Saturday, April 19, 2025
spot_img

హైదరాబాద్‌ తాజ్‌ బంజారా హోటల్‌ సీజ్‌

Must Read
  • గత రెండేళ్లుగా పన్ను చెల్లించని తాజ్‌ బంజారా
  • రూ. కోటి 47 లక్షల టాక్స్‌ పెండింగ్‌
  • జీహెచ్‌ఎంసీ అధికారులు 5 సార్లు నోటీసులు ఇచ్చిన స్పందించని హోటల్‌ యాజమాన్యం
  • పన్ను కట్టనందకు హోటల్‌ సీజ్‌ చేసిన జిహెచ్‌ఎంసి అధికారులు

హైదరాబాద్‌ సిటీలో ఫేమస్‌ అయిన తాజ్‌ బంజారా(Hotel Taj Banjara) హోటల్‌కు జీహెచ్‌ఎంసీ అధికా రుల షాక్‌ ఇచ్చారు. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ తాజ్‌ బంజారా హోటల్‌ను జీహెచ్‌ఎంసీ అధికారులు శుక్రవారం ఉదయం సీజ్‌ చేశారు. గత రెండేళ్లుగా పన్ను చెల్లించకపోవడంతో ఈ మేరకు అధికారులు సీజ్‌ చేశారు. పన్ను చెల్లించాలని పలు మార్లు నోటీసులు ఇచ్చినా హోటల్‌ యాజమాన్యం స్పందించలేదు. దీంతో అధికారులు హోటల్‌ను సీజ్‌ చేశారు. మొత్తం రూ. కోటి 47 లక్షల టాక్స్‌ పెండింగ్‌ ఉందని, పన్ను చెల్లించాలని.. జీహెచ్‌ఎంసీ అధికారులు 5 సార్లు నోటీసులు ఇచ్చిన హోటల్‌ యాజమాన్యం స్పందించక పోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్‌ సిటీలో ఫేమస్‌ అయిన.. నిత్యం బిజీగా ఉండే తాజ్‌ బంజారా హోటల్‌కు సెలబ్రెటీలు ఎక్కువగా వస్తుంటారు. క్రికెటర్లు ఎప్పుడు వచ్చినా ఈ హోటల్‌లో బస చేస్తుంటారు. అలాగే దేశంలోని కీలక రాజకీయనేతలు హైదరాబాద్‌ వచ్చినప్పుడు ఇక్కడే స్టే చేస్తారు. పార్టీ సమావేశాలకు అనుకూలంగా ఉండడంతో ఎక్కువ మంది ఈ హోటల్‌ వైపు మొగ్గుచూపుతారు. అటాంటి హోటల్‌ సీజ్‌ కావడం గమనార్హం..

Latest News

ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్.. చాలా ఆనందాన్ని ఇచ్చింది

అర్జున్ S/O వైజయంతి సక్సెస్ ప్రెస్ మీట్ లో హీరో నందమూరి కళ్యాణ్ రామ్ నందమూరి కళ్యాణ్ రామ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ అర్జున్ S/O వైజయంతి....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS