- బెంగుళూర్ రేవ్ పార్టీలో అడ్డంగా బుక్కైన హేమ
- రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకునట్టు నిర్ధారించిన పోలీసులు
- హేమను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుండి తొలగించాలని డిమాండ్
- అసోసియేషన్ లో ఉంచాలా లేదా తొలగించాలనే దానిపై అఫీషియల్ వాట్సాప్ గ్రూప్ లో పోల్ పెట్టిన అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు
- రేపు హేమను తొలగించే అవకాశం
తెలుగు నటి హేమాను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.గత నెల బెంగళూర్ లో జరిగిన ఓ రేవ్ పార్టీలో హేమ డ్రగ్స్ తీసుకున్నట్టు పోలీసులు నిర్ధారించారు.ఆ తర్వాత హేమ ఓ వీడియో ను పోస్ట్ చేసి తాను ఎక్కడికి వెళ్ళలేదు హైదరాబాద్ లోనే ఉన్నానంటూ ఆ వీడియోలో తెలిపింది.హేమ రిలీజ్ చేసిన ఆ వీడియో పెను వివాదానికి కారణమైంది.సోషల్ మీడియా వేదికగా హేమాపై నెటిజన్లు మండిపడ్డారు.హేమను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుండి తొలగించాలనే డిమాండ్స్ వస్తున్నా తరుణంలో మూవీ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు ఆమెను అసోసియేషన్ లో ఉంచాలా లేదా తొలగించాలనే దానిపై అఫీషియల్ వాట్సాప్ గ్రూప్ లో ఒక పోల్ పెట్టినట్లు తెలుస్తోంది.గ్రూప్ లో ఎక్కువ మంది ఆమెను సస్పెండ్ చేయాల్సిందిగా ఓటు వేసినట్లుగా తెలుస్తుంది. రేపు అధికారికంగా హేమాను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించే అవకాశం ఉంది.