- టీఎస్ఐఐసీ స్థలాలకు రక్షణ లేదు
- పటాన్ చెరు జోనల్ మేనేజర్ కనుసన్నల్లోనే నిర్భయంగా అక్రమ నిర్మాణాలు..
- సీజ్ ను తొలగించి కాలువను పూడ్చిన దాష్టీకం..
- వందల కోట్ల విలువైన స్థలాలు అన్యాక్రాంతం
- నిమ్మకు నీరెత్తినట్లు ఉంటూ పట్టించుకోని అధికారి..
- ఆక్రమ నిర్మాణాలను ఎందుకు కూల్చడం లేదు. ..?
- ప్రభుత్వ స్థలాలను ప్రైవేటు పరం చేయుటకు కంకణం కట్టుకున్న మహిళా అధికారిణి..
- జోనల్ మేనేజర్ గా ఆమె బాధ్యతలు ఏమిటో అర్థం కాదు ..
- ప్రభుత్వం జీతమిస్తున్నది అన్యాక్రాంతం అవుతున్న స్థలాలను రక్షించడానికా..? కబ్జాదారులకు వత్తాసు పలకడానికా..?
- మంత్రి శ్రీధర్ బాబు గారూ ఇటువైపు ఒక లుక్ వేయండి సార్..
అవి వందల కోట్ల విలువచేసే ప్రభుత్వ స్థలం.. టి ఎస్ ఐ ఐ సి ఆధీనంలో వుంది.. ఈ ప్రభుత్వ సంస్థకు ఒక మహిళా ఆధికారి జోనల్ మేనేజర్ గా గురుతర బాధ్యతలు నిర్వహిస్తోంది..దురదృష్టం ఏమిటంటే…ఆమె తన విధులను మరచి అక్రమార్జనలో తరిస్తూ….తాను ఒక మహిళ అని కూడా మరచిపోయి .. విలువైన ప్రభుత్వ స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేసి చేతులు దులుపుకోవాలని విశ్వ ప్రయత్నం చేస్తుండటం విస్మయం కలుగజేస్తుంది… సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు నియోజిక వర్గంలో రామచంద్రపురం మండలం, గ్రామ శివారులో వందల కోట్లు విలువైన ప్రభుత్వానికి సంబంధించిన టీ.ఎస్.ఐ.ఐ.సి స్థలం కలదు..సదరు స్థలం పై కబ్జారాయుల కన్ను పడింది..అక్రమ సంపాదన కోసం బరితెగించిన అక్రమార్కులు పరిశ్రమల నిర్మాణం కోసం కేటాయించిన టి.ఎస్.ఐ.సి స్థలంలో యదేచ్చగా అక్రమంగా కమర్షియల్ నిర్మాణాలు చేస్తున్నారు. చదువుకున్న నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించుట కొరకు ఇండస్ట్రియల్ కంపెనీలను ఏర్పాటు చేయుట కొరకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన టీ.ఎస్.ఐ.ఐ.సి నిబంధనల ప్రకారం స్థలం కొరకు ప్లాట్ నెంబర్ 79 కి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ కు చెందిన ప్రభుత్వ ఆధీనంలో ఉండాల్సిన స్థలం టి ఎస్ ఐ ఐ సి నిబంధనల ప్రకారం పరిశ్రమలకు కోసం కేటాయించిన స్థలంలో పరిశ్రమలు స్థాపించాలని ఆ క్రమంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని చట్టం తెలుపుతుంది.. పరిశ్రమల కోసం కేటాయించిన స్థలంలో కమర్షియల్ నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదని.. అలా చేస్తే చట్టప్రకారం క్రిమినల్ చర్యలు చేపట్టడంతో పాటు అక్రమ నిర్మాణాలను తొలగించి సదరు స్థలంలో పరిశ్రమలనే ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వమే దృష్టి సారించాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి..
ఇటీవలే తేదీ 3 8 2023 రోజున పటాన్ చెరువు స్టీల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందిన స్థలం అంటూ 12085/2023,12086/2023 గల లీజు తీసుకున్నట్లుగా చేసిన లీజ్ డీడ్ డాక్యుమెంట్లను పరిశీలిస్తే వక్కలగడ్డ వంశీకృష్ణ, వక్కలగడ్డ అభిరామ్ అనే వ్యక్తులు టిఎస్ఐఐసి నిబంధనలకు విరుద్ధంగా సబ్ లీజకు తీసుకున్నట్టుగా తేటతెల్లమవుతుంది.. పరిశ్రమల కోసం కేటాయించిన స్థలంలో ఏ పరిశ్రమనైతే నిర్మాణం చేపడతారో ఆ పరిశ్రమకు సంబంధించి ప్రాజెక్ట్ రిపోర్ట్, పూర్తి ఫైనాన్షియల్ స్టేటస్, ఎంటర్ప్రైజెస్ మెమోరండం, పార్ట్ వన్ పార్ట్ టూ లేదా జిడిటిడి సర్టిఫికేషన్, పార్ట్నర్ షిప్ డీడ్, సొసైటీ రిజిస్ట్రేషన్, అడ్రస్ ప్రూఫ్, పాన్ కార్డ్, ఇన్కమ్ టాక్స్ క్లియరెన్స్ సర్టిఫికెట్ తో పాటు మొత్తం 11 అంశాలకు సంబంధించినటువంటి నిబంధన ప్రకారం సరైన పత్రాలు సమర్పించి.. చట్టబద్ధంగా పరిశ్రమల కోసం నిర్మాణ అనుమతులు పొందాలి.. కానీ టీఎస్ఐఐసి నిబంధనలకు విరుద్ధంగా.. పటాన్ చెరు స్టీల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ఎలాంటి పరిశ్రమలను చేపట్టకుండా, టి.ఎస్.ఐ.ఐ సి నిబంధనలను ఉల్లంఘించి థర్డ్ పార్టీకి కిరాయి పేరుతో లీజుకు ఇవ్వడం.. సదరు విషయాన్ని అధికారుల దృష్టికి వెళ్లడం జరిగింది.. ఇట్టి విషయంపై స్పందించిన పటాన్ చెరు టీఎస్ఐఐసి జోనల్ మేనేజర్ అనురాధ నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకొని అక్రమ నిర్మాణదారులకు పరోక్ష సహకారం అందిస్తూ.. అన్యాక్రాంతమవుతున్న టీఎస్ఐఐసి స్థలాలను పరిరక్షించకుండా.. అక్రమార్కుల పాలు చేస్తూ విధులను వెలగబెడుతుందనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి.. రాష్ట్ర ఇండస్ట్రియల్ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు విచారణకు ఆదేశించినా సదరు ఆదేశాలను బేఖాతరు చేస్తూ అధికారులు సీజింగ్ చేసిన సీజింగ్ను తొలగించి, కమర్షియల్ యాక్టివిటీస్ జరగకుండా సదరు నిర్మాణం ముందు అధికారులు ఏర్పాటు చేసిన కాలువను పూడ్చివేసి మీరు ఆదేశిస్తే మాకేంటి అని మంత్రి దుర్ల శ్రీధర్ బాబుకి సవాలు విసిరినంత పని చేశారా..? అంటే అవుననే చెబుతున్నారు స్థానిక ప్రజలు.. టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఏది చేసినా చెల్లబాటు అవుతుందన్న చందాన వారి డబ్బు అధికార వ్యామోహంతో అక్రమ నిర్మాణాలు చేపట్టినా అవి సక్రమం చేసుకోవచ్చని అడ్డగోలు నిర్మాణ పనులు చేసి వందల కోట్ల విలువైన స్థలాన్ని కొల్లగొట్టుటకు కుయుక్తులు పన్నారు.. పటాన్ చెరు జోనల్ మేనేజర్ అనురాధ కనుసన్నలలోనే ఈ భారీ అక్రమాలు జరుగుతున్నా, సీజ్ తొలగించి కాలువను పూడ్చివేసినా తనకేమి తెలియదన్న చందాన జోనల్ మేనేజర్ అనురాధ చెబుతుండటం సదరు అధికారి అవినీతికి అద్దం పడుతుంది.. మరిన్ని వివరాలు ఆధారాలతో మీముందుకు తీసుకురానుంది ..’ ఆదాబ్ హైదరాబాద్ ‘..’ మా అక్షరం అవినీతిపై అస్త్రం ‘..