- వీరికి ఫోక్సో చట్టం వర్తించదా.?
- కీచక ఉపాధ్యాయులపై క్రమశిక్షణ చర్యలేవి.?
- తప్పుచేయకపోతే ట్రాన్స్‌ఫర్ చేయడం ఎందుకు.?
- జిల్లాలో విద్యా వ్యవస్థను గాడిన పెట్టే వారెవరు.?
- జిల్లాలో విద్యాశాఖ అధికారి ఉన్నాడా.?
గత కొంతకాలంగా జిల్లాలో విద్యా వ్యవస్థలో జరుగుతున్న పరిణామాలతో జిల్లా ప్రజలకు ఏం అర్థం కాని పరిస్థితి ఏర్పడిరది. జిల్లా కార్యాలయంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యా యుల తీరు, వారి వ్యవహార శైలి విద్యాశాఖను భ్రష్టు పట్టిస్తు న్నారు. ఇప్పటివరకు జిల్లా విద్యా శాఖలో జరిగిన పరిణామాలు, పాఠశాలలో జరిగిన పరిణామాలు పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
విద్యాశాఖలో అక్రమ డిప్యూటేషన్‌లు..
జిల్లా విద్యాశాఖలో ఎలాంటి ఆర్డర్ కాపీ లేకుండానే అక్రమంగా విధులు నిర్వహిస్తున్నారు కొందరు ఉద్యోగులు. జిల్లా ఏర్పడిన నాటి నుండి జిల్లా విద్యాశాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా వచ్చిన ఓ మహిళ ఉద్యోగి, నేటికీ అక్కడే విధులు నిర్వహిస్తున్నారు. ఆ ఉద్యోగికి ఈ జిల్లాకు వచ్చిన అనతి కాలంలోనే సీనియర్ అసిస్టెంట్‌గా పదోన్నతి వచ్చి ఇక్కడ నుండి బదిలీ కాకుండా జిల్లా విద్యాధికారి అండదండలతో ఇక్కడే విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల ఉద్యోగులు అందరూ సాధారణ బదిలీలు (రెండు సం.లు పూర్తి అయిన) జరిగాయి. అందులో భాగంగా ఈ మహిళా ఉద్యోగులు కూడా బదిలీపై నల్గొండ జిల్లాకు బదిలీ కాగా, వారం వ్యవధిలోనే తిరిగి (అక్రమంగా) డిప్యూటేషన్‌పై సూర్యాపేట జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో యధావిధిగా విధులు నిర్వహిస్తుండటం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. నల్గొండ జిల్లా డిఈఓ ఆఫీస్‌లో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న శ్యామల ఈ మధ్యకాలంలో జరిగిన సాధారణ బదిలీల్లో భాగంగా సూర్యాపేట జిల్లాకు బదిలీ అయ్యారు. తిరిగి శ్యామల నల్గొండ జిల్లా లోనే విధులు నిర్వహిస్తున్నారు. ఎలాంటి ఆర్డర్ కాపీలు లేకుండా పి. సైదరాజు అనంతగిరి ఎమ్మార్సీలో, ఎం. మదనాచారి కోదాడ ఎమ్మార్సీ లో పనిచేస్తున్నారు. గత ఏడు ఏళ్లుగా జిల్లా విద్యాశాఖలో (అవుట్సోర్సింగ్) కంప్యూటర్ ఆపరేటర్ పని చేస్తున్న ఉద్యోగిపై వార్త కథనాలు వస్తే నేటికీ అతనిపై ఎలాంటి విచారణ చేపట్టలేదు. కార్యాలయానికి సంబంధంలేని ఓ ప్రైవేటు వ్యక్తి, జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలలకు సంబంధించిన ఫైల్స్, తీసుకొస్తే,(ముడుపులు చెల్లిస్తే) ప్రైవేట్ పాఠశాలలకు అనుమతులు ఇస్తున్న అధికారులపై చర్యలు ఉండదు.
కీచక ఉపాధ్యాయులపై చర్యలు లేవి.?
మోతె మండల పరిధిలోని మామిళ్లగూడెం జిల్లా పరిషత్ హైస్కూల్లో గణిత ఉపాధ్యాయుడు చెన్ను శ్రీనివాసరెడ్డి అదే స్కూల్లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థినితో అసభ్యకరంగా, తప్పుడు ఉద్దేశంతో వ్యవహరిస్తున్నాడు అని ఉమెన్ డెవలప్మెంట్ చైల్డ్ వెల్ఫేర్ మహిళా శిశు సంక్షేమ వారు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి, విచారణ రిపోర్ట్ ఆధారంగా ఉపాధ్యాయుడిని నవంబర్ 12న సస్పెండ్ చేశారు. 18 జనవరి 20 25న చివ్వెంల మండలం కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ కి సిహెచ్ శ్రీనివాస్ రెడ్డిని రీవోక్ చేస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఉపాధ్యాయుడు తప్పు చేసినందుకు జిల్లా విద్యాశాఖ అధికారి నాన్ హెచ్‌ఆర్‌ఏ నుండి హెచ్‌ఆర్‌ఏ అయినా చివ్వెంలా మండల కేంద్రాలని జిల్లా పరిషత్ హై స్కూల్ లో పోస్టింగ్ ఇచ్చారు. ఈ విధంగా ఎలా పోస్టింగ్ ఇస్తారంటూ జిల్లా విద్యాశాఖ అధికారి తీరిపై టీచర్ యూనియన్ నాయకులు తప్పుపడుతున్నారు.
సెలవులు వెళ్లిన ఉపాధ్యాయుడు..
తుంగతుర్తి నియోజకవర్గంలోని తుంగతుర్తి మండలం కొత్తగూడెం జిల్లా పరిషత్ హైస్కూల్లో గణిత ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న మరొక ఉపాధ్యాయుడు శ్రీనివాస్ ఫిబ్రవరి 21 తేదీన అదే పాఠశాలలో చదువుతున్న పదవ తరగతి విద్యార్థిని పై గత కొన్ని రోజులుగా అసభ్యకరంగా ప్రవర్తించగా విద్యార్థిని తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు ఆ ఉపాధ్యాయుడికి దేని శుద్ధి చేసిన విషయం తెలిసింది. కానీ ఫిబ్రవరి 21వ తేదీ నుండి నేటి వరకు ఉపాధ్యాయుడు సెలవులు పెట్టి వెళ్లడం, ఈ విషయం జిల్లా విద్యాశాఖ అధికారికి తెలిసిన ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.