- ప్రముఖ మహా ఉగ్ర కాళికా ఉపాసకులు పవన్ స్వామి.
- అత్యధిక సీట్లను సాధించి భారీగా పుంజుకోనున్న బిజెపి.
- బిజెపి కి 2013 ఫలితాలను జ్ఞప్తికి తేనున్న 2025 ఎన్నికల ఫలితాలు.
- బిజెపి కి తృటిలో చేజారనున్న అధికారం
- 28 నుండి 34 సీట్లు సాధించనున్న బిజెపి
- గతంతో పోలిస్తే భారీగా తగ్గనున్న ఆప్ పార్టీ సీట్లు.
- 2015 లో 67, 2020 లో 62 సీట్లను సాధించిన ఆప్ పార్టీ
- 36 నుండి 42 సీట్లను కైవసం చేసుకోనున్న ఆప్ పార్టీ
- ఒక్క సీటులోనూ తన ప్రభావం చూపలేక ఘోర పరాజయం దిశగా కాంగ్రెస్ పార్టీ
ప్రముఖ మాహా ఉగ్ర కాళికా ఉపాసకులు నాగభట్ల పవన్ కుమార్ శర్మ, డిల్లీ ఎన్నికల ఫలితాల గురించి జోష్యం చెబుతూ ఇలా అన్నారు. 2013వ సంవత్సరం లో రాజకీయ రంగ ప్రవేశం చెయ్యడం ద్వారా ఆప్ పార్టీ డిల్లీ రాజకీయాలలో తనదైన ముద్ర వేసే ప్రయత్నం చేస్తూ అత్యల్ప సీట్లను గెలిచినప్పటికి మిత్ర పార్టీల సహకారంతో అధికారాన్ని చేపట్టింది. అటు తర్వాత 2015వ సంవత్సరం లో 67, 2020వ సంవత్సరంలో 62 సీట్లను సాధిస్తు రాజకీయ జైత్రయాత్ర సాగించిన ఆప్ పార్టీ ఈ 2025వ సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో తన ప్రభావాన్ని గత ఎన్నికల స్థాయిలో చూపలేకపోతుంది. అతి కష్టం మీద 36 నుండి 42 సీట్లను సాధించడం ద్వారా అధికారంలోకి రాబోతుంది. ఈ ఎన్నికలలో ఆప్ పార్టీకి చెందిన కొందరు ప్రముఖులు అత్తెసురు ఓట్ల తేడాతో గెలవనుండగా మరికొందరు ప్రముఖులు ఎవరు ఊహించని విదంగా ఓటమిపాలు అవనున్నారని పవన్ స్వామి చెప్పారు. 2013వ సంవత్సరంలో 32 సీట్లను గెలిచిన బిజెపి పార్టీ ఆ తర్వాత ఎన్నడూ ఆస్తాయిలో సీట్లను పొందలేక పోయింది. మరీ ముఖ్యంగా 2015 లో జరిగిన ఎన్నికలలో బిజెపి పార్టీ కేవలం 3 సీట్లతో సరిపెట్టుకోగా, 2020లో జరిగిన ఎన్నికలలో 8 సీట్లలో విజయం సాధించిన బిజెపి పార్టీ ఈ సారి భారీగా పుంజుకొని సుమారుగా 28 నుండి 34 సీట్లలలో విజయాన్ని సాధించబోతుందని, ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాకపోవచ్చునని ప్రముఖ మహా ఉగ్ర కాళికా ఉపాసకులు నాగభట్ల పవన్ కుమార్ శర్మ జోష్యం చెప్పారు.
గతం లో పవన్ కుమార్ శర్మ ఆంధ్ర, తెలంగాణ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలతో పాటుగా బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా ఎన్నికల ఫలితాల గురించి కొన్ని నెలల ముందే చెప్పన జోష్యం వాస్తవంగా మారడంతో పాటు ఈ మధ్యనే జరిగిన మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల గురించి అమ్మవారి ఉపాసనా శక్తి ద్వారా వారు చెప్పిన జోష్యం అక్షరాలా ఫలించడం మన పాఠకులకు విదితమే.