- కొనుగోలు దారులారా తస్మాత్ జాగ్రత్త
- నమ్మి కొన్నారా నట్టేట మునిగినట్టే
- ఫ్రీ లాంచింగ్ పేరుతో ఇప్పటికే వందల కోట్లు కొల్లగొట్టిన సంస్థ
- రేరా అనుమతులు కరువు పర్మిషన్లు అసలే లేవు
- అయినా అమాయక ప్రజలను మోసగిస్తున్న రియల్ ఎస్టేట్ సంస్థలు
- మధ్యతరగతి ప్రజల జీవితాలతో ఆడుకుంటున్న రియల్ మాయగాళ్లు
- అందమైన బ్రోచర్లతో అమాయక ప్రజలను మోసగిస్తున్న వైనం
అమాయకమైన మధ్యతరగతి ప్రజలు వారి జీవితంలో ఎప్పుడు మోసపోతూనే ఉంటారు. ముఖ్యంగా నేటి ఆధునిక సమాజంలో ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా ఈ పోటీ ప్రపంచంలో ఏదో విధంగా గెలవాలని తపనతో వారు గెలవడం ఏమో కానీ ఎప్పుడు ఓడిపోతూనే ఉంటారు. ఇలాంటి సంఘటనలు రోజుకి ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉంటాయి. ముఖ్యంగా నగరంలో జీవించే పేద మధ్య తరగతి ప్రజలు తమకు సొంతిల్లు ఉండాలని కలలు కంటుంటారు. లేదా కనీసం ఫ్లాట్ అయినా ఉంటే బాగుంటుందని తమ పిల్లల బంగారు భవిష్యత్తుకు అవి ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఎవరిని పడితే వారిని నమ్ముతూ నిండా మునుగుతున్నారు. ఇలాంటి వారిని టార్గెట్ చేసి రియల్ ఎస్టేట్ కంపెనీలు నిండా ముంచుతున్నాయి. ఆస్పైర్ స్పేసెస్ (Aspire Spaces) అనే రియల్ ఎస్టేట్ కంపెనీ కూడా ఫ్రీ లాంచింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్నాయి. తమ సొంతంగా రూపాయి పెట్టుబడి పెట్టకుండా ప్రజలను మభ్యపెట్టి వారి వీక్నెస్ పై దెబ్బ కొట్టి మోసాలకు మోసాలు చేయడం ఇలాంటి ఫ్రీ లాంచింగ్ కంపెనీలకు పరిపాటి, ఇప్పుడు అదే తరహాలో కొత్త కొత్త కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. మల్లంపేట లో 4.2 ఎకరాల్లో ఆ స్పైర్ స్పేసెస్ మెగా ధమాకా అంటూ రంగురంగుల బ్రోచర్లు చెక్కర్లు కొడుతున్నాయి. అమాయక ప్రజలారా తస్మాత్ జాగ్రత్త ఇక్కడ ప్లాట్లు కొంటే బంగారు భవిష్యత్తు అంటూ ఉదరగొడతారు. నమ్మి కొన్నారా నట్టేట మునిగినట్టే అసలు ఫ్రీ లాంచింగ్(Pre Launching Scams) ప్రారంభించిన టి నరసింహారెడ్డికి మల్లంపేటలో భూములు ఉన్నాయా లేదా ఉంటే వాటికి అన్ని అనుమతులు వచ్చాయా అనుమతులు లేకున్నా ఉన్నట్టు కలరింగ్ ఇస్తున్నారు. అందమైన యువతి యువకులతో బ్రోచర్ల ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తారు. బంజారా హిల్స్ జూబ్లీహిల్స్ లాంటి ఏదైనా ప్రాంతాలలో వీరి ఆఫీసులుఉంటాయి. రంగురంగుల అద్దాల మెడలో ఆఫీసులో ఏర్పాటు చేసి ప్రజలను మోసం చేస్తూ ఉంటారు. అసలు వీరు ప్రచారం చేసే ఫ్రీ లాంచింగ్ ప్రాజెక్టులకు రేరా అనుమతులు ఉండవు, ఇరిగేషన్ అనుమతులు ఉండవు, సంబంధిత శాఖల అనుమతులు తీసుకోరు. ఉన్నాయంటూ మోసపూరిత అనుమతులను చూస్తుంటారు. ఒకసారి మీరు ప్లాట్ కానీ విల్లా కానీ కొనే ముందు ఒకటికి పది సార్లు చూసుకొని కొనాలని లేదంటే మీరు కాయ కష్టం చేసి సంపాదించిన డబ్బులు గంగల పోసినట్టేనని ఇప్పుడు నడుస్తున్న మోసాలను బట్టి తెలుసుకోవచ్చు. అస్పెర్ స్పేసెస్ కంపెనీలో పట్టుబడులు పెడుతున్నారా జాగ్రత్త పైసా పెట్టుబడి లేకుండా కోట్లు గడిస్తున్నారు. ఫ్రీ లాంచింగ్ పేరుతో చేసే మోసాలకు దూరంగా ఉండండి అంతేకాకుండా ఆస్పైర్ స్పేసెస్ కంపెనీ ఎక్కడెక్కడ ఇలాంటి మోసాలు చేస్తుందో త్వరలోనే ఆదాబ్ హైదరాబాద్ పత్రిక పరిశోధనాత్మక కథనాలతో మీ ముందుకు తీసుకొస్తుంది.