Saturday, April 19, 2025
spot_img

వర్సిటీ భూములపై సర్కార్‌కు చెంపదెబ్బ

Must Read
  • కంచగచ్చబౌలి భూములపై సుప్రీం సీరియస్‌
  • సుప్రీం మార్గదర్శకాలు విస్మరించి చెట్ల నరికివేతపై ఆగ్రహం
  • ఆ భూముల్లోనే తాత్కాలిక జైలు నిర్మించి అధికారులను వేస్తాం
  • నాలుగు వారాల్లో పునరుద్దరణ నివేదిక సమర్పించాలని ఆదేశం
  • స్టేటస్‌కో కొనసాగుతుందని వెల్లడి.. విచారణ మే 15కు వాయిదా

కంచ గచ్చిబౌలి భూముల అంశంపై సుప్రీంకోర్టులో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. చెట్ల నరికివేతపై రేవంత్‌ సర్కార్‌పై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. చెట్లు కొట్టేసే ముందు అనుమతులు తీసుకున్నారో లేదో స్పష్టంగా చెప్పాలని జస్టిస్‌ బీఆర్‌ గవాయి నిలదీశారు. సీఎస్‌ను కాపాడాలని అనుకుంటే.. వంద ఎకరాలను ఎలా పునరుద్ధిస్తారో చెప్పాలని అన్నారు. దీనిపై నాలుగు వారాల్లో ప్రణాళిక సిద్ధం చేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి విచారణను మే 15వ తేదీకి వాయిదా వేశారు. అప్పటి వరకు స్టేటస్‌ కో కొనసాగుతుందని అన్నారు. కంచ గచ్చిబౌలి భూముల అంశంపై జస్టిస్‌ బీఆర్‌ గవాయి నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా చెట్లు కొట్టివేసే ముందు అనుమతులు తీసుకున్నారో లేదో స్పష్టంగా చెప్పాలని జస్టిస్‌ బీఆర్‌ గవాయి ప్రశ్నించారు. దీనికి ప్రభుత్వ తరఫున లాయర్‌ స్పందిస్తూ జామాయిల్‌ తరహా చెట్లు-, పొదలను అనుమతి తీసుకునే తొలగించామని తెలిపారు. అందుకు చెట్ల నరికివేతపై సమర్థించుకోవద్దని జస్టిస్‌ బీఆర్‌ గవాయి ఆగ్రహం వ్యక్తం చేశారు. 1996లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం అనుమతులు తీసుకున్నారో లేదో చెప్పాలన్నారు. వారంతపు సెలవుల్లో మూడు రోజుల్లో చెట్లు కొట్టాల్సిన తొందర ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. విూరు చెట్లు కొట్టడం వల్ల అక్కడ జంతువుల విూద కుక్కలు దాడి చేస్తున్నాయని.. ఆ వీడియోలను చూసి ఆందోళనకు గురయ్యామని తెలిపారు.

పర్యావరణ పరిరక్షణలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అవసరమైతే 2400 ఎకరాల్లో ఒక్క చెట్టు కూడా కొట్టకుండా ఆదేశాలివ్వాల్సి వస్తుందని తెలిపారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఊరుకోమని జస్టిస్‌ గవాయి హెచ్చరించారు. భూముల మార్టిగేజ్‌తో తమకు సంబంధం లేదని.. చెట్ల నరికివేత గురించే తాము మాట్లాడుతున్నామని చెప్పారు. కంచ గచ్చిబౌలిలో అడవులు లేవని వాదిస్తే.. అదే ప్రాంతంలో జైలు కట్టి అందులోనే అధికారులను పెట్టాల్సి ఉంటుందని జస్టిస్‌ బీఆర్‌ గవాయి హెచ్చరించారు. చెట్లు కొట్టేసే ముందు అనుమతి ఉందా లేదా అన్నదే ముఖ్యమని తెలిపారు. అనుమతులు లేకుండా చెట్లు- కొట్టేసినందుకు సీఎస్‌ సహా అధికారులు జైలుకు వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించారు. సీఎస్‌ను కాపాడాలనుకుంటే.. వంద ఎకరాలను ఎలా పునరుద్ధిస్తారో చెప్పాలన్నారు. పునరుద్ధరణ ఎలా చేస్తారు? ఎంతకాలంలో చేస్తారు? జంతు జాలాన్ని ఎలా సంరక్షిస్తారో స్పష్టంగా చెప్పాలని ఆదేశించారు. దీనిపై నాలుగు వారాల్లో ప్రణాళిక ఫైల్‌ చేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణలో వాల్టా చట్టం అమలులో ఉందని, దాని ప్రకారం స్వయం అనుమతులుగా ప్రభుత్వం వ్యవహరించిందని అమికస్‌ క్యూరీ సుప్రీంకు వివరించారు.

పర్యావరణాన్ని కాపాడటానికి మేము ఇక్కడ ఉన్నాం. అధికారుల అనుమతి లేకుండా ఎన్ని చెట్లను నరికివేశారో అనే ఆందోళన మాత్రమే ఉంది. చెట్లను ఎలా పునరుద్ధరిస్తారో చెప్పాలి. మేము బుల్డోజర్‌ ఉనికి, 100 ఎకరాల అడవిని తొలగించడం గురించి మాత్రమే ఆందోళన చెందుతున్నాం. విూరు నిర్మించాలనుకుంటే, మీరు అనుమతులు తీసుకొని ఉండాలి అని జస్టిస్‌ అన్నారు. 2004 నుంచి ఈ భూముల వ్యవహారం, కోర్టుల్లో ఉన్న పరిస్థితి, తర్వాత చుట్టుపక్కల జరిగిన అభివృద్ధి, ఐటి పార్కు, ఇతర ప్రాజెక్టులకు సంబంధించిన వివారలను కోర్టుకు చెప్పారు. అయితే వంద ఎకరాల్లో జరిగిన నష్టాన్ని ఎలా పూడ్చాలన్న విషయం పైనే మేము దృష్టి సారించాలని అంటున్నామని జస్టిస్‌ గవాయ్‌ అన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఏమైనా చేస్తాం.ఆ భూముల్లో ఉన్న జంతుజాలాన్ని ఎలా సంరక్షిస్తారో చెప్పాలన్నారు. ఆర్టికల్‌ 142 కింద పర్యావరణ పరిరక్షణ కోసం ఏమైనా చేస్తాం. పునరుద్ధరణను అడ్డుకునే ప్రయత్నం చేస్తే, విూ అధికారులను తాత్కాలికంగా జైలుకు పంపిస్తాం అని కఠినంగానే అన్నారు. 100 ఎకరాల్లో జరిగిన నష్టం కారణంగా ప్రభావితమైన వన్యప్రాణులను రక్షించేందుకు అవసరమైన తక్షణ చర్యలను పరిశీలించి, అమలులోకి తీసుకురావాలని తెలంగాణ వన్యప్రాణి సంరక్షణాధికారిని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. పునరుద్ధరణ ఎలా చేస్తారు, ఎంత కాలంలో చేస్తారు, జంతు జలాన్ని ఎలా సంరక్షిస్తారో స్పష్టంగా చెప్పాలని తెలంగాణ ప్రభుత్వాన్ని సుప్రీం ఆదేశించింది. నాలుగు వారాల్లో ప్రణాళిక ఫైల్‌ చేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది ధర్మాసనం. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో స్టేటస్‌ కో కొనసాగించాలని ఆదేశాల్లో పేర్కొంది. తదుపరి విచారణను మే 15కు సుప్రీం కోర్టు వాయిదా వేసింది.

Latest News

ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్.. చాలా ఆనందాన్ని ఇచ్చింది

అర్జున్ S/O వైజయంతి సక్సెస్ ప్రెస్ మీట్ లో హీరో నందమూరి కళ్యాణ్ రామ్ నందమూరి కళ్యాణ్ రామ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ అర్జున్ S/O వైజయంతి....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS