కన్నడ డైనమిక్ ప్రిన్స్ ప్రజ్వల్ దేవరాజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం రాక్షస. ఈ చిత్రం మార్చి 7న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఒరిజినల్ వెర్షన్ కన్నడతో పాటు తెలుగులోనూ అదేరోజు విడుదలవుతోంది. కంచి కామాక్షి కోల్ కతా కాళీ క్రియేషన్స్ బ్యానర్ పై రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. వేణు ఉన్ని సంగీతం అందించగా, “కాంతారా”, “విరూపాక్ష” లాంటి థ్రిల్లర్స్ కు సూపర్ హిట్ సంగీతం అందించిన అజనీష్ లోక్ నాథ్ ఈ చిత్రానికి సౌండ్ ట్రాక్స్ , బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదల చేసిన ప్రమోషనల్ కంటెంట్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. తాజాగా ఈ మూవీ టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. సినిమా కాన్సెప్ట్ ను తెలియజేసేలా సాగిన ఈ పాట అందర్నీ ఆకట్టుకుంటుంది. వేణు ఉన్ని కంపోజ్ చేసిన పాటకు, అజనీష్ లోక్ నాథ్ అందించిన సౌండ్ ట్రాక్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ హైలైట్ గా నిలుస్తున్నాయి. “మాయలో మాయకి చిక్కినాక.. దారిలో కానరాక చొచ్చుకెళ్లాక.. రూపమే అదృశ్యం అయ్యాక.. నా నీడే వెచ్చగా తగిలాక.. వెళ్లే దారిలో..తిరిగే సుడిగుండంలా మొత్తం అంతా మాయే.. కలయో నిజమో అసలేమీ తెలియదే.. భయంతో గట్టిగా పిలిచే నువ్వెవరే..రా రా రాక్షస” అంటూ సాగిన పాటకు ప్రేమ్ బి ఎస్ అర్థవంతమైన లిరిక్స్ ను అందించగా, సాయి చరణ్ వాయిస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.