Friday, February 28, 2025
spot_img

దేశవ్యాప్తంగా మహా శివరాత్రి పర్వదినం

Must Read
  • జ్యోతిర్లింగ క్షేత్రాలకు పోటెత్తిన భక్తులు
  • ఉజ్జయినిలో సిఎం మోహన్‌ యాదవ్‌ దంపతుల పూజలు
  • గోరఖ్‌పూర్‌లో యోగి ఆదిత్యానాథ్‌ ప్రత్యేక పూజలు

దేశవ్యాప్తంగా మహా శివరాత్రి పర్వదినాన్ని ప్రజలు మహా వేడుకగా జరుపుకున్నారు. దేశంలోని అన్ని శైవాలయాలు, జ్యోతిర్లింగాలు.. శివ భక్తులతో నిండిపోయాయి. తెల్లవారుజాము నుంచే ప్రధాన ఆలయాల్లో అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. వారణాసి, ఉజ్జయిని, సోమ్‌నాథ్‌ వంటి ప్రధాన శైవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోరక్‌పూర్‌లో సిఎం యోగి ఆదిత్యనాథ్‌ ప్రత్యేక పూజలు చేశారు. మధ్యప్రదేశ్‌ సీఎం మోహన్‌ యాదవ్‌ దంపతులు ఉజ్జయినిలోని మహాకాలేశ్వర్‌ ఆలయంలో ప్రత్యేక పూజులు, అభిషేకాలు చేశారు. ఆ ఆలయంలో ఇవాళ తెల్లవారుజామున భస్మహారతి నిర్వహించారు. ఆ తర్వాత మహాకాలుడిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. వారణాసిలోని కాశీ విశ్వనాథుడికి ఇవాళ ఉదయం ప్రత్యేక హారతి ఇచ్చారు. కాశీలో వేల సంఖ్యలో భక్తులు విశ్వనాథుడి దర్శనం కోసం ఎదురుచూస్తున్నారు. సుమారు అయిదు కిలోవిూటర్ల మేర అక్కడ భక్తులు క్యూ కట్టనట్లు తెలుస్తోంది. ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమం వద్ద భక్తులు పవిత్ర స్నానాలు చేశారు. ఢిల్లీలోని గౌరీశంకర్‌ ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. హరిద్వార్‌లోని ఢాకేశ్వర్‌ మహాదేవ్‌ ఆలయం వద్ద భక్తులు భారీ క్యూలైన్‌ కట్టారు. మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర్‌ ఆలయాన్ని విద్యుత్తు దీపాలతో అలంకరించారు. శివరాత్రి సందర్భంగా భక్తులు భారీ సంఖ్యలో త్రినేత్రుడి దర్శనం చేసుకుంటున్నారు. మహాశివరాత్రి సందర్భంగా భక్తులు లక్షల సంఖ్యలో హాజరయ్యారు. జార్ఖండ్‌లోని దేవ్‌ఘర్‌లో ఉన్న జ్యోతిర్లింగ క్షేత్రమైన బాబా బైద్యనాథ్‌ ఆలయంలో కూడా భక్తులు కిటకిటలాడిపోయారు. మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేరళలోని కొచ్చిలో ఉన్న అలువ మహాదేవ్‌ ఆలయానికి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. గుజారాత్‌ లోని సోమ్‌నాథ్‌ ఆలయంలో వేకువజాము నుంచే అభిషేకాలు నిర్వహించారు. ప్రత్యేక పూజలు చేపట్టారు. రామేశ్వరంలో ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు సముద్రస్నానాలు ఆచరించి శివుడి దర్శనం చేసుకు న్నారు. వివిధ రాష్ట్రాల్లో ఉన్న శివాలయాల్లో వేకువ జామునుంచే భక్తుల రద్దీ పెరిగింది. శ్రీకాళహస్తిలోని శివాలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. శివరాత్రి సందర్భంగా భక్తులు భారీ సంఖ్యలో ఆలయ దర్శనం కోసం వస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి తెల్లవారుజామున హనుమకొండ లోని వెయ్యి స్తంభాల గుడిలో పూజలు నిర్వహించారు. గ్వాలియర్‌లో ఉన్న అచలేశ్వర్‌ ఆలయంలో కూడా భక్తులు పెద్దగా ఎత్తున దర్శనాలు చేసుకున్నారు. ఏపీలోని శ్రీశైలంలో కూడా భారీగా పూజలు నిర్వహించారు.

Latest News

విజయ బ్రాండ్ పేరుతో నకిలీ పాల హల్చల్

విక్రేతలు, వినియోగదారులు, పంపిణీదారులు జాగ్రత్తగా ఉండాలంటున్న డైరీ చైర్మన్ తెలంగాణ పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సమాఖ్య లిమిటెడ్ (టీజీడీడీసీఎఫ్) కు సంబంధించిన విజయ తెలంగాణ బ్రాండ్...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS