Sunday, August 31, 2025
spot_img

తాళం వేసి ఉన్న ఇల్లే టార్గెట్‌గా.. చోరీలు

Must Read
  • ముగ్గురు అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్‌
    పలు రాష్ట్రాలలో పోలీసుల కళ్ళు కప్పి తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను పెద్దపల్లి డివిజన్‌ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుండి 1,70,000 రూపాయల నగదు, 13.6 తులాల ఆభరణాలు, ఒక పల్సర్‌ బైక్‌ స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.పెద్దపల్లి ఏసిపి జి కృష్ణ గురువారం సుల్తానాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ లో పత్రికా సమావేశం నిర్వహించారు. పెద్దపల్లి ఏసిపి తెలిపిన వివరాల ప్రకారం.. ఓదెల మండలంలోనీ వైన్స్‌ లో కొద్ది రోజుల క్రితం దొంగతనం జరిగిందని, సిసి ఫుటేజ్‌ ఆధారంగా అంతరాష్ట్ర దొంగలను గుర్తించామని తెలిపారు. దొంగతనాలకు పాల్పడుతున్న ఖమ్మం జిల్లాకు చెందిన గుర్రం కోటేశ్వర్‌(29), సాకిని వాసు (33), ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని బాపట్ల (కర్లపాలెం) కు చెందిన షేక్‌ ఖాజా గరీబ్‌ అనే నిందితులను ఓదెల మండలంలో కొద్దిరోజులుగా అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు బుధవారం రోజున పట్టుకున్నారు. వీరు గతంలో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని సుల్తానాబాద్‌,పోత్కపల్లి కాల్వ శ్రీరాంపూర్‌, జూలపల్లి, పెద్దపల్లి, కమాన్‌ పూర్‌, ధర్మారం, లక్షిట్‌ పేట్‌, ధర్మపురి, గంగాధర పోలీస్‌ స్టేషన్ల పరిధిలో పలు దొంగతనాలకు పాల్పడ్డారని, వీరిపై ఆయా రాష్ట్రాలలో పలు సెక్షన్ల కింద కేసులు నమోదై, జైలు కు కూడా వెళ్లారని ఏసిపి జి కృష్ణ తెలిపారు. వీరిపై ఆయా రాష్ట్రాలలో 26 కి పైగా కేసులు నమోదయ్యాయని తెలిపారు. సీసీ కెమెరాల ఆధారంగా అంతరాష్ట్ర దొంగలను పట్టుకున్న పెద్దపల్లి ఏసిపి జి కృష్ణ, సుల్తానాబాద్‌ సీఐ సుబ్బారెడ్డి, సుల్తానాబాద్‌ ఎస్సై శ్రావణ్‌ కుమార్‌, పెద్దపల్లి సిఐ కృష్ణ, జూలపల్లి ఎస్సై శ్రీధర్‌, కాల్వ శ్రీరాంపూర్‌ ఎస్సై ఓంకార్‌ యాదవ్‌, పొత్కపల్లి ఎస్సై అశోక్‌ రెడ్డి, పెద్దపల్లి ఎస్‌ఐ లక్ష్మణ్‌ రావు,AూI తిరుపతి, రత్నాకర్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ నల్లవెల్లి సుధాకర్‌, ఇతర పోలీస్‌ సిబ్బందిని రామగుండం కమిషనర్‌ రివార్డ్‌తో అభినందించారు.
Latest News

రాష్ట్రంలో వరదలపై సీఎం రేవంత్ సమీక్ష

సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశం తెలంగాణలో పలు జిల్లాలను ముంచెత్తుతున్న భారీ వర్షాలు, వరదల పరిస్థితులపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అత్యవసర సమీక్షా సమావేశం...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS