అందరిలోనూ మంచిని చూడడం మనం నేర్చుకుంటే మనలోని మంచి మరింత పెరుగుతుంది..
మంచి చెడు అనార్థలకు అంకురార్పణ చేసే ఆవేశం కావాల..
అద్భుతమైన విజయాలను అందించే ఆలోచన కావాల..
అంబుజాక్షి అనురాగ ఆప్యాయతల పేరిమ కావాల..
సుందరాంగి వలపు సొగసుల ప్రేమ కావాల..
జగమంత ఆమోదించే అపారమైన జ్ఞానం కావాల..
కొండంత లచ్చి దగ్గరుంచి బిక్కుబిక్కుమనే బతుకు కావాల..
జనమంతా మెచ్చే సగుణాల గుణం కావాల.
ప్రజలంతా అసహించుకునే దరిద్ర దుర్గుణాలు కావాల..
మంచి చెడులను చెప్తున్నది ఈ అఖిలాశ..మంచి ఎంచి మహరాజుల బ్రతకడమే నాకు కావాల..
Must Read