Saturday, March 1, 2025
spot_img

మైసిగండిలో ప్రారంభమైన శివరాత్రి బ్రహ్మోత్సవాలు

Must Read
  • నేడు శివపార్వతుల కళ్యాణ మహోత్సవం
  • ఆలయ ఫౌండర్ ట్రస్టీ లక్ష్మీ శిరోళీ పంతు నాయక్

రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలంలోని మైసిగండిలోని శ్రీ మైసమ్మ దేవత, శివాలయ, రామాలయ దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరుగనున్న ఈ ఉత్సవాలు మంగళవారం విఘ్నేశ్వర పూజ, ధ్వజారోహణం,స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకంతో వేద పండితుల మంత్రాలతో ప్రారంభమయ్యాయి. ఆలయ అర్చకులు ఫౌండర్ ట్రస్టీ లక్ష్మీ శిరోళీ పంతు నాయక్ కుటుంబ సభ్యులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా ఈరోజు రాత్రి 9.గం.లకు శివపార్వతుల కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నామని ఆలయ ఫౌండర్ ట్రస్టీ రామావత్ లక్ష్మీశిరోళీ పంతునాయక్ తెలిపారు. అలాగే మహాశివరాత్రి ఉపవాస దీక్షల సందర్భంగా ఉపవాసం విరమించడానికి ఇక్కడికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నామని, ఆలయ ప్రాంగణంలో వేడిని తట్టుకోవడానికి ప్రత్యేకంగా టెంట్లు ఏర్పాటు చేశామన్నారు. శివపార్వతుల కళ్యాణ మహోత్సవం అనంతరం అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు చేసిన తర్వాత స్వామివారి రథోత్సవం నిర్వహించబడును. మూడు రోజులు జరిగే ఉత్సవాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వారి కృపకు పాత్రులు కాగలరని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్పీ జ్యోతి అరుణ్ దంపతులు,భాస్కర్ దంపతులు, ఆలయ ఉపప్రధాన అర్చకులు యాదగిరి,అర్చకులు భానుప్రకాష్ శర్మ, వెంకటరమణ, అమూల్య పాటి, ఆనంద్, విజయ్ మరియు సిబ్బంది చంద్రయ్య, శ్రీనివాస్, దేవేందర్, కృష్ణ, శ్రవణ్ మరియు భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Latest News

విజయ బ్రాండ్ పేరుతో నకిలీ పాల హల్చల్

విక్రేతలు, వినియోగదారులు, పంపిణీదారులు జాగ్రత్తగా ఉండాలంటున్న డైరీ చైర్మన్ తెలంగాణ పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సమాఖ్య లిమిటెడ్ (టీజీడీడీసీఎఫ్) కు సంబంధించిన విజయ తెలంగాణ బ్రాండ్...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS