- అక్రమ కట్టడాలకు ఉపేక్షించేది లేదంటున్న టౌన్ ప్లానింగ్ అధికారులు
- అక్రమ కట్టడాలపై ఫిర్యాదులు వస్తే కూల్చివేతలు తప్పవు
- చట్టానికి ఎవరు చుట్టం కాదన్నా టౌన్ ప్లానింగ్ అధికారులు
కాప్రా పరిధిలోని ఎస్‌ఎస్ ఎంక్లేవ్‌లో అక్రమ కట్టడాలను కూల్చివేశారు టౌన్ ప్లానింగ్ అధికారులు.. వివరాల్లోకి వెళితే… కాప్రా డివిజన్ వన్‌లోని ఎస్‌ఎస్ ఎంక్లేవ్‌లో అక్రమ కట్టడాలపై ఫిర్యాదులు రావడంతో కాప్రా టౌన్ ప్లానింగ్ అధికారులు చర్యలు చేపట్టారు. కాప్రాలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న అక్రమ కట్టడాలపై కొరడ ఘూలిపిస్తున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడితే ఊరుకునే ప్రసక్తే లేదు అన్నారు. అనుమతులకు దరఖాస్తు చేసుకోండి, అనుమతులు వచ్చాక సంతోషకరమైన వాతావరణంలో కట్టడాలు కట్టుకోండి. అక్రమ కట్టడం అంటే ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడమేనని, అది ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని వెల్లడించారు. అనుమతులు ఏ విధంగా వచ్చాయో ఆ విధంగానే కట్టడాలు కట్టుకోండి దయచేసి ఇబ్బందులు కొని తెచ్చుకోకండని హెచ్చరికలు జారీ చేశారు.