- 2 సం.లు గడుస్తున్నా ఇంక్రిమెంట్, బోనస్ ఇస్తలేదు..
- 30 రోజులకు 26 రోజులకే జీతం..
- ఒక్కరోజు సెలవు పెడితే వారం జీతం కట్..
- మహిళ కార్మికులు 23 ఏళ్లుగా పని చేస్తున్న 13 వేలు సాలరీ..
- ఇది ఏంటి అని ఎవరైనా అడిగితే ఉద్యోగం ఊస్ట్..
- కంపెనీ గేటు ముందు 12 గం. పాటు ధర్నా చేసిన కార్మికులు..
నెలలో 30 రోజులు జీతం కట్టించాలని, ఇంక్రిమెంట్లు పెంచాలని, బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శనివారం సువెన్ ఫార్మా లో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు కంపెనీ గేటు ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు కార్మికులు మాట్లాడుతూ సెవెన్ ఫార్మాలో పనిచేయడానికి, 20, 30 కిలోమీటర్ల దూరం నుండి వస్తున్నామని 20, 23 సంవత్సరాలుగా ఇక్కడ పనిచేస్తున్నామని అయినా ఎలాంటి ఇంక్రిమెంట్లు, బోనస్ ఇవ్వకుండా మాతో వెట్టి చాకిరి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీక్లీ ఆఫ్ పేరుతో మా జీతాలలో కోతలు విధిస్తున్నా రని అన్నారు. ఫార్మా యాజమాన్యం పాత కాంట్రా క్టర్లను తొలగించినప్పుడు మేము ఎంతో సంతోషిం చాం, కానీ కొత్త కాంట్రాక్టర్ లను తీసుకొచ్చారు. కొత్త కాంట్రాక్టర్లు వచ్చినప్పుడు కార్మికులతో కొన్ని ఒప్పందలు చేసుకున్నమన్నారు. కార్మికులకు కొన్ని లీవ్ లు ఇస్తామని, ప్రతి సంవత్సరం బోనస్ లు ఇస్తామని, ప్రతి సంవత్సరం ఇంక్రిమెంట్లు కూడా వేస్తామని చెప్పడంతో కార్మికులమంతా ఎంతో సంతోషించామన్నారు. కానీ కొత్త కాంట్రాక్టర్ హ్యాండోవర్ చేసుకొని రెండు సంవత్సరాలు అయిన నేటికీ ఎలాంటి ఇంక్రిమెంట్లు, సెలవులు ఇవ్వలేదని తెలిపారు.

కార్మికుల సమస్యలకు పాతర :
కంపెనీలో సుమారు 500 మంది కార్మికులు పని చేస్తున్నా మని, కార్మికులకు ఏదైనా డ్యూటీ విషయంలో ఇబ్బందులు వస్తే ఇక్కడ ఉన్న యూనిట్ మేనేజర్ కి చెప్పుకుంటే వారు హైదరాబాదులో ఉన్న వాళ్లతో మాట్లాడుతా అని చెప్తున్నారే తప్ప, ఏం మాత్రం కూడా పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఫార్మా కంపెనీలో ఏదైనా ప్రమాదం సంభవించి కార్మికులకు గాయాలు అయితే ఎలాంటి వైద్యం కూడా చేయడం లేదని పేర్కొన్నారు. ఇద్దరు డాక్టర్లు,రెండు అంబులెన్స్ ఉన్న, అధికారులు వచ్చినప్పుడు చూపించడానికి తప్ప వాటి వల్ల కార్మికులకు ఎలాంటి ప్రయోజనం లేదని తెలిపారు.ఈఎస్‌ఐ ఆసుపత్రి ఎక్కడ ఉందో కూడా ఇందులో పని చేసే ఏ ఒక్క కార్మికుడికి కూడా తెలియదన్నారు. 30 రోజులు జీతం చేస్తే 26 రోజులకే జీతం కట్టిస్తున్నారని తెలిపారు. గతంలో షిఫ్ట్ కి 50 మంది పని చేస్తే, ఇప్పుడు ఆ పని 12 మంది కార్మికులతోటే పని మొత్తం చేయించి, కార్మికుల శ్రమ దోపిడికి గురి చేస్తున్నారని పేర్కొన్నారు. గతంలో పాత సువెన్ ఫార్మ యాజమాన్యం ఉన్నప్పుడు 1 తేదీలోపు జీతం పడేదని, ఇప్పుడు ఏడో తారీఖు వస్తేనే జీతం పడుతుందని దాని మూలంగా, బ్యాంకుల్లో తీసుకున్న లోన్లు, ఈఎంఐ లు వల్ల చెక్కు బోన్స్ అవుందన్నారు.

కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలి..
గత పదిహేను ఇరవై ఏళ్లుగా ఇదే కంపెనీలో ఎంతో నమ్మకంగా పనిచేస్తున్న కార్మికులను కాంట్రాక్టు నుండి, రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు ఎలాంటి ఇంక్రిమెంట్లు బోనస్ లు ఇవ్వకుండానే పనిచేయించుకోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా కార్మికులు గత 23 ఏళ్లుగా పనిచేస్తున్న కూడా 13000 జీతమే ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి ఒకరిద్దరిది కాదని ఇందులో పనిచేసే సగం మంది వరకు అందరి పరిస్థితి ఇలానే ఉందంటూ పేర్కొన్నారు. కంపెనీ యాజమాన్యం మా కార్మికుల గోడును విని, మాకున్న బాధలను కొంతైనా తీర్చాలని కోరారు. లేని పక్షంలో ధర్నాలు కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. ఉదయం 5:30 మొదలైన ధర్నా, సాయంత్రం 6 గంటల వరకు కొనసాగించారు.