Saturday, February 22, 2025
spot_img

సొసైటీ సోగయా..పెట్రోల్‌ బంకు హోగయా..

Must Read
  • సహకార సంఘాన్ని నిండా ముంచేసిన ‘సర్‌’కారు
  • ఆర్భాటంగా ఆరంభించి ఆదిలోనే అంతమైన తీరు
  • మూడు రోజుల ముచ్చటగా సాగిన సొసైటీ పెట్రోల్‌ పంపు
  • బెడిసికొట్టిన వ్యూహంతో మూడేళ్లుగా మూతపడేసిన వైనం
  • ప్రారంభించిన ఎమ్మెల్యే లేడు..పెట్రోల్‌ బంక్‌ లేదు
  • అన్నదాతకు మేలు జరుగుడేమో..? కానీ మొత్తానికే ఎసరు
  • ఏడాది పాటు నడిపి నష్టం వచ్చిందని మూడేళ్లుగా మూసివేత
  • చిలిపిచేడ్‌ ప్రాథమిక సహకార సంఘం పెట్రోల్‌ పంపు నష్టం పూరించెదెవరూ..?
  • తిరిగి ప్రారంభించేదెవరూ..? రైతన్నలకు మేలు చేసేదెవరూ..?

ఎవరో చెబితే గుడ్డిగా నమ్మి మోసపోవడం కంటే సర్కారు వారి మాటమీద ప్రాథమిక సహకార సంఘంగా ఏర్పడి లాభాల బాటలో పయనిద్దామనుకున్న ఓ సహకార సంఘానికి సర్కారు వారి పాట సర్వం నష్టాల పాలు చేసిన తీరు సర్వత్రా సంచలనం రేపుతోంది. చిలిపిచేడ్‌ మండల పరిధిలోని శీలంపల్లి గ్రామ గేటు వద్ద ప్రాథమిక సహకార సంఘం తరుపున 0.10గుంటల పొలంను లీజుకు తీసుకొని పెట్రోల్‌ పంపును ఏర్పాటు చేశారు. 02ఫిబ్రవరి 2021న అంగరంగవైభవంగా అప్పటి స్థానిక ఎమ్మెల్యే చిలుముల మదన్‌ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్స వాలు జరిపించారు. చిలిపిచేడ్‌ మండలం పరిధిలో అన్ని గ్రామాలే ఎక్కువగా ఉన్నాయని, చాలా మంది వ్యవసాయం మీద ఆధార పడిన రైతులే కాబట్టి డీజిల్‌ పై కూడా అన్ని పెట్రోల్‌ పంపుల కంటే 1 రూపాయి తక్కువకే సహకార సంఘం ద్వారా ఇస్తారని ఆర్భాటంగా ఆనాటి ఎమ్మెల్యే మదన్‌ రెడ్డి ప్రసంగించారు. స్థానిక రైతులు కూడా ఎంతో సంతోషంతో సంబరాలు చేసుకున్నారు. పెట్రోల్‌ పంపు సజావుగా కొనసాగుతోందని, ప్రాథమిక సహకార సంఘానికి లాభాలు వస్తాయని ఆశపడిన సంఘం సభ్యుల ఆశలు అడియాశలయ్యాయి. రూపాయి తక్కువకే పెట్రోల్‌ దొరుకుతుందనుకున్న రైతులకు అసలు పెట్రోల్‌ పంపు లేకుండా పోయింది. కనీసం రూపాయి తగ్గింపు లేకున్నా కూడా మామూలు పెట్రోల్‌ బంక్‌ మాదిరిగా నడిపినా సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా నాణ్యమైన పెట్రోల్‌ డీజీల్‌ లభించేదని ఆశపడిన రైతులు వినియోగదారుల ఆశలపై మూడున్నాళ్ల ముచ్చటగా మార్చేశారు.

ఇంత వరకు బాగానే అంతలోనే బంద్‌ ఎందుకు..?
02 ఫిబ్రవరి 2021న ప్రారంభం అయిన పంపు 2022 మార్చిలో మూత పడిపోయింది. సరిగ్గా సంవత్సరం కూడా కాలేదు. అంతలోనే మూతపడడానికి అసలు కారణం ఆనాటి సర్‌ కారు రూలు మాత్రమేనట. పెట్రోల్‌ బంక్‌ బంద్‌ చేయడానికి సహకార సంఘం సీఈఓ పోచయ్య తెలిపిన వివరాలు విస్తూగొల్పేలా ఉన్నాయి. మామూలుగా డీలర్‌ పెట్రోల్‌ బంక్‌ లకు ఒక ధర, వినియోగదారుల బంక్‌ లలో మరో ధరను కేటాయించారని, ప్రస్తుతం ధరతో పోల్చితే పెట్రోల్‌ డీలర్‌ పంపులకు వచ్చే ధర పెట్రోల్‌ 107 రూపాయలు, డీజిల్‌ 96 రూపాయలకు వస్తుంది. కానీ సహకారం సంఘం పంపులకు ప్రస్తుతం పెట్రోల్‌ ధర 108.50, డీజిల్‌ ధర 125 రూపా యలుగా వస్తుందని వివరించారు. సాధారణ పెట్రోల్‌ పంపులలో ఉన్న పెట్రోల్‌ డీజిల్‌ కంటే ఎక్కువ ధరకు ప్రభుత్వం నుండి ఇవ్వడం వలన నష్టాలు భరిస్తూ నడపలేకపోయామని పోచయ్య వివరణ ఇచ్చారు. అందుకే పెట్రోల్‌ పంపును నడపలేక మొత్తానికే మూతపడేశామని తెలిపారు.

భారీ నష్టం మూటకట్టుకున్న ప్రాథమిక సహకార సంఘం..
పెట్రోల్‌ పంపు వల్ల సొసైటీకి భారీ నష్టం వాటిల్లిందని నిర్వాహ కులు చెబుతున్నారు.పెట్రోల్‌ పంపు ప్రాథమిక సహకార సంఘానికి తీరని నష్టమే తెచ్చి పెట్టిందని, కేవలం సంవత్సర కాలంలో ఆనాటి ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయం కారణంగానే సహకారం చేద్దామనుకున్న సంఘానికి సర్వం నష్టం వాటిల్లేలా చేసిందని సభ్యులు వాపోయారు. పెట్రోల్‌ పంపు నిర్మాణానికి రూ. 22 లక్షలు, పెట్రోల్‌ డీజిల్‌ తీసుకురావడానికి రూ. 12లక్షలు, రూ.2లక్షలు పొలం లీజుకు అడ్వాన్స్‌ ఇచ్చి 25 సంవత్సరాల అగ్రిమెంట్‌ మొత్తంగా రూ.36 లక్షలతో ప్రారంభించారు. సర్కార్‌ నిర్ణయం వలననే పెట్రోల్‌ పంపు మూతపడి ప్రాథమిక సహకార సంఘానికి భారీ నష్టాన్నే తెచ్చి పెట్టిందన్నారు. అయినప్పటికీ నష్టం భరిస్తూనే బంద్‌ ఉన్న పెట్రోల్‌ పంపు స్థలానికి ప్రతినెలా రూ.10వేల అద్దె కూడా ఇవ్వక తప్పడం లేదని సంఘం సభ్యులు వాపోతున్నారు.

సాధారణంగా పెట్రోల్‌ బంక్‌ నిర్వహణ రెండు రకాలు
పెట్రోల్‌ పంపుల నిర్వహణ సాధారణంగా రెండు రకాలుగా ఉంటుంది. నేరుగా ఆయిల్‌ కంపెనీ డీలర్‌ ద్వారా నిర్వహించే పెట్రోల్‌ బంక్‌, వ్యక్తిగతంగా నిర్వహించే కన్స్యూమర్ బంక్‌లు ఉంటాయి. కంపెనీ డీలర్‌ పెట్రోల్‌ పంపుల కంటే కన్స్యూమర్‌ పంపులకు పెట్రోల్‌, డీజిల్‌ 1రూపాయి తక్కువకే ఉండేది. కానీ సరిగ్గా పెట్రోల్‌ పంపు ప్రారంభించి సంవత్సరం గడవకుండానే గవర్నమెంట్‌ నిర్ణయాలతో తారుమారు అయింది. కంపెనీ డీలర్‌ నిర్వహించే పెట్రోల్‌ పంపు కంటే కన్స్యూమర్‌ పంపులకు ప్రభు త్వం ఎక్కువ ధరలు కేటాయించడంతోనే ఎంతో హంగు ఆర్భా టంగా ప్రారంభించిన సహకార సంఘం పెట్రోల్‌ పంపును ఆది లోనే మూత పడేయాల్సి వచ్చిందని, మొత్తంగా పెట్రోల్‌ పంపు వల్ల సహకార సంఘానికి కోలుకోలేని నష్టం వాటిల్లిందని సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాథమిక సహకార సంఘానికి వాటిల్లిన నష్టాన్ని పూరించేదెవరో.. పునఃప్రారంభించేదెవరో.. ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో 14ఫిబ్రవరి2021 న ప్రారంభించారు. అంచనా వ్యయం రూ.44లక్షలుగా నిర్ణయించారు. ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ నుంచి ఒప్పందం చేసుకొని స్థలానికి రూ. 2 లక్షలు, వాచ్‌మెన్‌కు నెలకు రూ.4వేలు వేతనం, స్థలానికి అద్దె నెలకు రూ.11వేలు, ట్యాంక్‌ కెపాసిటీ 2020 కిలో లీటర్లు చొప్పున ఏర్పాటు చేసిన పెట్రోల్‌ బంక్‌ మూతపడటంతో నష్టాలపాలైన ప్రాథమిక సహకార సంఘానికి నష్టాన్ని పూరించేదెవరో.. పునఃప్రారంభించేదెవరో.. వేచి చూడాల్సిందే.

Latest News

నాణ్య‌త‌లేని సీసీ రోడ్ల నిర్మాణం

గ్రామాల్లో సిసి రోడ్ల నిర్మాణం కొరకు ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ కింద పెద్ద ఎత్తున నిధులు ఇచ్చుకో పుచ్చుకో దంచుకో అన్నవిధంగా వ్యవహరిస్తున్న అధికారులు ఒకటి రెండు గ్రామాల్లో మినహా అంతటా...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS