జమ్మూకాశ్మీర్ లో బస్సు పై తామే దాడికి పాల్పడినట్టు పాక్ ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబాకు చెందిన టీ.ఆర్.ఎఫ్ సంస్థ ప్రకటించింది.
ఆదివారం రియస్ లోని భక్తులతో వెళ్తున్న బస్సుపై దాడి జరిగింది.ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది.
ఈ ఘటనలో పది మంది భక్తులు మృతిచెందారు.34 మంది భక్తులు గాయపడ్డారు.గాయపడిన భక్తులకు సమీపంలో ఉన్న ఆసుప్రతికి తరలించి చికిత్స అందిస్తున్నారు.బస్సు పై కాల్పులు జరిపిన ఉగ్రవాదులు అక్కడి నుండి పరారయ్యారు.వెంటనే రంగంలోకి దిగిన భద్రత బలగాలు ఉగ్రవాదుల కోసం కుంబింగ్ చేపట్టాయి.తాజగా ఈ దాడికి పాల్పడింది తామేనంటూ టీ.ఆర్.ఎఫ్ సంస్థ ప్రకటించింది.గతంలో కూడా టీఆర్ఎఫ్ సంస్థ అనేక దాడులకు పాల్పడినట్టు తెలుస్తుంది.ఈ దాడిలో ఇద్దరు ఉగ్రవాదులు పాల్గొన్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు.ఈ ఘటనలో చనిపోయిన వారి వివరాలను ఇంకా గుర్తించలేదని పోలీసులు తెలిపారు.