుమెంట్ ను డెడికేటెడ్ కమిషన్ తీసుకుటుందని.. కమిషన్ తగిన నిర్ణయం తీసుకొంటుందన్నారు.
88 జనరల్ సీట్లలో 30 సీట్లు బీసీలకు ఇచ్చాం, 33 శాతం సీట్లు ఇచ్చామని తమకు చిత్తశుద్ది ఉందని రేవంత్ రెడ్డి తెలిపారు. కోర్టు ఇచ్చిన క్లిమిలేయర్ ను తిరస్కరించామని.. బీసీ రిజర్వేషన్ల పై కోర్టు ఆదేశాల మేరకు కమిషన్ వేశామన్నారు. కోర్టు ఆదేశాల మేరకే కమిషన్ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. అసెంబ్లీ కి రాని వారు అసెంబ్లీ టైం గురించి మాట్లాడుతున్నారుని విమర్శించారు. ఉదయమే సభ ప్రారంబించి వెంటనే వాయిదా వేయడంపై బీఆర్‌ఎస్ చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. సమగ్ర కుటుంబ సర్వే గురించి కొంత మంది మాట్లాడుతున్నారని.. ఆ రిపోర్ట్ ఎక్కడ ఉందో కూడా తెలియదని రేవంత్ చెప్పుకొచ్చారు.
సమగ్ర కుటుంబ సర్వే ఎవరు చేసారు.. ఎలా చేసారు.. ఆ రిపోర్ట్ ఎక్కడ పెట్టారో ఎవరికీ తెలియదన్నారు. మేము ఎన్నికల కోసం కులగణన చేయలేదు..అభివృద్ధి ఫలాలు అందించడం కోసమే మా తాపత్రయం అంతా.. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కొందరు ఉప ఎన్నిక గురించి మాట్లాడుతున్నారు.. సిరిసిల్ల లో కేటీఆర్ సూసైడ్ చేసుకుంటడేమో అని వ్యంగ్యంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ప్రొసీజర్ లో భాగమని రేవంత్ అన్నారు. సుప్రీంకోర్టు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయడంతో తాము ఉపఎన్నికలకు రెడీ అని కేటీఆర్ ట్వీట్ చేయడంపై రేవంత్ ఇలా స్పందించారు.