- అటవీ భూముల్లో అక్రమ నిర్మాణాలు
- ఆరుగురికి నోటీసులు జారీ
- ఇంటినెంబర్లు ఇవ్వొద్దని పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు
పారిశ్రా మికంగా వాణిజ్యపరంగా వ్యాపారరిత్యా దినదినాభివృద్ధి చెందుతున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రానికి అతిసమీపంలో ఉన్న లక్ష్మీదేవిపల్లి మండలంలోని అటవీ భూములు ఆక్రమణకు గురవుతున్నాయి. సర్వే నెంబర్ 17లో సుమారు 2,155 ఎకరాల అటవీ భూమి ఉంది. అయితే ఈసర్వే నెంబర్‌లో కొంతమంది అక్రమ వెంచర్లు, కొంతమంది అటవీ భూములను ఆక్రమించుకోని ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నట్లు అటవీ అధికారులు గుర్తించారు. అటవీ అధికారులు అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు రంగం సిద్ధం చేశారు. ఈనేపథ్యంలోనే అక్రమ నిర్మాణాలు చేపట్టిన ఆరుగురికి నోటీసులు జారీ చేశారు.
ఆక్రమనిర్మాణాలపై అధికారులు కొరడా….
లక్ష్మీదేవిపల్లి మండల పరిధిలోని ఫారెస్టు భూమిలో సర్వే నెంబర్ 17లో సుమారు 2155 ఎకరాల ఫారెస్టు భూమి ఉంది. ఈ సర్వే నెంబర్‌లో ప్రశాంతినగర్, లక్ష్మీదేవిపల్లి, లోతువాగు, హమాలీ కాలనీ, సంజయ్‌నగర్, చాతకొండ, సాటివారిగూడెం పంచా యతీలలో ఫారెస్ట్ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేసిన ఆరుగురికి మండల అటవీ అధికారి శ్రీనివాస్‌రావు ఆదేశాలు మేరకు డిప్యూటీ అటవీఅధికారి వెంకటేశ్వర్లు బీట్ ఆఫీసర్ భావ్‌సింగ్‌లు ప్రభుత్వ అటవీభూముల్లో అక్రమ నిర్మాణదారులకు నోటీసులు జారీ చేశారు. 1, 2, 3 నోటీసులు ఇచ్చిన తర్వాత నాల్గోసారి నోటీసులు ఇచ్చి అక్రమ నిర్మాణ దారులు తొలగిం చనిచో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అక్రమ నిర్మాణాలను తొలగించడం జరుగుతుందని అధికారులు తెలిపారు.
ఇంటి నెంబర్లు ఇస్తే ఉపేక్షించేది లేదు….
ప్రభుత్వ అటవీభూముల్లో అక్రమ నిర్మాణాలు చేసిన వారికి పంచాయతీ అధికారులు ఇంటి నెంబర్లు ఇస్తే ఉపేక్షించేది లేదని, నిర్మాణదారులకు ఇంటి నెంబర్లు ఇవ్వొద్దని ఆదేశాలు జారీ చేస్తా మన్నారు. అదే విధంగా ఈపంచాయతీలోని అటవీ భూముల్లో ఆయా పంచాయతీ కార్యదర్శులు ఇంటినెంబర్లు కేటాయించి నట్లయితే
వాటిని రద్దు చేస్తామని తెలిపారు.