Friday, February 28, 2025
spot_img

కొంపముంచిన ఓటర్‌ లిస్ట్‌..

Must Read
  • ఎంపీడీఓ, ఎంపీఓ, పంచాయతీ సెక్రటరీ, టైపిస్ట్‌ సస్పెండ్‌
  • మరో ముగ్గురు పంచాయతీ కార్యదర్శిలను డిపిఓ ఆఫీస్‌కి అటాచ్ చేస్తూ జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు
  • ఓటర్‌ లిస్టులో పొరపాట్లు ఉన్నాయంటూ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు
  • విచారణకు ఆదేశించిన ఎన్నికల కమిషన్ చేస్తూ
  • మండల అధికారుల నిర్లక్ష్యం మూలంగా, నలుగురిపై సస్పెన్షన్‌ వేటు

ఓటర్‌ లిస్ట్‌ జాబితాలోపై తండా వాళ్లను కింది తండాలో కింది తండా వాళ్లనుపై తాండాలలోవేసి, అడ్డగోలుగా ఓటర్‌లిస్ట్‌ తయారుచేసిన గ్రామ, మండల అధికారులపై అదే తండాకు చెందిన ఓ వ్యక్తి ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయడంతో, మండల అధికారులతో పాటు కిందిస్థాయి సిబ్బంది మీద కూడా సస్పెన్షన్‌ వేటుపడింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. సూర్యాపేట జిల్లా హుజూర్‌న‌గ‌ర్ నియోజకవర్గం మఠంపల్లి మండలం ఎంపీడీఓ బాణాల శ్రీనివాస్‌, ఎంపీఓ నరేష్‌, చెన్నయ్‌ పాలెం గ్రామపంచాయతీ కార్యదర్శి బాల సైదు లును, టైపిస్టు ఇమ్రాన్‌ అతిఫ్‌ను సస్పెండ్‌ చేశారు. అలాగే ప్రస్తుతం అక్కడ పని చేస్తున్న గ్రామ కార్యదర్శి, ఇన్చార్జి కార్యదర్శులు అయిన విజయలక్ష్మి, జైసన్‌ రాజా, ప్రవీణ్‌ ముగ్గురు సెక్రటరీలను జిల్లా పంచాయతీ రాజ్‌ ఆఫీస్‌కు అటాచ్‌ చేసినట్లు ఇన్చార్జి డిపిఓ సత్యనారాయణ తెలిపారు. ఈ అధికారులు మఠంపల్లి మండలం చెన్నై పాలెం కింది తండలో ఓటరు జాబితాలో, అధికారులు వార్డులు సక్రమంగా ఎంపిక చేయలేదని అలాగేపై తండాకు సంబంధించిన కొన్ని ఓట్లు కింది తండా గ్రామంలో చేర్చారని, కింది తండా గ్రామానికి చెందిన బాబురావు అనే వ్యక్తి ఎన్నికల కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లగా ఓటర్‌ జాబితాను పరిశీలించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఎంపీడీఓ, ఎంపీఓ, గ్రామపంచాయతీ కార్యదర్శి అంతా మంచిగానే ఉందని అధికారులకు రిపోర్ట్‌ చేసి అలాగే ఓటర్ల జాబితా ఎంపిక చేయడంతో మళ్ళీ ఆ గ్రామానికి చెందిన బాబురావు అనే వ్యక్తి ఓటర్ల జాబితాను మార్పు చేయకుండా అలాగే ఫైనల్‌ లిస్ట్‌ చేశారని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయగా దీన్ని పరిగణలోకి తీసుకున్న ఎన్ని కల కమిషనర్‌ సీరియస్‌గా తీసుకుని విచారణ చేసి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాల్సిందిగా సూర్యాపేట జిల్లా కలెక్టర్‌ కు ఆదేశించడంతో ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్‌ మఠంపల్లి మండలం ఎంపీడీఓ, ఎంపీఓ, గ్రామ కార్యదర్శి, టైపిస్టు ను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Latest News

విజయ బ్రాండ్ పేరుతో నకిలీ పాల హల్చల్

విక్రేతలు, వినియోగదారులు, పంపిణీదారులు జాగ్రత్తగా ఉండాలంటున్న డైరీ చైర్మన్ తెలంగాణ పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సమాఖ్య లిమిటెడ్ (టీజీడీడీసీఎఫ్) కు సంబంధించిన విజయ తెలంగాణ బ్రాండ్...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS