Friday, February 7, 2025
spot_img

కబ్జాలే తన కంటెంట్‌గా మార్చుకున్న కరెంట్‌ అధికారి..!

Must Read
  • గిర్నీబావిలో నకిలీ పత్రాలు సృష్టించి.. భూ కబ్జాలకు పాల్పడుతున్న స్వామి..
  • కబ్జా చేయడమే ధ్యేయంగా అక్రమ నిర్మాణం చేపట్టిన వైనం.
  • గ్రామ పంచాయతీ కార్యదర్శి నోటీసు ఇస్తే తిరస్కరించిన స్వామి..
  • బోగస్‌ లే అవుట్‌లో జోరుగా రియల్‌ ఎస్టేట్‌ దందా..
  • కబ్జా చేయుటకు తీసిన గుంతలను పూడ్చకుండా అక్రమ లే అవుట్‌ అని ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన అధికారులు..
  • ఫ్లెక్సీని సైతం తొలగించాడన్న ఎంపీఓ..
  • ప్రభుత్వ అధికారి అయ్యుండి భూ కబ్జాలకు పాల్పడటంపై వెల్లువెత్తుతున్న విమర్శలు..
  • నేటికీ చర్యలు చేపట్టిని విద్యుత్‌ శాఖ ఉన్నతాధికారులు..
  • కబ్జాకోసం పాఠశాల ఆధీనంలో ఉన్న స్థలంలో తీసిన గుంతలను పూడుస్తారా..?
  • పంచాయితీ రాజ్‌ శాఖ అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తారా..?
  • వరంగల్‌ డిపివో స్పందించి అక్రమ నిర్మాణాలను కట్టడి చేయాలంటున్న సామాజిక వేత్తలు..

చేసేది ప్రభుత్వ ఉద్యోగం..పైగా చీకట్లను తొలగించి వెలుగులు నింపే విద్యుత్‌ శాఖ.. అయినా సిగ్గూ ఎగ్గూ లేకుండా. కబ్జాలకు తెగబడ్డాడు.. ఉన్నతాధికారులు సైతం ఇతగాడిని చూసీ, చూడనట్లు వదిలేస్తున్నారు… మరి ఈయనగారు వాళ్ళకి కూడా వాటాలు ఇస్తున్నాడేమో..? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి … స్వామి నామధేయుడు అయిన ఇతగాడి భాగోతం ఏమిటో ఒక్కసారి చూద్దాం..

వరంగల్‌ జిల్లా దుగ్గొండి మండలం గిర్ని బావి గ్రామ శివారులో మహాత్మ జ్యోతిరావు పూలే ప్రభుత్వ పాఠశాల కలదు. ఇట్టి పాఠశాల వెనుక భాగంలో పంచాయతీరాజ్‌ చట్టం 2018 నిబంధనలు ఉల్లంఘించి ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ లేఅవుట్‌ చేశారు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు.. సదరు లేఅవుట్‌ అక్రమ లేఅవుట్‌ అని గతంలో పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు అమాయక ప్రజలు నష్టపోకుండా ఇల్లీగల్‌ లే అవుట్‌ అని, ఈ యొక్క లేఔట్‌ లో ఎవరు ప్లాట్లు కొనడం గాని అమ్మడం గాని చేపట్టడం చట్టవిరుద్దమని సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు.. ఇవేమీ పట్టించుకోకుండా నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండల పరిధిలో విద్యుత్‌ శాఖ ఉద్యోగిగా పనిచేస్తున్న స్వామి నకిలీ పత్రాలు సృష్టించి పాఠశాల స్థలం పై కన్నేశాడు ఈ కబ్జారాయుడు..

అవినీతి అక్రమాల ధ్యేయంగా ఒకవైపు నకిలీ పత్రాలతో అక్రమ రిజిస్ట్రేషన్‌ చేసుకోవడం నర్సంపేట సబ్‌ రిజిస్టర్‌ ను తప్పుదోవ పట్టించడం ఇతగాడికి వెన్నతో పెట్టిన విద్యగా మారింది అనే ఆరోపణలు వెళ్ళు వెతుతున్నాయి.. ఇలా అక్రమంగా చేసుకున్న రిజిస్ట్రేషన్‌ పత్రాలను అడ్డుపెట్టుకొని ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి పాఠశాలకు సంబంధించిన భారీ టేకు చెట్టును తొలగించాడు స్వామి.. అంతేకాకుండా ప్లాట్‌ నెంబర్‌ ఒకచోట చూపిస్తూ మహాత్మ జ్యోతిరావు పూలే పాఠశాలకు సంబంధించిన స్థలంలో ఇటీవలే నిర్మాణానికి తెర లేపాడు ఈ ప్రభుత్వ ఉద్యోగి.. ఒకవైపు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తూ.. మరోవైపు అక్రమ సంపాదనకు ఎగబడు తున్నాడని విమర్శలు వినిపి స్తున్నాయి.. పాఠశాలకు సంబంధించిన స్థలాన్ని కబ్జా చేస్తున్న విషయంపై ఇటీవలే ఆదాబ్‌ హైదరాబాద్‌ తెలుగు దినపత్రికలో కబ్జా రాయుడుగా మారిన కరెంటు అధికారి స్వామి అని రాసిన వార్త కథనం పై స్పందించిన పంచాయతీరాజ్‌ శాఖ ఉన్నతాధికారులు విచారణ ఆదేశించారు..

అధికారుల ఆదేశాల మేరకు గిర్నిభావి గ్రామ పంచాయతీ కార్యదర్శి పంచాయతీరాజ్‌ చట్ట నిబం ధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణం చేపడుతున్నారని, అక్రమ లేఔట్‌ అని, ప్రభుత్వం నుండి ఎలాంటి నిర్మాణా అనుమతులు లేకుండా నిర్మాణ పనులు చేపట్టడానికి వీలు లేదని తెలుపుతూ నోటీసు జారీ చేస్తే ఆ యొక్క నోటీసును తిరస్కరించాడు స్వామి.. అంతేకాకుండా అధికారుల నోటీసు తిరస్కరించడంతోపాటు ప్రాథమికంగా అక్రమ లేఅవుట్‌ అని అనుమతులు లేకుండా నిర్మాణ పనులు చేపడితే 2018 పంచాయతీ రాజ్‌ చట్ట నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ని సైతం తొలగించాడు స్వామి.. విద్యుత్‌ శాఖలో పని చేసే ప్రభుత్వ ఉద్యోగి ఐ ఉండి ఇంత అరాచకాలకు పాల్పడుతున్న ఇతనిని కట్టడి చేయడంలో విద్యుత్‌ శాఖ ఉన్నతాధికారులు పూర్తిగా విఫలమయ్యారు అని ఆరోపణలు వెల్లువేత్తుతున్నాయి.. విద్యుత్‌ శాఖలో ఉద్యోగ పనిచేస్తున్నాడా స్వామి లేక రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తూ భూకబ్జాలకు పాల్పడుతున్నాడా.. ఏకంగా పంచాయతీరాజ్‌ శాఖ అధికారుల కే సవాలు విసురుతూ తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ చట్టాలను బేఖాతలు చేస్తూ తన ఇష్టారాజ్యంగా నడుచుకోవడం ఏంటని స్వామికి పంచాయతీరాజ్‌ చట్ట నిబంధనలు వర్తించవా అంటూ అధికారులను పలువురు సామాజిక వేత్తలు..

ఇప్పటికైనా వరంగల్‌ జిల్లా పంచాయతీ శాఖ అధికారి తక్షణమే స్పందించి విద్యుత్‌ శాఖ ఉద్యోగి స్వామి ప్రభుత్వ ఆధీనంలో తీసిన గుంతలను తక్షణమే పూడ్చివేసి అందులో శాశ్వతంగా ఉండే సైన్‌ బోర్డును ఏర్పాటు చేసి పాఠశాల స్థలం అన్యాక్రాంతం కాకుండా అక్రమ నిర్మాణాలకు తావు లేకుండా పారదర్శకమైన పాలన అందించాలని డిమాండ్‌ చేస్తున్నారు స్థానిక ప్రజలు.. మరి జిల్లా పంచాయతీ అధికారి స్పందించి దుగ్గొండి మండల అధికారులను అప్రమత్తం చేసి తక్షణ చర్యలు చేపడతారా.. అధికారులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు తొలగించి నోటీస్‌ తిరస్కరించిన స్వామి పై ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టబోతుంది అన్నది వేచి చూడాల్సి ఉంది..

విద్యుత్‌ శాఖలో అసలు ఏం జరుగుతుంది.. విచారణ పేరుతో నర్సంపేట విద్యుత్‌ శాఖ డి. ఈ కాలయాపన చేయడం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.. స్వామి చేస్తున్న అక్రమ వ్యవహారాలపై దుగ్గొండి మండలం ఎంపీఓ వివరణ కోరితే విద్యుత్‌ శాఖలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగి స్వామి ఫ్లెక్సీని తొలగించాడని, గ్రామపంచా యతీ కార్యదర్శి ఇచ్చిన నోటీసు సైతం తిరస్కరించారని తెలిపారు.. అలాగే ఇల్లీగల్‌ లేఅవుట్‌ అని తెలుపుతూనే పత్రాలు సరిచేసుకొని నిర్మాణ పనులు చేపట్టుకోవాలని స్వామికి ఉచిత సలహా ఇచ్చినట్లు తెలిపారు.. అనుమతి లేదు అని ఒక వైపు చెబుతూ అక్రమ నిర్మాణం చేపడుతున్నాడని లేఔట్‌ సైతం ఇల్లీగల్‌ అని చెబుతోనే స్వామి చేస్తున్న అరాచకాలకు కట్టడి చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది.. వరంగల్‌ జిల్లా కలెక్టర్‌ సత్య శారద స్పందించి విద్యుత్‌ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగి స్వామి చట్టాలను బేఖాదార్‌ చేయడం అధికారుల నోటీసులు తిరస్కరించడం పై తక్షణ చర్యలు చేపడతారా..? లేదా..? అన్న విషయానికి సంబంధించి మరో కథనం ద్వారా పూర్తి ఆధారాలతో వెలుగులోకి తేనుంది ‘‘ఆదాబ్‌ హైదరాబాద్‌’’ మా అక్షరం అవినీతిపై ‘‘అస్త్రం’’

Latest News

టెట్‌ పరీక్షల్లో 83,711 మంది అభ్యర్థులు అర్హత

రాష్ట్రంలో జనవరి 2 నుంచి జనవరి 20 వరకు 20 సెషన్స్‌లో టెట్‌ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,75,753...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS