Sunday, November 24, 2024
spot_img

ఆంధ్ర ప్రదేశ్ లో చరిత్ర తిరగ రాసిన కూటమి

Must Read

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు జగన్ కి చుక్కలు చూపించాయి.జగన్ పాలన మీధ విసుగు చెందిన ఓటర్లు నిశ్శబ్ద విప్లవం లా ఓటు వేసి కనీసం ప్రతీ పక్ష హోదా కూడా ఇవ్వక పోవడం ,జగన్ పాలన మీధ పూర్తి వ్యతి రేకత, బై బై జగన్ అంటూ దిమ్మ తిరిగే తీర్పు ఇచ్చారు.మంత్రులను కూడా చిత్తు చిత్తుగా ఓడించారు.కసి తో ఓటర్లు సంచలన తీర్పు ఇచ్చారు.2019 ఎన్నికలలో టి.డి.పి 23 స్థానాలు,జనసేనా ఒకటి,వై.సి.పి 151 స్థానాలు సాధించాయి.ప్రస్తుతం ఈ కూటమి లో భాగంగా టి.డి.పి 135, జనసేన 21,భాజాపా ఎనిమిది వై.సి పి 11 స్థానాలలో గెలు పొందాయి.ఎనిమిది జిల్లా లలో కనీసం జగన్ పార్టీ ఖాతా కూడా తెరువ లేదు.రాయల సీమ లో ఏడు సీట్లకే పరిమితం అయింది.జగన్ పాలన పట్ల తీవ్ర వ్యతిరేఖత రావడం,అక్రమ కేసులు పెట్టీ చంద్ర బాబు నాయుడు ను జైల్ కి పంపడం,గుండా గిరి,బెదిరింపులులతో విసుకు చెందిన ఆంధ్రప్రదేశ్ ఓటర్లు వైఎస్సార్సీపీ పార్టీకి జలక్ ఇచ్చారు తమ రాష్ట్ర అభివృద్ధికి తెలుగుదేశం జనసేన భాజపా పొత్తులో ఉండే మహాకూటమి సరైనదని ఆలోచించి నిర్ణయం తీసుకొని తమ అమూల్యమైన ఓటును వేసి అఖండమైన మెజార్టీని అందించి కొత్త చరిత్రకు నాంది పలికారు. జగన్ను అదా పాతాళానికి తొక్కేస్తా తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు నా పార్టీ జనసేన కాదు అని చెప్పి మరి ఫ్యానుకు పాతేరేశారు పవన్ కళ్యాణ్ వైసీపీని పూర్తిస్థాయిలో విడిచేశారు జగన్కు పగలే పవన్ చుక్కలు చూపించారు పోటీ చేసిన అన్ని అసెంబ్లీ లోక్సభ స్థానాలలో దక్కించుకొని వకీల్ సాబ్ అద్భుతమైన సయోధ్య చేశారు. జనసేనన ను యుద్ధసేనగా మార్చిన సేనాని ప్రతి అడుగు ఆచి తూచి వేశారు.ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి నాలుగు పెళ్లిళ్లు దత్తపుత్రుడు ప్యాకేజీ స్టార్ అంటూ వ్యక్తిగత సహనానికి పరీక్ష పెట్టీ ఎన్నో రకాలుగా దుర్భసలాడారు. మన వైపు సింహం సింగిల్ గా వస్తుంది అంటూ పొత్తు కుదరకుండా చివరకు వైసీపీ పెద్దలు ప్రయత్నించారు. జనసైనికుల్లో కొంత ప్రచారం పోయింది. దీంతో పవన్ తగ్గుతారని వైసీపీ పెద్దలు అంచనా వేశారు. ఆయన తగ్గేదేలె అన్నట్టు ప్రచారం చేసారు. అటు జగన్తో అటు కాపు పెద్దలుగా చలామణి అవుతున్న మరి కొoదరితో తలబడుతూనే సొంత ఇంటిని చక్కగా నిర్మించారు. ఎవరు ఎన్ని దాడులు చేసినా దాడులకు బెదిరిది లేదనుకుంటూ సవాలు విసిరారు. నా ప్రాణం పోయినా సరే నేను జగన్ను ఓడిస్తా అంటూ శపథం చేశారు. పవన్ కళ్యాణ్ బిజెపి జనసేన టిడిపి పొత్తులో పవర్ ఆఫ్ పవనిజం కింగ్ మేకర్ గా మారారు .ఇటు చంద్రబాబు అటు బిజెపి పెద్దలు తోలుత పొత్తులకు సిద్ధం కాకుండా జనసేనని మాత్రం పొత్తులలో అన్ని తానేగా వ్యవహరించారు. బిజెపి పెద్దలను ఒప్పించడానికి నానా ఇబ్బందులు పడ్డారు. పొత్తుల కోసం బిజెపి పెద్దలతో ఎన్నో చివాట్లు తిన్నా చివరికి కమలం పెద్దలను పొత్తులకు ఒప్పించడంలో సఫలీకృతం అయ్యారు. చంద్రబాబుతో కూడా ఎప్పటికప్పుడు చర్చిస్తూ కూడ పొత్తులకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో తన పార్టీ పోటీ చేసే స్థానములు తగ్గించుకోవలసి వచ్చిన ఆయన సంతోషంగా సమ్మతించారు. దీని కోసం టిడిపి తనకు ఇచ్చిన 24 సీట్లు బిజెపి కోసమని త్యాగం చేశారు.
పోటీ చేసిన 2 లోక్ సభ, 21 ఎసెంబ్లీ సీట్ల‌లో ఘ‌న విజ‌యం
వంద శాతం విజ‌యంతో పార్టీలో స‌రికొత్త జోష్ నింపారు.
ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్‌ కల్యాన్ నేతృత్వంలోని జనసేన పార్టీ సరికొత్త రికార్డు నమోదు చేసింది. పోటీ చేసిన అన్నిచోట్లా ఆ పార్టీ విజయం సాధించింది. పదేళ్ల రాజకీయ ప్రయాణంలో సరికొత్త విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. గతేడాది కేవలం ఒక్కటంటే ఒక్క స్థానం గెలుపొందిన ఆ పార్టీ.. ఈసారి ఏకంగా పోటీ చేసిన 2 లోక్ సభ, 21 ఎసెంబ్లీ సీట్ల‌లో స్థానాల్లోనూ విజయం సాధించింది. తోక పార్టీ అంటూ విమర్శలు చేసిన వారికి ఈ విజయంతో గట్టి బదులిచ్చింది.
ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదంటూ మొదటినుంచీ చెప్తూ వచ్చిన జనసేనాని పవన్‌ కల్యాణ్‌ కీలక సమయంలో టిడిపి తో పొత్తు ప్రకటించారు. సీట్ల సర్దుబాటు సమయంలో ఆయన 24 స్థానాల్లో పోటీ చేస్తామని తొలుత ప్రకటించారు. తర్వాత మూడు స్థానాలు మిత్రపక్షాలకు విడిచిపెట్టారు. దీంతో కొందరు ‘సీనియర్‌’ నేతలు పవన్‌కు ‘ఉచిత’ సలహాలు ఇచ్చారు. ఆయనకు లేఖాస్త్రాలు సంధించారు. కానీ, వారి ‘పల్లకి మోత’లకు ఎక్కడా పవన్‌ కల్యాణ్‌ తలొగ్గలేదు. వారికి సమాధానం కూడా ఇచ్చిందే లేదు. తన పనిని చేసుకుంటూ పోయారు. 21 స్థానాలకు పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. అందరినీ ఒంటిచేత్తో గెలిపించుకోగలిగారు.గెలిచే సామర్థ్యం ఉన్న అభ్యర్థులనే బరిలో నిలుపుతున్నాం. ఎక్కువ సీట్లు తీసుకుని ప్రయోగాలు చేసే బదులు, తక్కువ స్థానాలు తీసుకుని రాష్ట్ర భవిష్యత్‌ కోసం ముందుకెళ్లాలని నిర్ణయించాం.అని అన్నారు .98 శాతం గెలుపు గుర్రాలు ఉండేలా అభ్యర్థులను ఎంపిక చేశారు. 60, 70 స్థానాలు కావాలని కొందరు అంటున్నారు. గత ఎన్నికల్లో కనీసం 10 స్థానాలు గెలిచి ఉంటే ఎక్కువ స్థానాలు అడిగేందుకు అవకాశం ఉండేది” అని ఎన్నికల ముందు పవన్‌ కల్యాణ్‌ చెప్పారు. ఎలాంటి పొరపొచ్చాలు వచ్చినా అవన్నీ దాటుకుని తెదేపా- జనసేన,భాజాపా గెలుపునకు కృషి చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆయన చెప్పినట్లే ఆ పార్టీ అభ్యర్థులు 21 స్థానాల్లో విజయం సాధించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోయే నారా చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో జనసేన పార్టీ కీలక పాత్ర పోషిస్తుందని అనుకుందాం. జనసేనాని పవన్ కళ్యాణ్ కి ఉపముఖ్యమంత్రి లేదా హోం మంత్రి పదవి కట్టబెడతారనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఏది ఏమైనా ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు జగన్ పార్టీ ను పాతరపెట్టి కూటమికి విజయం అందించి తమ సత్తా చాటారని అనుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి రోజులు రావాలని అందరూ ఆకాంక్షిద్దాం.ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సఖ్యతగా ఉంటూ అరమరికలు లేకుండా అభివృద్ధిలో పోటీపడి తెలుగు రాష్ట్రాలు మరింతగా అభివృద్ధి చెందాలని ప్రతి తెలుగు బిడ్డ కోరుకుంటున్నారు..

  • కామిడి స‌తీష్ రెడ్డి
    తెలంగాణ సామాజిక రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
    ఫోన్ – 9848445134.
Latest News

బీరుట్ పై ఇజ్రాయిల్ దాడి, 11 మంది మృతి

లెబనాన్ రాజధాని బీరుట్ పై ఇజ్రాయిల్ వైమానిక దళాలు మిస్సైళ్ల‌తో దాడి చేశాయి. ఈ దాడిలో 11 మంది మృతిచెందగా, 20 మంది గాయపడ్డారు. 08...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS