Saturday, February 22, 2025
spot_img

నిర్లక్ష్యపు నీడలో అంగన్వాడీ కేంద్రాలు..

Must Read
  • రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ లేక అల్లాడుతున్న టీచర్లు, ఆయాలు…
  • చదువు చెప్పేది వారే అన్నం వండి పెట్టేది వారే…..
  • చర్చలు జరిగి ఆరు నెలలు గడిచిన కానరానీ బెనిఫిట్స్‌

40 ఏళ్ల క్రితం ఆవిర్భవించిన అంగన్వాడి కేంద్రాల్లో 50 రూపాయల గౌరవే తనంతో ఆయాగా, టీచర్‌ గా ఉద్యోగాలు పొంది నేడు 65 సంవత్సరాలు నిండాయని రిటైర్మెంట్‌ కల్పించి ఎలాంటి బెనిఫి ట్స్‌ అందివ్వకుండానే నిర్దాక్షిణ్యంగా గత జులై నెలలో ఆయాలను టీచర్లను నిర్బంధంగా బయటకి నెట్టేసింది ప్రభుత్వం. వారికి ఎలాంటి బెనిఫిట్స్‌ రాకుండానే సెంటర్‌ కు రాకుండా తోసేయడంతో 40 ఏళ్లు కష్టపడ్డ జీతాలు తప్ప రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ ఏమీ లేకపోవడంతో ఇప్పుడు ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో వారి జీవితాలు అంధకారంలోకి నెట్టివేయ బడుతున్నాయి. అంతే కాకుండా బలవంతపు రిటర్మెంట్‌ చేశాక ఏర్పడ్డ ఖాళీలను సైతం ఇప్పటివరకు నింపకపోవడంతో టీచర్‌ వారే ఆయా వారే అన్న చందంగా పని ఒత్తిడితో విధులు నిర్వహిస్తున్న అంగన్వాడీ టీచర్లు, ఆయాలు తీవ్రమైన ఒత్తిడి లోనవుతున్నారని పలువురు పేర్కొంటున్నారు. రెండేసి, మూడేసి, నాలుగేసి డ్యూటీలు చేసిన అదనంగా ప్రభుత్వం ఎలాంటి అదనపు వేతనాలు ఇవ్వక పోవడంతో టీచర్లు ఆయాలు నాన అవస్థలు పడుతున్నారు. నర్సంపేట డివిజన్లోని నర్సంపేట, నల్లబెల్లి, దుగ్గొండి, చెన్నారావు పేట, నెక్కొండ, ఖానాపూర్‌ మండ లాల్లో 361 అంగన్వాడి సెంటర్లు ఉండగా ఇందులో ఒక్కొక్క సెంటర్కు టీచర్తోపాటు ఆయా ఉండి ప్రభుత్వం అందించు బలవర్ధకమైన పోషక ఆహారాన్ని అంగన్వాడి పిల్లలకు, బాలిం తలకు, గర్భిణీలకు ప్రతి నిత్యం అందిస్తారు. పాలు, కోడిగుడ్లు, పప్పులు తదితర పోషకా హారాలు అందిస్తూ ప్రతినిత్యం అంగన్వాడి సెంటర్లలో భోజనాలు వండి విద్యార్థులకు, గర్భిణీలకు, బాలింతలకు అందిస్తారు. కాగా నర్సంపేట డివిజన్లోని ఆరు మండలాల్లో బలవంతంగా 65 సంవత్సరాలు నిండాయని 21 మంది ఆయాలను, ఏడుగురు టీచర్లను నిర్దాక్షిణ్యంగా ఇంటికి పంపించేశారు. ఇది గత జూలైలో జరిగినప్పటికీ ఇప్పటివరకు ఆ ఖాళీ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయలేకపోయిందని తద్వారా ఆయాలు లేని చోట టీచర్లు వంటావార్పు చేస్తూ, టీచర్లు లేని చోట ఆయాలు వంట వార్పు చేస్తూనే విద్యార్థులకు చదువు చెప్పడం జరుగుతుంది. దీనివల్ల పని భారం పెరిగి ఒత్తిడికి లోనవుతున్నట్లు అంగన్వాడి టీచర్లు తెలుపుతున్నారు.

ప్రభుత్వంతో చర్చలు సఫలం అమలులో విఫలం..
గత జులైలో నిర్బంధంగా రిటైర్మెంట్‌ ఇచ్చిన ప్రభుత్వం అక్కడి ఖాళీలు భర్తీ చేయకపోవడంతో పని భారం ఒత్తిడి అవుతూనే ఉన్నందున రిటైర్‌ అయిన వారికి ఆయాకు లక్ష రూపాయలు టీచర్‌ కు రెండు లక్షలు ఇవ్వాలని అంగన్వాడి కార్మిక సంఘాల నేతృత్వంలో శిశు సంక్షేమ శాఖ మంత్రితో చర్చలు జరిగాయి. చర్చలకు సరే అని ఒప్పుకున్న ప్రభుత్వం ఇప్పటివరకు దానికి సంబంధించిన జీవోను ప్రకటించకపోవడం గత ఆరు నెలల నుండి డబ్బులు ఎప్పుడు వస్తాయో అని రిటర్న్‌ అయిన ఆయాలు టీచర్లు వేయి కళ్ళతో ఎదురుచూస్తూ మా డబ్బులు ఎప్పుడు ఇస్తారు బిడ్డ అని వచ్చి పోయే వారిని అడుగుతూ వారి దీనగాతను పలువురికి చెపుతున్నారు.

40 ఏళ్లుగా పని చేశా ఉత్త చేతులతో పంపించారు..
వరంగల్‌ జిల్లా నల్లబెల్లి మండలంలోని శనిగరం గ్రామంలో 40 ఏళ్ల క్రితం ఏర్పడ్డ అంగన్వాడి సెంటర్లో ఆయాగా బత్తిని తారమ్మ తన విధులను 50 రూపాయల గౌరవ వేతనంతో పని చేస్తూ వేలాదిమంది విద్యార్థులకు భోజనం వండి పెట్టింది. గత జులైలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఇంటికి ఉత్త చేత్తోనే రావడంతో కార్మిక సంఘాల నాయకులు వివిధ పోరాటాలు చేశాక చివరకు లక్ష రూపాయలైనా వస్తాయని వేయికళ్లతో ఎదురుచూస్తుంది. కాగా 60 ఏళ్ళ నిండగానే వితంతు వృద్ధాప్య పింఛన్‌ కోసం దరఖాస్తు చేసుకుంటే అంగన్వాడి ఆయావు కాబట్టి నీకు పింఛన్‌ ఇవ్వలేమని అప్పటి ప్రభుత్వం తేల్చి చెప్పింది. నేటి వరకు పింఛన్‌ రాక రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ రాక వచ్చి పోయేవారికి తన దీనగాతను వివరిస్తూ కన్నీళ్ల పర్యంతమవుతుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడి సెంటర్‌ ఉన్న ఖాళీ పోస్టులను భర్తీ చేసి అదనపు భారాన్ని తగ్గిస్తూనే ఆయాలకు, టీచర్లకు రిటైర్మెంట్‌ బెనిఫిట్‌ కింద డబ్బులు చెల్లించాలని అంగన్వాడి ఆయాల టీచర్ల సంఘం నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు.

Latest News

ఏసీబీకి చిక్కిన అవినీతి తిమింగలం..

రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌ జనరల్‌ మేనేజర్‌ బి.ఆనంద్‌ కుమార్‌ను అరెస్టు చేసిన ఎసిబి తన కార్యాలయంలో లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం పైలెట్‌ ప్రాజెక్టు సాంక్షన్‌...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS