Friday, March 14, 2025
spot_img

కబ్జాకోర్‌ వరిటెక్స్‌ విరాట్‌ నిర్మాణ సంస్థ అధినేత వర్మ..

Must Read
  • మియాపూర్‌లో రామసముద్రం కుంటను కబ్జా చేసి అడ్డంగా దొరికిపోయిన అధినేత వర్మ..
  • వర్మ అవినీతిలో భాగస్వాములై, కబ్జా వైపు కన్నెత్తి చూడని ఇరిగేషన్‌ శాఖాధికారులు..
  • కబ్జా చేసిన స్థలం ఖాళీ చేస్తున్న వరిటెక్స్‌ విరాట్‌ నిర్మాణ సంస్థ..!
  • రేరా, హెచ్‌ఎండిఏ అనుమతి రద్దు చేయకపోవడంలో మతలబేంటి..
  • స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో నేటికీ ఫిర్యాదు చేయని ఇరిగేషన్‌ అధికారిణి ఏ.ఈ. పావని
  • రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ గారూ మీ ఇలాకలో ఇరిగేషన్‌ అధికారుల వ్యవహార తీరు మీకు కనిపించడం లేదా..?
  • కబ్జా చేస్తుంటే ప్రేక్షక పాత్ర వహించిన ఇరిగేషన్‌ అధికారులను విధుల నుండి తొలగించే బాధ్యత కలెక్టర్‌ కు లేదా..?
  • హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ గారు ఈ కుంట హైడ్రా పరిధిలోకి రాదా సారూ..?
  • మరి ఎఫ్‌.టి.ఎల్‌.లో నిర్మిస్తున్న టవర్లను కూల్చేదెప్పుడని వస్తున్న విమర్శలు..

ధనం మూలం ఇదం జగత్‌.. ఈ మాటను పెద్దలు ఊరకే చెప్పలేదు.. డబ్బు ఉంటే సుబ్బిగాడిని సుబ్బరాజుగారు అంటారు అని మరో సినీ కవి చెప్పిన మాటలు కూడా వాస్తవం.. పచ్చనోటును విసిరేస్తూ.. చట్టాలను, నియమ నిబంధనలను పక్కనబెట్టి.. వ్యవస్థలను తమకు అనుకూలంగా మార్చేసుకుంటూ.. విధినిర్వహణలో సక్రమంగా ఉండాల్సిన అధికారులను అడ్డంగా కొనేస్తూ.. సమాజానికే సవాల్‌ విసురుతున్నారు కొందరు కేటుగాళ్లు.. భవిష్యత్‌ తరాలకు ప్రాణంగా ఉండాల్సిన నీటి వనరులు..ఉండాల్సిన చెరువులను,కుంటలను సైతం కబ్జాలు చేసేస్తూ.. ఆకాశ హర్మ్యాలను అక్రమంగా నిర్మిస్తూ.. వాటిని అమాయకులకు అంటగడుతూ కోటాను కోట్లు కొల్లగొడుతూ.. ఇటు ప్రజలను, సమాజాన్ని, ప్రభుత్వాన్ని కూడా మోసం చేస్తూ.. శఠగోపం పెడుతున్న దుర్మార్గులు అడుగుకు ఒక్కరు పుట్టుకొస్తున్నారు.. ఈ కోవలోకే చెందుతారు వరిటెక్స్‌ విరాట్‌ నిర్మాణ సంస్థ అధినేత వర్మ.. ఈయన చేస్తున్న దారుణాలు చూసి భూమాత కంటతడి పెడుతోంది.. ప్రాణాధారమైన జలం అడుగంటిపోతూ విల విలలాడిపోతోంది.. ఇతగాడు చేస్తున్న భూ ఆక్రమణల గురించి ఆదాబ్‌ నిరంతరం పోరాడుతున్నా చీమకుట్టినట్లైనా లేకుండా ఉండటం చూస్తుంటే.. వరిటెక్స్‌ నిర్మాణ సంస్థ అధినేత వర్మకు కొన్ని పెద్ద తలకాయలు సపోర్ట్‌ మెండుగా ఉన్నట్లు తెలిసిపోతోంది.. పార్టీలతో, ప్రభుత్వాలతో సంబంధం లేకుండా వర్మ మియాపూర్‌ లోని రామసముద్రం కుంటలోకి మల మూత్రాలు వదిలి దానిని సెఫ్టిక్‌ ట్యాంక్‌గా మార్చి, నిర్మాణ సంస్థ కావలసినంత ఎఫ్‌టిఎల్‌ను పూడ్చి దర్జాగా కబ్జా చేస్తూ అందులో టవర్లను నిర్మించి తన హవాను కొనసాగిస్తున్నాడు..

రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి మండలంలోని మియాపూర్‌ గ్రామ శివారు చందానగర్‌ మున్సిపాలిటీ పరిధిలో రామసముద్రం కుంట 10 ఏకరాల పై చిలుకు నెలకొని ఉంది..ఈ కుంట పై కన్నేశాడు వరిటెక్స్‌ విరాట్‌ నిర్మాణ సంస్థ అధినేత వర్మ..ఈ సంస్థ పేరుతో చేసిందే కబ్జా..చెప్పిందే వేదం.. సృష్టించిందే బోగస్‌ పత్రం..తనకు ఎవ్వరూ అడ్డు రావద్దు అని ఎక్కడికిక్కడ మేనేజ్‌ చేసుకొని అధికారులను తన గుప్పెట్లో పెట్టుకొన్నాడు కాబ్జాకోరు వర్మ.. అంతే మియాపూర్‌ లో పాగా వేసి రామ సముద్రం కుంట కు మంగళం పాడి మట్టితో పూడ్చి దర్జాగా కబ్జా చేస్తూ ప్రభుత్వానికి సవాలు విసురుతున్నాడు ఈ కబ్జా కోరు.. వరిటెక్స్‌ విరాట్‌ నిర్మాణ సంస్థ అధినేత వర్మ విసిరేసిన మెతుకులు ఏరుకొని తింటున్న సంబంధిత కొందరు ఇరిగేషన్‌ శాఖ అది óకారులు..తమ విధులను యాది మరిచి వర్మ దర్జాగా కబ్జా చేస్తూ ఉంటే ఆ వైపు కన్నెత్తి చూడకపోవడం వీరి అవినీతికి అద్దం పడు తుంది.. అవినీతి మత్తులో జోగుతూ నిద్రపోతున్న అధికారులకు ఆదాబ్‌ హైదరాబాద్‌ కొరకరాని కొయ్యగా మారి.. కబ్జా చేస్తున్న వరిటెక్స్‌ వర్మ సామాన్యులకేంది ఈ కర్మ.. కబ్జాలకు కేరాఫ్‌ అడ్రస్‌ వరిటేక్స్‌ విరాట్‌ నిర్మాణ సంస్థ అనే శీర్షికల ద్వారా ప్రచురించి వర్మ కబ్జా బాగోతాన్ని బట్టబయలు చేసింది..

దీంతో ఉలిక్కిపడ్డ అధికారులు అప్రమత్తమయ్యారు.. చెరువులను, కుంటలను ప్రభుత్వ భూములను కబ్జాలు చేస్తే ల్యాండ్‌ ట్రేస్పాస్‌ కేసులు పెట్టి జైలుకు తోలుతారు పారదర్శకంగా పని చేసే అధికారులు.. మియాపూర్‌ కేంద్రంగా వరిటెక్స్‌ వర్మ కబ్జాలు చేస్తూ ఉంటే కనీసం పోలీస్‌ స్టేషన్లో ఇతగాడిపై ఫిర్యాదు చేయకపోవడం పై మండిపడుతున్నారు స్థానిక ప్రజలు.. ఇరిగేషన్‌ అధికారులు అదే రామసముద్రం కుంట అనుకొని ఇవతల వైపున ఎఫ్టిఎల్‌లో ఒక 40 గజాల్లో నిర్మాణం చేపడితే కూకటి వేళ్లతో పెకిలించి ఆ యొక్క నిర్మాణాన్ని కూల్చివేశారు.. లాగా ఇది ఇలా ఉంటే అదే అధికారులు వరిటెక్స్‌ విరాట్‌ నిర్మాణ సంస్థ ఇంత దర్జాగా కబ్జా చేస్తూ ఉంటే ప్రేక్షక పాత్ర వహిస్తుండటంతో అధికారుల వ్యవహార తీరుపై మండిపడు తున్నారు స్థానిక ప్రజలు.. రెవిన్యూ,మున్సిపల్‌ అధికారులు కబ్జా వ్యవహారంపై నిన్న ప్రాథమికంగా వెళ్ళితే.. కబ్జా చేసిన ప్రాంతంను ఖాళీ చేస్తూ అందులో ఉన్న షెడ్లను తొలగించే పనిలో పడ్డారు వరిటెక్స్‌ విరాట్‌ నిర్మాణ సంస్థ వారు.. కబ్జా చేసిన స్థలం ఖాళీ చేస్తున్న వరిటిక్స్‌ విరాట్‌ నిర్మాణ సంస్థ ఎఫ్టిఎల్‌ లో కట్టిన టవర్లను ఎప్పుడు కూల్చి వేస్తారని ప్రశ్నిస్తున్నారు పలువురు సామాజిక వేత్తలు.. ఇన్నాళ్లు చెరువును చరబట్టి ఎఫ్టిఎల్లో అక్రమ నిర్మాణాలు చేపడుతున్న రేరా,హెచ్‌ఎండిఏ అనుమతులు రద్దు చేయకపోవడంలో మతలబెంటీ అనే ప్రశ్నలు సైతం వినిపిస్తు న్నాయి.. ఇంత భారీ భూ కుంభకోణం చేస్తూ దర్జాగా కుంట కబ్జా చేస్తున్న వరిటెక్స్‌ విరాట్‌ నిర్మాణ సంస్థ యజమాని వర్మపై నేటికీ స్థానిక పోలీస్‌ స్టేషన్లో ల్యాండ్‌ ట్రెస్పాస్‌ కేసు పెట్టకుండా.. ప్రేక్షక పాత్ర వహించిన ఇరిగేషన్‌ అధికారులను విధుల నుండి తొలగించే బాధ్యత రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ కు లేదా అనే ప్రశ్నల సైతం వినిపిస్తున్నాయి.. కబ్జాలను కట్టడి చేసి అన్యాక్రాంత మవుతున్న రామసముద్రం కుంటను పరిరక్షించాలని స్థానిక ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.. అదే కాకుండా హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ గారు ఈ కుంట హైడ్రా పరిధిలోకి రాధా సారు… ఎఫ్టిఎల్‌లో నిర్మించిన టవర్లను కూలుస్తారా సారు.. హైడ్రా రామ సముద్రం కుంట కు పునర్దర్శ ఎప్పుడు తెస్తుంది అంటూ ప్రశ్నిస్తున్నారు పలువురు సామాజికవేత్తలు.. అభివృద్ధి పేరుతో కబ్జా చేసి చెరువును చరబట్టిన వర్మ.. చేస్తున్న అరాచకాలు.. సృష్టించిన బోగస్‌ పత్రాలు.. శేర్లింగంపల్లి మండల కేంద్రంగా ఓ అధికారిని తన గుప్పిట్లో పెట్టుకుని చేసిన దందా.. పూర్తి ఆధారాలతో మరో కథనం ద్వారా వెలుగులోకి తేనుంది ఆదాబ్‌ హైదరాబాద్‌ మా అక్షరం అవినీతిపై అస్త్రం.

Latest News

15 నుంచి ఒంటిపూట బడులు

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9గంటల నుంచే భానుడి తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీంతో ఇళ్ల నుంచి బయటకు రావటానికి జనం జంకుతున్నారు. రాబోయే రోజుల్లో...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS