కుటుంబ వ్యవస్థ మానవాళి సామాజిక ప్రగతికి మూలం. మన సంస్కృతి సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు నేటితరం విద్యార్థులకు వాటి ప్రాధాన్యత అవగాహన అవగత మవ్వాలని శ్రీ చైతన్య టెక్నో స్కూల్(Sri Chaitanya Techno School) గడ్డి అన్నారం బ్రాంచ్ ప్రిన్సిపల్ సువర్ణరేఖ తన ప్రసంగంలో తెలియజేశారు. స్మార్ట్ లివింగ్ ప్రోగ్రాంలో భాగంగా ఫ్యామిలీ బ్లూమ్ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏజీఎం సతీష్ మాట్లాడుతూ కుటుంబం అంటే ఒక నమ్మకం, ధైర్యం, ప్రేమ, బాధ్యత గౌరవంతో కూడిన కలయిక అలాంటి కుటుంబం వ్యవస్థ మన సంస్కృతి వాటి గౌరవం విలువలను కాపాడుకోవాలి అని అన్నారు. తల్లిదండ్రులపై ప్రేమ, భక్తి, గౌరవం కలిగి ఉండాలి. చదువుతోపాటు సామాజిక బాధ్యతలను, వాటి విలువలను ప్రతి విద్యార్థిని మంచి పౌరులుగా తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యం. అని ప్రిన్సిపల్ సువర్ణరేఖ తెలియజేశారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించినందుకు తల్లిదండ్రులు తమ హర్షాన్ని వ్యక్తపరిచారు ఈ కార్యక్రమంలో ఎ జియం సతీష్, ఆర్ ఐ రవీందర్ రెడ్డి, కోఆర్డినేటర్ జితేందర్, డీన్ రామశర్మ, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.