Friday, March 14, 2025
spot_img

సూరజ్ కుమార్ అక్రమాలపై విచారించండి

Must Read
  • యాదాద్రి జిల్లా కలెక్టర్ కు సీసీఎల్ఏ ఆదేశాలు
  • గోల్డెన్ ఫారెస్ట్ సంస్థకు చెందిన 102 ఎకరాల భూమి గోల్‌మాల్‌
  • దివీస్‌కు స‌హ‌క‌రించిన ఆర్‌డీవో సూర‌జ్‌కుమార్‌
  • దివీస్ కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతులు

యాదాద్రిభువ‌న‌గిరి జిల్లాలోని చౌటుప్పల్ రెవెన్యూ డివిజనల్ అధికారిగా పనిచేసిన సూరజ్ కుమార్ పదవీకాలంలో చౌటుప్పల్ మండలం లింగోజిగూడెం గ్రామ రెవెన్యూ పరిధిలో గల దివిస్ ల్యాబ్స్ సంస్థ యజమాన్యంతో కుమ్మక్కై అధికార దుర్వినియోగానికి పాల్పడి గోల్డెన్ ఫారెస్ట్ సంస్థకు చెందిన 102 ఎకరాల భూమిని ఆక్రమించుకొని పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపట్టడానికి సూరజ్ కుమార్ సహకరించినారని సామాజికకార్య‌క‌ర్త పీఎల్ఎన్ రావు ఫిర్యాదు చేశారు. దివీస్ కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతులు పెద్ద ఎత్తున రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి లో ధర్నా చేయడంతో అప్పటి మెంబర్ సెక్రటరీ నీతూ ప్రసాద్ ఆదేశాలతో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఏర్పాటు అయినా మల్టీ డిసిప్లేనరీ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. కమిటీకి అధ్యక్షత వహించిన సూరజ్ కుమార్ కాలుష్య బాధిత గ్రామాలను సందర్శించకుండా దివిస్ కాలుష్యం పై ఫిర్యాదులు చేసిన ఫిర్యాదుదారులను సంప్రదించకుండా, ఏకపక్షంగా దివిస్ యజమాన్యంతో కుమ్మక్కే నివేదికను దివిస్ పరిశ్రమకు అనుకూలంగా ఇచ్చినారు. లింగోజిగూడెం గ్రామ పరిధిలోని భూములకు సంబంధించి గతంలో కలెక్టర్ నిషేధం విధించిన భూములకు సంబంధించి చౌటుప్పల్ రెవిన్యూ డివిజనల్ అధికారి సూరజ్ కుమార్ వెంచర్ యజమానుల నుండి భారీ మొత్తంలో ముడుపులు తీసుకొని తప్పుడు నివేదిక అందించి జిల్లా కలెక్టర్ ప్రమేల సత్పతిని తప్పుదోవ పట్టించి అనుకూలంగా 11 ఎకరాలకు క్లియరెన్స్ పొందిన అనుమతులపై విచారించాలని కోరారు.

చౌటుప్పల్ మండలంలోని బలహీన వర్గాలకు చెందిన గీత కార్మికులు దివిస్ కాలుష్యంతో సుమారు 1200 కుటుంబాలు ఉపాధి కోల్పోయామని జాతీయ బీసీ కమిషన్ న్యూఢిల్లీ వారికి ఫిర్యాదు చేయడంతో క్షేత్రస్థాయిలో పర్యటించి సమాచారం సేకరించిన జాతీయ బీసీ కమిషన్ అధికారులకు ఇందుకు సంబంధించి రిపోర్టులు అందజేయాలని ఆదేశాలు జారీ చేయగా, చౌటుప్పల్ రెవెన్యూ డివిజనల్ అధికారి అయిన సూరజ్ కుమార్ జాతీయ బీసీ కమిషన్‌కు అందజేసిన నివేదిక దివిస్ సంస్థకు అనుకూలంగా రూపొందించి ప్రత్యక్షంగా ప్రజాప్రయోజనాలు దెబ్బతీశారని వాపోయారు.

చౌటుప్పల్ రెవెన్యూ డివిజనల్ అధికారి సూరజ్ కుమార్ ఉద్దేశపూర్వకంగానే దివిస్ సంస్థ చైర్మన్ గోల్డెన్ ఫారెస్ట్ సంస్థకు చెందిన 102 ఎకరాల భూమిని ఆక్రమించుకొని భారీ నిర్మాణాలు చేప‌ట్టార‌ని, ప్రజల నుండి ప్రజా ప్రతినిధుల నుండి వచ్చిన ఫిర్యాదులపై ఫిర్యాదుదారుల సమక్షంలో సర్వే చేయవలసి ఉండగా రెవెన్యూ డివిజనల్ అధికారి సూరజ్ కుమార్ ఏకపక్షంగా మండల సర్వేయర్ గా ఉన్న వెంకన్న పై తీవ్ర ఒత్తిడి తెచ్చి దివిస్ కు అనుకూలంగా రిపోర్టు రూపొందించినారని సర్వేలో గోల్డెన్ ఫారెస్ట్ భూమిని మార్కింగ్ చేయకుండా దివిస్ సంస్థకు మాత్రం క్లీన్ చిట్ రిపోర్ట్ ఇచ్చార‌ని తెలిపారు.

చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ కు అందిన ఫిర్యాదులపై సూరజ్ కుమార్ అక్రమాలపై గోల్డెన్ ఫారెస్ట్ సంస్థకు చెందిన భూమిని మార్కింగ్ తో పాటు దివిస్ కాలుష్యంపై ఏకపక్షంగా నివేదిక ఇచ్చిన మల్టీ డిసిప్లేనరీ కమిటీకి సంబంధించి తిరిగి ఫిర్యాదుదారుల సమక్షంలో విచారించి నివేదిక ఇవ్వాలని ఫిర్యాదులో పేర్కొన్న అంశాలపై పూర్తిస్థాయిలో విచారించి నివేదిక అందించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కు సీసీఎల్ఏ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.

Latest News

15 నుంచి ఒంటిపూట బడులు

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9గంటల నుంచే భానుడి తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీంతో ఇళ్ల నుంచి బయటకు రావటానికి జనం జంకుతున్నారు. రాబోయే రోజుల్లో...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS