- ఆఫర్ల పేరుతో మోసానికి పాల్పడుతున్న జేఎన్ఆర్ ఇన్‌ఫ్రా భారీ మోసం
- స్పెషల్ గిఫ్ట్ ల పేరుతో ప్రజలకు టోకరా
- యాదాద్రి జిల్లా బొందుగుల్లలో మరో ఫ్రీ లాంచ్
- రంగుల బ్రోచర్స్‌తో ఆకర్షిస్తూ అమాయకుల నుండి డబ్బులు దండుకుంటున్న వైనం
- స.నెం. 762, 763లోని 8 ఎకరాల 26 గుంటల్లో వెంచర్
- ధరణిలో సంస్థ పేరుతో ఎలాంటి భూమి లేకున్న ఎరా గ్రీన్ ఫామ్ ప్లాట్స్ అమ్మకాలు
- రెవెన్యూ అధికారులు నుంచి పూర్తి సహకారం ఉన్నట్లు ఆరోపణలు
యాదాద్రి భువనగిరి జిల్లాలో మరో ఫ్రీ లాంచ్ పేరుతో జేఎన్ఆర్ ఇన్‌ఫ్రా భారీ మోసానికి తెరలేపింది. రాజాపేట మండలంలోని బొందుగుల్ల గ్రామంలో కొత్త ప్రాజెక్టును స్టార్ట్ చేసింది. ఫామ్ ప్లాట్స్ కోసం ఫ్రీ లాంచ్ ఆఫర్లతో జేఎన్ఆర్ ఇన్‌ఫ్రా సంస్థ చైర్మన్ సుప్రియ పసుమర్తి మోసానికి పాల్పడుతున్నారు. ‘అరచేతిలో వైకుంఠం చూపినట్లు’ జేఎన్ఆర్ ఇన్‌ఫ్రా ఎరా గ్రీన్ ఫామ్ ప్లాట్స్ పేరుతో ప్రజలను నిండా ముంచుతున్నారు. ఫ్రీ లాంచ్ అంటూ రంగురంగుల బ్రోచర్స్‌తో అమాయకులను బొక్కాబొర్లపడేస్తున్నారు. అమాయక ప్రజల నుండి లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్నారు. సర్వే నెంబర్ 762, 763లలోని 8 ఎకరాల 26 గుంటల్లో కొత్తగా వెంచర్ చేసి భారీ మోసానికి పాల్పడుతున్నారు. ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతులు లేకుండా సంస్థ ఫామ్ ప్లాట్స్ పేరుతో అమ్మకాలు చేస్తూ ప్రజలను దగా చేస్తున్నారు.. ఒక్కో ప్లాట్ కు ఒక్కో రేటు పెట్టి ఆశచూపుతున్నారు. అరగుంట అయితే రూ. 2,50,000, ఒక గుంట అయితే రూ. 4,50,000, 5 గుంటలు అయితే రూ. 25,00,000 + సింగల్ బెడ్‌రూం కట్టించి ఇస్తున్నట్లు ప్రజలను మోసం చేస్తున్నారు.
‘ఆశగలమ్మ దోషమెరుగదు… పూటకూళ్లమ్మ పుణ్యమెరుగదు’ అన్నట్టు జేఎన్ఆర్ ఇన్ ఫ్రా సంస్థ చేస్తున్న మోసాలకు ఎవరూ అడ్డుచెప్పక పోవడం గమనార్హం. జేఎన్ఆర్ ఇన్‌ఫ్రా బుకింగ్ సమయంలో ఫుల్ పేమెంట్ చెల్లించినచో 61 గజాలకు ఒక గ్రామం బంగారం, ఒక గుంట అయితే 2 గ్రాముల బంగారం, 3 గుంటల అయితే ఒక టాబ్, 5 గుంటల అయితే గోవా ట్రిప్, 10 గుంటలు అయితే ఒక ఐఫోన్, 15 గుంటలు అయితే స్కూటి లేక బైక్, 30 గుంటలు అయితే బులెట్ ను బోనాజా ఆఫర్‌గా ప్రచారం చేసుకుంటూ ప్రజల్ని నిండా ముంచుతున్నారు. ‘కంటికి ఇంపైతే నోటికీ ఇంపే’ అన్న చందంగా భూములను కొనుగోలు చేసేందుకు అమాయకులను చేసి కొనేలా గాలం వేస్తున్నారు. పైనంగా కేవలం జేఎన్ఆర్ ఎరా గ్రీన్ ఫామ్స్ అందిస్తున్న ఆఫర్ అంటూ ప్రగ్బాలు పలుకుతూ ప్రజలను మోసం చేస్తున్నారు. అంతే కాకుండా.. 100 శాతం వాస్తు, క్లియర్ టైటిల్, వికెండ్ హోమ్స్, స్పాట్ రిజిస్ట్రేషన్, పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్‌మెంట్, సిజనల్ ఫ్రూట్స్ మొక్కలు, ఇంటర్ క్రాప్ సిస్టమ్, డ్రిప్ ఇరిగేషన్, 24 గంటల సెక్యూరిటీ, 25-30 ఫీట్ల రోడ్లు అంటూ ఆకర్షనీయమైన బ్రోచర్లతో జేఎన్ఆర్ ఎరా గ్రీన్ ఫామ్ ప్లాట్స్ అమ్మకాలతో జనాల్ని ఆకర్షిస్తుంది.
ఇదీలా ఉంటే ప్రభుత్వ వెబ్ సైట్ ధరణిలో సర్వే నెంబర్ 762, 763లలో సంస్థ పేరుతో గానీ, సభ్యులకు ఎలాంటి భూమి లేకున్నా కూడా ఎరా గ్రీన్ ఫామ్ ప్లాట్స్ అమ్మకాలు జరుపుతున్నారు. వీరికి స్థానిక రెవెన్యూ అధికారులు పూర్తి సహకారాన్ని అందిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఆఫర్ల పేరుతో మోసానికి పాల్పడుతున్న జేఎన్ఆర్ సంస్థ చైర్మన్ కు రెవెన్యూ సహా రాజకీయ నేతల సపోర్ట్ ఉందనే ప్రచారం జరుగుతుంది. ఎలాంటి అనుమతులు లేకుండా ప్రజలను మోసం చేస్తున్న జేఎన్ఆర్ ఇన్‌ఫ్రా చైర్మన్ సుప్రియ పసుమర్తిపై, సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.