ఓ పట్టభద్రులారా!.. మీ చేతితో కొన్ని వేల అక్షరాలు రాసిన మీరు.. ఓటు ఎలా వేయాలో అర్థం కాలేదా? పట్టభద్రుల ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థుల మూడు సంవత్సరాల భవిష్యత్తుతో ఆటలు ఆడుకుంటిరి కదా అభిమానం ఉంటే గుండెల్లో దాచుకోండి! వ్యతిరేకత ఉంటే ఓటు తెలపాలని కానీ, అమూల్యమైన ఓటును వృధా చేసి ఏమి సాధించారు? పదే, పదే విన్నవించినా, తప్పులు చేస్తే ఏమనాలి! మీ అజ్ఞానానికి ఎన్ని వెయ్యిల ఓట్లు చెల్లకుండా పోయాయో తెలుసా! నిబద్ధతతో ఓటు వేయాలాని కూడ తెల్వదా! అవగాహన లోపమా, కావాలనే చేశారా.. మీ అంతరాత్మను ఒకసారి ప్రశ్నించుకోండి..? అక్షరాస్యుల కంటే, నిరక్షరాశులే మేలు అనే విధంగా ప్రవర్తించారు.. ఓటుకున్నా విలువను నాశనం చేశారు..