Saturday, February 22, 2025
spot_img

ఏసీబీకి చిక్కిన అవినీతి తిమింగలం..

Must Read
  • రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌ జనరల్‌ మేనేజర్‌ బి.ఆనంద్‌ కుమార్‌ను అరెస్టు చేసిన ఎసిబి
  • తన కార్యాలయంలో లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం
  • పైలెట్‌ ప్రాజెక్టు సాంక్షన్‌ కొరకు చేపట్టిన వసూళ్ల పర్వం
  • నాగోలులోని ఆనంద్‌ కుమార్‌ ఇంటిపై ఏసీబీ దాడులు..
  • కోట్లాది రూపాయలు కూడా పెట్టినట్లు ఫిర్యాదులు!

తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌లో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా పని చేస్తూ, ప్రస్తుతం జనరల్‌ మేనేజర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న బొప్పూరి ఆనంద్‌ కుమార్‌ తీవ్రమైన అవినీతి అక్రమాలకు, లంచగొండి తనానికి తెగబడుతున్న విషయం అవినీతి నిరోధక శాఖ (ఏ.సి.బి) దృష్టికి రాగా, అధికారులు ఓ బాధితుడి నుండి లక్ష రూపాయలు డిమాండ్‌ చేసి లంచం తీసుకుంటుండగా రెడ్‌ హ్యాండెడ్‌ గా వల పన్ని ఆనంద్‌ కుమార్‌ పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఓ పైలట్‌ ప్రాజెక్ట్‌ అను మతి బిల్లు మంజూరి కోసమని అడ్వాన్సుగా గురువారం బాధి తుడి నుండి లక్ష రూపాయలు లంచం తన కార్యాల యంలోనే తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అంతేకా కుండా ఎస్సీ కార్పొరేషన్‌ జనరల్‌ మేనేజర్‌ హోదాలో ఆనంద్‌ కుమార్‌ కోట్లాది రూపాయలు, భూములు, ఆస్తులు కూడబెట్టిన ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ ఆ దిశగా కూడా విచారణ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఏకకాలంలో ఆయన ఇంటిపై కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తు న్నట్లు సమాచారం. పూర్తి సమాచారం ఇంకా బయటికి రావాల్సి ఉందని అధికారులు తెలిపారు. గురువారం మాసబ్‌ ట్యాంక్‌ ప్రాంతంలోని దామోదరం సంజీవయ్య సంక్షేమ భవనంలోని ఐదవ అంతస్తులో ఉన్న తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌ లో జరిగిన ఏసీబీ దాడుల గురించి ఉద్యోగులంతా తీవ్రంగా చర్చించుకోవడం గమనించదగ్గ విషయం. మొన్నటి వరకు ఎస్సీ కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ గా పనిచేసి, రిటైర్మెంట్‌ అయిన ఓ అధికారితో ఆనంద్‌ చేతులు కలిపి, ఈ ఇరువురు కుమ్మక్కై, గురు శిష్యులుగా మూడున్నర ఏండ్లు ఈఇద్దరు కలసి ఎస్సీ కార్పొ రేషన్‌లో సుమారు 100 కోట్లు దళితుల సొమ్ము దోపిడి చేసి ఉంటారని ఇక్కడి ఉద్యోగులంతా గుసగుసలాడుకుంటున్నారు. ఏసీబీ ఆ దిశగా పావులు కదిపితే వీళ్ళ డొంక మొత్తం కదులు తుందని ఇక్కడి ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. ఈ గురు శిష్యులు ఇద్దరు కలిసి రంగారెడ్డి, సంగారెడ్డి, నిర్మల్‌, యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి తదితర ప్రాంతాల్లో ఎకరాల కొద్ది భూములు కొనుగోలు చేసినట్లు విశ్వసనీయ సమాచారం.

Latest News

నాణ్య‌త‌లేని సీసీ రోడ్ల నిర్మాణం

గ్రామాల్లో సిసి రోడ్ల నిర్మాణం కొరకు ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ కింద పెద్ద ఎత్తున నిధులు ఇచ్చుకో పుచ్చుకో దంచుకో అన్నవిధంగా వ్యవహరిస్తున్న అధికారులు ఒకటి రెండు గ్రామాల్లో మినహా అంతటా...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS