Saturday, September 6, 2025
spot_img

అడవులో వణ్య ప్రాణాలు ఘోష వినపడటం లేదా..?

Must Read
  • హెచ్‌సీయూ ఘటన ఫలితం రేవంత్‌ అనుభవిస్తాడు
  • రేవంత్‌ను జైలులో పెడితే కానీ.. రాష్ట్రం ప్రశాంతంగా ఉండదు
  • రేవంత్ రెడ్డిపై మండిప‌డ్డ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

ఎంతమంది మేధావులు, విద్యావంతులు హెచ్చరిస్తున్నా హెచ్‌సీయూ భూములను లాక్కుకుంటున్నారని.. ఇది ఫలితం రేవంత్‌రెడ్డి తప్పక అనుభవిస్తాడని బీఆర్‌ఎస్‌ నేత ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. హెచ్‌సీయూ బయో డైవర్సిటీ పార్క్‌ విధ్వంసం, భూముల కుంభకోణంలో కాంగ్రెస్‌ గుంట నక్కల ముఠాపై వెంటనే సుమోటోగా కింది కేసులు పెట్టాలని డిమాండ్‌ చేశారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972లోని సెక్షన్‌ 29, అటవీ సంరక్షణ చట్టం 1980లోని సెక్షన్‌ 2, తెలంగాణ వాల్టా చట్టం 2002లోని సెక్షన్‌ 35 కింద కేసులు నమోదు చేయాలన్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి, అతనికి సహకరిస్తున్న మంత్రులందరిని వెంటనే అరెస్టు చేసి జైలుకు పంపాలి. అప్పుడే తెలంగాణ సురక్షితంగా ఉంటుంది అని ఆర్‌ఎస్ ప్ర‌వీణ్‌కుమార్ పేర్కొన్నారు. ఊర్లలో ఎడ్ల బండి మీద ఇల్లు కట్టడానికి వాగు నుండి తట్ట ఇసుకను తీసుకపోతే ఆ బండిని సీజ్‌ చేసి స్టేషన్‌లో పెట్టే పోలీసులు, రెవెన్యూ అధికారులకు.. అడవిలో వన్యప్రాణుల ఘోష వినిపించడం లేదా..? బుల్డోజర్లు కనిపించడం లేదా? అని ప్రవీణ్‌ కుమార్‌ ప్రశ్నించారు. అటవీ శాఖా మంత్రి కొండా సురేఖ ఎక్కడ? విద్యార్థులను కిరాయి ఉద్యమకారులన్న రెవెన్యూ మంత్రి పొంగులేటి రియల్‌ దందాలపై ఉన్నతస్థాయి విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. రాఘవ కన్స్ట్రక్షన్స్‌ కడుతున్న కట్టడాలను ప్రజలు ఎవరూ కొనకుండా బహిష్కరించాలి అని ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ అన్నారు.

Latest News

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల పట్ల హర్షం

పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు. బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్ దేశవ్యాప్తంగా...
- Advertisement -spot_img

More Articles Like This