ఛత్తీస్ గఢ్ లో మరోసారి భారీ ఎన్ కౌంటర్ జరిగింది.నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఐదుగురు నక్సలైట్ లు మరణించిగా,ముగ్గురు జవాన్లు గాయపడినట్టు తెలుస్తుంది.ఓర్చా ప్రాంతంలోని గోబెల్ గ్రామ సమీపంలోని అడవిలో ఈ కాల్పులు జరిగినట్టు పోలీసులు తెలిపారు.ఈ ఆపరేషన్ లో రిజర్వ్ గార్డ్ , 45 వ బెటాలియన్ కు చెందిన ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ లు పాల్గొనట్టు సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు.ఘటన స్థలంలో 05 మృతదేహాలు , ఆయుధాలు స్వాధీనం చేసుకునట్టు అయిన తెలిపారు.