Sunday, February 23, 2025
spot_img

ఫిర్యాదు చేయటానికి వస్తే లొంగదీసుకున్నాడు

Must Read
  • మాయమాటలు చెప్పి మోసం

ఫిర్యాదు చేయడానికి పోలీస్‌ స్టేషన్‌కు వచ్చిన యువతిని మాయమాటలతో నమ్మించి ఆమెను లొంగదీసుకున్నాడు. ఈ క్రమంలోనే ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ మేడ్చల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. అయితే ఈ దారుణానికి పాల్పడ్డ కానిస్టేబుల్‌ కి అంతకు ముందే వివాహం జరగడం ఒక ట్విస్ట్‌ అయితే.. చివరికి తన భార్యతో కలిసి బాధిత యువతిపై దాడి చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారుతోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 31 ఏళ్లు ఉన్న బాధిత యువతి ఓ కేసులో డబ్బులు వచ్చేలా చూడాలని మేడ్చల్‌ పోలీస్‌ స్టేషన్‌కు ఫిర్యాదు చేయడానికి వచ్చింది. అక్కడ ఉన్న సుధాకర్‌రెడ్డి అనే కానిస్టేబుల్‌ ఆమెతో మాటలు కలిపాడు. ఆ మహిళతో పరిచయం పెంచుకుని న్యాయం చేస్తానని హామీ ఇచ్చాడు. అనంతరం ఆమెను తన ఇంటికి రప్పించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి లోబరుచుకుని అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలోనే పెళ్లి విషయం మాట్లాడుదామని, తన అమ్మానాన్నలకు పరిచయం చేస్తానని భార్యలేని సమయంలో ఇంటికి రప్పించి అత్యాచారం చేశాడు. ప్రతిసారి ఏదో ఒకలా ఆమెకు మాయమాటలు చెప్పి తన లైంగిక వాంఛలను తీర్చుకుంటూ పలుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. చివరకు బాధితురాలు గర్బం దాల్చడంతో తన నిజస్వరూపం బయటపెట్టాడు. అప్పటికే తనకు పెళ్లి జరిగిందని అబార్షన్‌ చేయించుకోమని సలహా ఇచ్చాడు. అంతే కాకుండా అబార్షన్‌కు ఒత్తిడి చేసి ఆమెతో మాత్రలు బలవంతంగా టాబ్లెట్లు మింగించాడు. మరోసారి యువతి ఇంటికి వెళ్లి బలవంతంగా ఫినాయిల్‌ తాగించాడు. ఆ తర్వాత మరోసారి ఆమెను ఇంటికి పిలిపించుకుని దాడి చేశాడు. అంతటితో ఆగకుండా తన భార్య సింధూజ, స్నేహితుడి కళ్యాణ్‌ గౌడ్‌లతో కలిసి ఆమెపై దాడి చేయించాడు. చివరికి తనకు జరిగిన అన్యాయంపై బాధితురాలు ఉన్నతాధికారులను ఆశ్రయించడంతో కానిస్టేబుల్‌ బాగోతం వెలుగులోకి వచ్చింది. ఇక ప్రస్తుతం సీపీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సుధాకర్‌రెడ్డిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించామని పోలీసుయలు వెల్లడించారు. అలానే సుధాకర్‌రెడ్డి భార్య సింధూజ, స్నేహితుడు కళ్యాణ్‌ గౌడ్‌లపై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.

Latest News

నాణ్య‌త‌లేని సీసీ రోడ్ల నిర్మాణం

గ్రామాల్లో సిసి రోడ్ల నిర్మాణం కొరకు ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ కింద పెద్ద ఎత్తున నిధులు ఇచ్చుకో పుచ్చుకో దంచుకో అన్నవిధంగా వ్యవహరిస్తున్న అధికారులు ఒకటి రెండు గ్రామాల్లో మినహా అంతటా...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS