- కవిత కస్టడీ కోరుతూ సప్లిమెంటరీ ఛార్జ్ షిట్ ను దాఖలు చేసిన సిబిఐ
- సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్ షిట్ ను అంగీకరించిన రౌస్ అవెన్యూ కోర్టు
- జూన్ 21 వరకు జ్యూడిషియల్ రిమాండ్
- పుస్తకాలూ కోరిన కవిత
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది.కవిత జ్యూడిషియల్ కస్టడీ కోరుతూ సీబీఐ సప్లిమెంటరీ ఛార్జ్ షిట్ ను దాఖలు చేసింది.సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్ షిట్ ను రౌస్ ఎవెన్యూ కోర్టు అంగీకరించింది.మరో రెండు వారాలపాటు అంటే జూన్ 21 వరకు కవితకు జ్యూడిషియల్ రిమాండ్ విధించింది.దింతో జూన్ 21 వరకు కవిత జ్యూడిషియల్ కస్టడీలో ఉండనున్నారు.మరోవైపు చదువుకోవడానికి 09 పుస్తకాలూ కావాలని కోర్టును కోరగా , ఆమె కోరికను కోర్టు అంగీకరించింది.ఇక విచారణను జూన్ 21 వాయిదా వేసింది కోర్టు.