Friday, November 22, 2024
spot_img

రామోజీ రావు మరణం పట్ల సంతాపం తెలిపిన నరేంద్ర మోడీ

Must Read

  • అనారోగ్యంతో ఉదయం 4 గంటలకు కన్నుమూసిన ఈనాడు అధినేత రామోజీరావు
  • రామోజీరావు మరణవార్త దిగ్భ్రాంతికి గురిచేసింది : మోడీ
  • పత్రిక రంగంలో నూతన ప్రమాణాలు నెలకొల్పారు
  • తెలుగు మీడియా,పత్రిక రంగానికి రామోజీరావు లేని లోటు ఎప్పటికి పూడ్చలేము : సీఎం రేవంత్
  • రామోజీరావు అంతక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని ఆదేశాలు జారీచేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఈనాడు చైర్మన్ రామోజీరావు చెరుకూరి రామోజీరావు అనారోగ్యంతో శనివారం ఉదయం 4గంటలకు తుదిశ్వాస విడిచారు.శుక్రవారం తీవ్ర అస్వస్థతకు గురైన రామోజీరావును హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుప్రతికి తరలించారు.అక్కడ చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం 4 గంటలకు కన్నుమూశారు.1936 నవంబర్ 16న కృష్ణ జిల్లాలో జన్మించారు.1947 లో ఈనాడు దినపత్రికను ప్రారంభించి తెలుగునాట జర్నలిజంలో సంచలనం సృష్టించారు.

రామోజీ రావు మరణవార్త దిగ్భ్రాంతికి గురిచేసింది : ప్రధాని మోడీ

రామోజీరావు తుదిశ్వాస విడిచారని తెలుసుకున్న ప్రధాని మోడీ సంతాపం వ్యక్తం చేశారు.రామోజీరావు మరణ వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని మోడీ పేర్కొన్నారు.రామోజీరావు పత్రిక రంగంలో నూతన ప్రమాణాలు నెలకొల్పారని, భారతీయ మీడియను విప్లవాత్మకంగా మార్చిన గొప్ప దార్శనికుడని గుర్తుచేశారు.పత్రిక సినీ రంగాల పై చెరగని ముద్ర వేశారని ఈ సందర్బంగా మోడీ తెలిపారు.భారత దేశం అభివృద్ధి పై రామోజీ రావు చాల మక్కువ చూపేవారని గుర్తుచేశారు.

పత్రిక రంగానికి రామోజీరావు లేని లోటు ఎప్పటికి పూడ్చలేనిది : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

తెలుగు మీడియా,పత్రిక రంగానికి రామోజీరావు లేని లోటు ఎప్పటికి పూడ్చలేనిది అని అన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
రామోజీరావు మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది అని ట్వీట్ చేశారు.తెలుగు జర్నలిజానికి విశ్వసనీయత,తెలుగు పారిశ్రామ రంగానికి విలువలు జోడించిన ఘనత రామోజీ రావుకె దక్కుతుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.రామోజీ రావు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తూ… కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.రామోజీరావు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించాల్సిందిగా రంగారెడ్డి కలెక్టర్, సైబరాబాద్ కమిషనర్ కు సీఎస్ ద్వారా ఆదేశాలను జారీచేశారు.

Latest News

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చు : టీజీపీఎస్సీ

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 పరీక్షల హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 02 పరీక్షలు జరగనున్నాయి....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS