- దోమలు,ఈగలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు.
నందిగామ మండలం రంగపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని చలివేంద్రగూడ గ్రామంలో గత కొన్ని నెలల నుంచి పారిశుధ్యం లోపించడంతో దోమలు, ఈగల సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పొద్దంత పనిచేసి హాయిగా పడుకుందామంటే దోమలకు రాత్రిలో అసలు నిద్రనే రావడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ సమస్యపై పలుమార్లు అధికారులు,ప్రజాప్రతినిధులు దృష్టికి తీసుకెళ్లానప్పటికి సమస్య పరిష్కారం కావడం లేదని, దోమల వల్ల చిన్నపిల్లలు, పెద్దలు డెంగ్యూ మలేరియా లాంటి వ్యాధులతో బాధలు పడుతున్నామని ప్రజలు తెలిపారు. ముఖ్యంగా గ్రామంలోని మురుగు నీళ్లు ముందుకు వెళ్లే మార్గం లేక గ్రామంలోని నీళ్ళని ఒకేచోట చేరడంతో దోమలు, ఈగల బాధ ఎక్కువయ్యిందన్నారు. గ్రామంలోని మురుగు నీళ్లు నేరుగా ముప్పు వెంచర్ నుంచి చెరువులోకి వెళ్ళేవని, ఇప్పుడు ఆ మురుగు నీళ్లు చెరువులోకి వెళ్లకుండా ముప్ప వెంచర్ నిర్వాహకులు అడ్డుకట్ట వేయడంతో నీళ్లు ముందుకు వెళ్లకుండా ఒకే చోట ఇండ్లముందు నిలవడంతో అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నామని వారి బాధలను తెలిపారు.కనీసం అధికారులు స్పందించి మురుగు నీళ్లను చెరువులోకి వెళ్లే విధంగా చర్యలు తీసుకుని మమ్మల్ని దోమలు, ఈగలు సమస్య నుంచి కాపాడాలని గ్రామస్థులు కోరుతున్నారు…