చిట్యాల పట్టణ కేంద్రంలో పాలసీతలీకరణ కేంద్రానికి ఎదురుగా ఉన్న చెత్త డంపింగ్ యార్డు ను తొలగించి పోతరాజు చెరువును పునరుద్దరణ చేయాలి అని డిమాండ్ చేశారు సిపిఐ చిట్యాల మండల కార్యదర్శి ఎండి అక్బర్.నాయకులతో కలిసి డంపింగ్ యార్డ్ ను పరిశీలించారు.ఈ సంధర్బంగా అక్బర్ మాట్లాడుతూ డంపింగ్ యార్డ్ ఉపయోగించడం వల్ల కాలనివాసులకు,రహదారి వెంట వెళ్తున్న వారికి దుర్వాసన కారణంగా వివిధ రోగాల బారిన పడుతున్నారని తెలిపారు.గతంలో కూడా ఇక్కడి నుండి డంపింగ్ యార్డ్ ను తొలగించాలని ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.పోతరాజు చెరువు సమీపంలో ఉన్న అక్రమ కట్టడాలను తొలగించలని డిమాండ్ చేశారు.పోతరాజు చెరువును పునరుద్ధరణ చేయాలని లేనిపక్షంలో సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున్న పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.తక్షణమే అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ చిట్యాల పట్టణ కార్యదర్శి ఎస్కే షరీఫ్,సీనియర్ నాయకులు దేశ గాని బాలరాజు,గుండాల సత్తయ్య,నామనంది అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
Must Read