Wednesday, April 16, 2025
spot_img

ఆన్‌లైన్‌ అవస్థలు

Must Read
  • యువ‌త‌కు గోస‌పెట్టిస్తున్న రాజీవ్‌ యువ వికాసం పథకం
  • నేటితో యువ వికాసం ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది
  • రూ.50వేల నుండి 4ల‌క్ష‌ల వ‌ర‌కు రుణాలు
  • రికార్డు స్థాయిలో 14ల‌క్ష‌ల ద‌ర‌ఖాస్తులు
  • దెబ్బకు రెండు రోజులుగా స‌ర్వ‌ర్ డౌన్
  • వ‌రుస‌ సెలవుల‌తో యువ‌త ఇబ్బందులు
  • ఆదాయ, కుల సర్టిఫికెట్ల కోసం ఎదురుచూపులు
  • యువ వికాసం ద‌ర‌ఖాస్తుదారుల్లో అందోళ‌న
  • జూన్ 2న రుణాల పంపిణీకి శ్రీకారం..!

సుదీర్ఘ కాలం త‌రువాత యువ‌త‌కు లోన్లు ఇస్తామ‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించ‌డంతో ఒక్క‌సారి నిరుద్యోగుల్లో ఆశ‌లు రెగాయి. ప్ర‌భుత్వ కొలువు రాకున్న ప్ర‌భుత్వ సాయంతోనైన ఏదో విధంగా జీవ‌నోపాధి పొందువ‌చ్చ‌ని ఆశ‌ప‌డ్డారు. కాని చివ‌రి నిమిషంలో ప్ర‌భుత్వ స‌ర్వ‌ర్లు మోరాయించ‌డంతో యువ‌త ఆశ‌ల పై నీళ్ళు చ‌ల్లిన‌ట్టు అయింది. నేడు చివ‌రి రోజు కావ‌డంతో ఆరోజైన స‌ర్వ‌ర్లు ప‌నిచేస్తాయా అనే అందోళ‌న యువ‌త‌లో నెల‌కుంది.

ప్ర‌భుత్వం చాలా కాలం త‌రువాత నిరుద్యోగ యువ‌త‌కు లోన్లు ఇచ్చే కార్యక్ర‌మానికి శ్రీకారం చుట్టిన నేప‌థ్యంలో రాష్ట్ర యువ‌త‌లో అనేక ఆశ‌లు రేకెత్తించాయి. అయితే ములిగే న‌క్క మీద తాటికాయ ప‌డిన‌ట్టుగా ద‌ర‌ఖాస్తుల‌కు నేడు చివ‌రి రోజు కావ‌డం.. దానికి తోడు వ‌రుస‌గా మూడు రోజుల పాటు సెల‌వులు రావ‌డం వారిలో అందోళ‌న రేపుతుంది. దీనికి తోడు గ‌త రెండు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా మీసేవ స‌ర్వ‌ర్లు మోరాయిస్తున్నాయి. గ‌తంలో ఎపుడు లేని విధంగా యువ‌విక‌సానికి సుమారు 14ల‌క్ష‌ల మంది మీసేవ ద్వారా ద‌ర‌ఖాస్తులు చేసుకున్నారు. ఈ ద‌ర‌ఖాస్తులను ప్ర‌భుత్వం మార్చి 24 నుండి స్వీక‌రిస్తుండ‌గా ఏప్రిల్ 14వ తేది దీనికి చివ‌రి తేదిగా నిర్ణ‌యించింది. అదే స‌మ‌యంలో ఎంపికైన ల‌బ్దిదారుల‌కు జూన్ 2న రుణాల‌ను మంజూరు చేసే కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుడ‌తామ‌ని కూడా ప్ర‌క‌టించారు. అయితే స‌మ‌యం స‌మీపిస్తున్న త‌రుణంలో గ‌డిచిన వారంరోజులుగా ల‌క్ష‌లాది మంది నిరుద్యోగ యువ‌త మీ సేవా కేంద్రాల ద‌ర‌ఖాస్తుల‌ను చేసుకునేందుకు ప్ర‌య‌త్నించారు. ఈదెబ్బ‌కు ద‌ర‌ఖాస్తుల‌కు సంబందించిన స‌ర్వ‌ర్ శుక్ర‌వారం నాడు సాయంత్రం నుండి నెమ్మ‌దించింది. దీంతో గ‌డిచిన రెండు రోజులుగా యువ‌త మీ సేవా కేంద్రాలు, ఇంట‌ర్ నెట్ సెంట‌ర్ల చుట్టు తిరుగుతున్న ప్ర‌యోజ‌నం లేకుండా పోయింది. వ‌రుస‌గా మూడు రోజుల పాటు సెల‌వులు కూడా రావ‌డంతో అటు ప్ర‌భుత్వ అధికారులు కూడా ఎవ్వ‌రూ అందుబాటులో లేకుండా పోయ్యారు. ముఖ్యంగా ప్రభుత్వం ఏ పథకాన్ని ప్రారంభించిన దానికి సంబంధించిన పత్రాలను జతపరచాలంటే సదరు సర్టిఫికెట్లను పొందాలంటే మీసేవ కేంద్రానికి వెళ్లాల్సిందే. ముఖ్యంగా కుల‌, అదాయ స‌ర్టిఫ్ట‌కేట్ల కోసం ఇప్ప‌టికే ల‌క్ష‌ల సంఖ్య‌లో యువ‌త ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. అదేవిధంగా రాజీవ్ యువ వికాసం ద‌ర‌ఖాస్తుల‌ను కూడా మీ సేవ కేంద్రాల్లో సబ్మిట్ చేయాల్సి ఉండటంతో ఒక్కసారిగా మీ సేవ కేంద్రాలకు జనాల తాకిడి పెరిగింది.

రూ.50వేల నుండి 4ల‌క్ష‌ల వ‌ర‌కు రుణాలు,…
రాజీవ్ యువ వికాస్ కింద ఒక్కరికి కనీసం 50,000 నుంచి 4 లక్షల వరకు ప్రభుత్వం రుణాలు ఇస్తుంది. ఈ రుణాలు పొందాలంటే అర్హతగా వైట్ రేషన్ కార్డ్ లేదంటే గ్రామీణ ప్రాంతాల్లో లక్షన్నరలోపు పట్టణ ప్రాంతాల్లో రెండు లక్షల వరకు ఆదాయం ఉన్నట్టుగా ఇన్కమ్ సర్టిఫికెట్ ని ద‌ర‌ఖాస్తు దారుడు త‌న ద‌ర‌ఖాస్తుతో పాటు జ‌త చేయాల్సి ఉంది. దీంతో చాలా మంది అదాయ, కుల స‌ర్టిఫికెట్ల కోసం ఎగ‌బ‌డ‌డంతో మీ సేవలో తాకిడి పెరిగింది. ఇలా వ‌చ్చిన ద‌ర‌ఖాస్తుల‌ను కేటగిరీల వారీగా విభ‌జించ‌నున్నారు. కార్పొరేషన్లు, సమైక్యలవారీగా విభజించి సుమారు రూ.9వేల కోట్లను నిరుద్యోగ యువతకు రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం భావించిన నేపథ్యంలో ఈ నెల 16న బ్యాంకర్లతో సమావేశమై రుణాలు తదితరు అంశాలపై కార్యచరణ రూపొందించనున్నట్లుగా స‌మాచారం. రాజీవ్ యువ వికాసం పథకం కింద రుణాలు పొందాలంటే అవసరమైన అదాయ‌, కుల సర్టిఫికెట్ కోసం మార్చి 24 నుండి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 13.98 లక్షల దరఖాస్తులు రావ‌వ‌డం గ‌మ‌నార్హం. గత 15 రోజుల్లో 11.34 లక్షల అప్లికేషన్లను యాక్సెప్ట్ చేయ‌గా ఇంకా 2.64 లక్షల దరఖాస్తులు అన్‌లైన్లో పెండింగ్లో ఉన్నాయి. అయితే సర్వర్లు డౌన్ సమస్య కార‌ణంతో వీరికి అందాల్సిన స‌ర్టిఫికెట్లు అంద‌క‌పోవ‌డంతో వారిలో నిరాశ‌, అందోళ‌న నెల‌కుంది. వ‌రుస సెల‌వుల‌ను దృష్టిలో వుంచుకుని స‌మ‌యాన్ని మ‌రో వారం రోజులైన పొడిగిస్తే త‌మ‌కు కూడా న్యాయం చేసిన‌ట్లు అవుతుంద‌ని వారు అంటున్నారు. అయితే ఇప్ప‌టికే ఓసారి ప్ర‌భుత్వం స‌మ‌యం పొడ‌గించిన నేప‌థ్యంలో మ‌రోసారి స‌మ‌యం ఇస్తుందా అనే విష‌యం మాత్రం వేచి చూడాలి.

Latest News

రాష్ట్రంలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాం

అనేకకార్యక్రమాలు అమలుచేసి చూపాం సిఎల్‌పి సమావేశంలో మల్లు భట్టి విక్రమార్క కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఎంతో నిబద్ధతతో పనిచేస్తోందని, లబ్ధిదారులు ఈ పథకాలను హృదయపూర్వకంగా...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS