Friday, March 14, 2025
spot_img

మృతదేహంతో గజ్వేల్ ఆర్డీవో కార్యాలయంకు

Must Read
  • స్మశాన వాటికకు స్థలం కేటాయించాలంటూ ముస్లింల ఆందోళన
  • ఐదేళ్లవుతున్నా సమస్య పరిష్కారం కావడం లేదంటూ నిరసన
  • మల్లన్నసాగర్ నిర్వాసితులను పట్టించుకోవడం లేదంటూ ఆవేదన
  • ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం అందజేత
  • అంతిమ సంస్కారాలకు తాత్కాలిక పరిష్కారం చూపిన మజీద్ కమిటీ చైర్మన్ మతీన్

మల్లన్నసాగర్ ముంపు గ్రామాల్లో ఎవరైనా ముస్లింలు చనిపోతే అంతిమ సంస్కారాలు జరపడానికి ప్రభుత్వం ఇప్పటివరకు ముస్లింలకు స్మశానవాటికను సైతం కేటాయించలేదంటూ స్మశాన వాటికకు స్థలం కేటాయించాలని కోరుతూ గజ్వేల్ ఆర్డివో కార్యాలయం వద్ద ఆర్ అండ్ ఆర్ కాలనీ ఎర్రవల్లి గ్రామ ముస్లింలు శుక్రవారం మృతదేహంతో ఆందోళనకు దిగారు. మల్లన్నసాగర్ ముంపు గ్రామాలను గత ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చి గజ్వేల్ పట్టణ శివారులోని ఆర్ అండ్ ఆర్ కాలనీకి తరలించారు కానీ ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో నెరవేర్చలేదని ముస్లింలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఐదు సంవత్సరాలుగా తాము పడుతున్న ఇబ్బందులను వినతిపత్రాల ద్వారా అధికారుల దృష్టికి తెచ్చినప్పటికీ ఫలితం లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు స్మశానవాటికకైనా స్థలం కేటాయించాలని కలెక్టర్, ఆర్డిఓ కార్యాలయాల చుట్టూ గత ఐదేళ్లుగా తిరుగుతున్నప్పటికీ ఫలితం లేకపోగా, ఎవరైనా ముస్లింలు చనిపోతే వారికి ఎక్కడ అంతిమ సంస్కారాలు చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. తాము విధిలేని పరిస్థితులలో స్మశాన వాటికకు స్థలం కేటాయించాలని డిమాండ్ చేస్తూ మృతురాలు నాజియా మృతదేహంతో గజ్వేల్ ఆర్డివో కార్యాలయం వద్ద ఆందోళనకు దిగినట్లు తెలిపారు. మల్లన్నసాగర్ ముంపు గ్రామమైన ఎర్రవల్లి గ్రామానికి స్మశాన వాటిక కొరకు స్థలం కేటాయించే వరకు తాము ఆందోళన విరమించేది లేదని ఆర్డీవో కార్యాలయం వద్ద వారు భీష్మించుకు కూర్చున్నారు. అదేవిధంగా ముస్లింలు గజ్వేల్ ఆర్డీవో కార్యాలయంలో స్మశానవాటికకు స్థలం కేటాయించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఈ క్రమంలో విషయం తెలుసుకున్న గజ్వేల్ మజీద్ కమిటీ చైర్మన్ సయ్యద్ మతీన్ అక్కడికి చేరుకొని వారికి తాత్కాలిక పరిష్కారం చూపారు. మృతురాలు నజియా మృతదేహాన్ని గజ్వేల్ పట్టణంలోని దర్గాలోని స్మశాన వాటికకు తరలించి అంతిమ సంస్కారానికి అవకాశం కల్పించి పరిష్కారం చూపడం పట్ల ఎర్రవల్లి ముస్లింలు కృతజ్ఞతలు తెలిపారు.

Latest News

15 నుంచి ఒంటిపూట బడులు

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9గంటల నుంచే భానుడి తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీంతో ఇళ్ల నుంచి బయటకు రావటానికి జనం జంకుతున్నారు. రాబోయే రోజుల్లో...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS